Dream 11 Co-Founder Wife Buys 72 Crore Rupees Duplex In Mumbai - Sakshi
Sakshi News home page

డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌లో చదరపు అడుగు ధర అక్షరాల లక్ష రూపాయలు

Published Thu, Dec 23 2021 12:33 PM | Last Updated on Thu, Dec 23 2021 12:47 PM

Dream 11 Co founder Harsh Jain Wife Rachana Jain Buy A Luxury Duplex At Pedder Road In Mumbai For Rs 72 Crore - Sakshi

విలాసవంతమైన విల్లాలు, ఫార్మ్‌హౌజ్‌ల అమ్మకాలు కొనుగోళ్లు జరిగినప్పుడు కోట్లలో బేరం జరుగుతూ ఉంటుంది. కానీ చాలా రోజుల తర్వాత రియల్టీ రంగంలో ఒక డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌కి సంబంధించి కాస్ట్‌లీ డీల్‌ జరిగింది. ఇప్పటి వరకు వార్తల్లోకి ఎక్కిన డీల్స్‌లో ఇదే మోస్ట్‌కాస్ట్‌లీ అనే ప్రచారం జరుగుతోంది.

ఎక్కడంటే
వ్యాపారవేత్తలు, ఎంట్రప్యూపర్లు, బాలీవుడ్‌ స్టార్స్‌, క్రికెట్‌ ఐకాన్‌లు ఎక్కువగా నివసించే ముంబై నగరంలో దేశంలోనే డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌కి సంబంధించి కాస్ట్‌లీ డీల్‌ జరిగింది. దక్షిణ ముంబైలోని 33 సౌత్‌లో పెద్దార్‌రోడ్డులో ఇటీవల నిర్మాణ జరుపుకున్న ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో డూప్లెక్స్‌ ప్లాట్‌ ఏకంగా రూ. 72 కోట్ల రూపాయలు వెచ్చించి రచనా జైన్‌ కొనుగోలు చేశారు. ఈ డీల్‌లో భాగంగా స్టాంప్‌డ్యూటీగా 2.88 ‍కోట్లు పన్ను చెల్లించారని ఎకానమిక్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. 

ఎవరీ రచనా జైన్‌
ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌ 11 కోఫౌండర్‌ హర్ష్‌ జైన్‌ సతీమణి రచనా జైన్‌ పేరు మీద ఈ డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ రిజిస్టరయ్యింది. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఈ డూప్లెక్స్‌లో తమ అభిరచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముంబై కార్పోరేషన్‌ నుంచి అనుమతులు కూడా తెచ్చుకున్నారు. 

యూనికార్న్‌గా డ్రీమ్‌ 11 
స్టార్టప్‌ కంపెనీగా మొదలైన డ్రీమ్‌ 11 అనతి కాలంలోనే యూనికార్న్‌ కంపెనీగా మారింది. ప్రస్తుతం మార్కెట్‌ వాల్యూ ప్రకారం ఈ కంపెనీ విలువ 8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మరోవైపు రచన జైన్‌ డెంటిస్ట్‌గా ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. వీరికి క్రిష్‌ అనే కొడుకు ఉన్నాడు.


చదరపు అడుగు ధర లక్ష
జేఎస్‌డబ్ల్యూ, బోజ్‌వనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ప్రీమియం అపార్ట్‌మెంట్‌లో 29,30వ ఫ్లోర్లలో 7,375 చదరపు అడుగుల్లో విస్తరించిన అపార్ట్‌మెంట్‌ రికార్డు స్థాయి ధరకు అమ్ముడైంది. సగటున చదరపు అడుగుకి లక్ష రూపాయల ధర పలికింది. ఈ కాస్ట్‌ డూప్లెక్స్‌ డీల్‌గా భాగంగా పార్కింగ్‌ ప్లేస్‌లో ఏడు కార్లు నిలుపుకోవచ్చు. 

చదవండి:సూపర్‌స్టార్‌ మహేశ్‌.. హైదరాబాద్​లో ప్లాటు కొనుగోలు.. ఎక్కడంటే ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement