ఉబర్.. బస్ రైడ్ షేరింగ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : క్యాబ్ అగ్రిగేటర్‌గా ఉన్న ఉబర్ టెక్నాలజీస్ కొద్ది రోజుల్లో భారత్‌లో ఉబర్ ఎవ్రీథింగ్ పేరు తో నూతన సర్వీసులను ప్రారంభించనుంది. రైడ్ షేరింగ్ విభాగంలో బస్‌లు, మినీ వ్యాన్ల సేవలను పరిచయం చేయనుంది. క్యాబ్ షేరింగ్ మాదిరిగానే బస్‌లు, మినీ వ్యాన్లలో కస్టమర్లు ప్రయాణించొచ్చు.
ఒక చోట నుంచి ఒకచోటుకు నిర్దేశిత మొత్తాన్ని కంపెనీ వసూలు చేస్తుంది. పైలట్ ప్రాజెక్టు కింద మొదలు పెట్టనున్న ఈ సేవలను బెంగళూరులోని ఉబర్ సాంకేతిక కేంద్రం పర్యవేక్షించనున్నట్టు తెలుస్తోంది.