రూ.55 లక్షలకే విల్లా! | V illa for rs 55 lakh | Sakshi
Sakshi News home page

రూ.55 లక్షలకే విల్లా!

Published Sat, May 12 2018 2:05 AM | Last Updated on Sat, May 12 2018 8:27 AM

V illa for rs 55 lakh  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో విల్లా కొనాలంటే మామూలు విషయం కాదు. కనీసం రూ.80 లక్షలు లేనిదే మధ్యతరగతి ప్రజలు కొనలేం. ఇక, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అయితే ఇంకాస్త ఎక్కువ కావాల్సిందే! కానీ, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిలోని ఘట్‌కేసర్‌లో కేవ లం రూ.55 లక్షలకే డూప్లెక్స్‌ విల్లాను అందిస్తోంది సుచిరిండియా. దసరా నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామంటున్నారు సుచి రిండియా గ్రూప్‌ సీఈఓ డాక్టర్‌ వై కిరణ్‌. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

ఘట్‌కేసర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అతి చేరువలోని యమ్నంపేటలో 7 ఎకరాల్లో ఒడిస్సీ విల్లా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. మొత్తం 99 డూప్లెక్స్‌ విల్లాలుంటాయి. ఒక్కో విల్లా 133 గజాల్లో 1,400 చ.అ. బిల్టప్‌ ఏరియాలో ఉంటుంది. ప్రారంభ ధర రూ.55 లక్షలు. రహేజా ఐటీ పార్క్, ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌లకు 10 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్‌.
టింబర్‌లీఫ్‌లో స్పానిష్‌ విల్లాలు..
బెంగళూరు జాతీయ రహదారిలో టింబర్‌లీఫ్‌ పేరిట మరో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 25 ఎకరాల్లో 123 విల్లాలుంటాయి. ఒక్కో విల్లా 330 గజాల్లో 3,800 బిల్టప్‌ ఏరియాలో ఉంటుంది. ధర రూ.1.85 కోట్ల నుంచి ప్రారంభం.
 యూరోపియన్‌ స్టయిల్‌లో స్పానిష్‌ ఆర్కిటెక్చర్‌తో ఉండటమే వీటి ప్రత్యేకత. గేటెడ్‌ కమ్యూనిటీలా కాకుండా రిసార్ట్‌లో ఉన్న అనుభూతి కలిగేలా ప్రాజెక్ట్‌లో 101 రకాల వసతులను అభివృద్ధి చేస్తున్నాం. 70 వేల చ.అ.ల్లో క్లబ్‌ హౌస్‌తో పాటూ స్విమ్మింగ్‌ పూల్, జిమ్, ఇండోర్‌ గేమ్స్, వాలీబాల్‌ కోర్ట్, వాక్‌ వే, జాగింగ్‌ ట్రాక్స్, గార్డెన్, అంపి థియేటర్‌ వంటివెన్నో ఉంటాయి.
 80% నిర్మాణ పనులు పూర్తయ్యా యి. 5 నెలల క్రితం నుంచే గృహ ప్రవే శాలు మొదలయ్యాయి. కొన్ని కుటుంబాలు నివాసముంటున్నాయి కూడా. దసరా నాటికి ప్రాజెక్ట్‌ పూర్తవుతుంది.


రూ.30 లక్షలకే ఫ్లాట్‌!
మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో వినూత్న ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. శంషా బాద్‌లోని సాతం రాయ్‌లో 7 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాలని నిర్ణయిం చాం. స్థల సమీకరణ పూర్తయింది. ప్లాన్లు, అనుమతులు వచ్చాక నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. మొత్తం 6 లక్షల చ.అ. బిల్టప్‌ ఏరియాలో 750 ఫ్లాట్లుంటాయి. 800 చ.అ.ల్లో 2 బీహెచ్‌కే, 1,000 చ.అ.ల్లో 3 బీహెచ్‌కే యూనిట్లుంటాయి.

ఆర్యవర్తనగరి, ఓయ్‌స్టర్‌ బ్లూ..
 త్వరలోనే సుచిరిండియా నుంచి రెండు లే అవుట్‌ వెంచర్లను కూడా ప్రారంభించనున్నాం. హకీంపేట్‌ రోడ్‌లోని తూంకుంటలో ఆర్యవర్తనగరి పేరిట 86 ఎకరాలను అభివృద్ధి చేయనున్నాం. 200 గజాల నుంచి 1,000 గజాల మధ్య మొత్తం 800 ఓపెన్‌ ప్లాట్లుంటాయి.
ఆర్యవర్తనగరి ప్రత్యేకత ఏంటంటే.. ముఖ ద్వారం నుంచి మొదలు
పెడితే ప్రాజెక్ట్‌లోని వసతులు, క్లబ్‌ హౌస్, ఇతరత్రా ఏర్పాట్లు అన్నీ రాజుల కాలాన్ని గుర్తు చేసేలా ఉంటుంది. అంటే భారీ ఏనుగు విగ్రహాలు, రాజుల చిత్ర పటాలు వంటివి ఏర్పాటు చేస్తాం. దక్షిణ, ఉత్తరాది  సమ్మిళిత ఆర్కిటెక్చర్‌ ఉంటుంది.
ఘట్‌కేసర్‌ బోగారంలోని హోలీమేరీ కళాశాలను ఆనుకొని ఓయ్‌స్టర్‌ బ్లూ పేరిట 50 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన ఈ వెంచర్‌లో 166 గజాల నుంచి 7 వేల గజాల వరకు మొత్తం 600 ఓపెన్‌ ప్లాట్లుంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement