సాక్షి, న్యూఢిల్లీ : విస్తారా విమానాలకు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 128 మంది ప్రయాణికులతో బయలు దేరిన కాసేపటికే సమస్య ఎదురైంది. దీంతో విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్నితిరిగి సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వ్యవహారంపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు.
మరోవైపు 120మంది ప్రయాణికులతో బయలు దేరిన మరో విస్తారా విమానానికి కూడా దాదాపు ఇలాంటి సమస్యే ఉత్పన్నమైంది. ఎయిర్‌బస్ ఎ320 విమానం ఇంజన్‌లో సమస్య కారణంగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. చెన్నై నుంచి కోలకత్తా విమానంలో ల్యాండింగ్ సందర్భంగా సోమవారం ఉదయం ఈ ఉదంతం చోటు చేసుకుంది. అయితే పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి, కోలకతా అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా విమానాన్ని లాండ్ చేశారు. దీంతో అటు ప్రయాణీకులు, ఇటు సిబ్బంది సహా ఎయిర్‌లైన్స్ అధికారులు ఊరట చెందారు. విమానంలో తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించేందుకు తగిన పరీక్షలు జరుగుతున్నాయని విస్తారా అధికారులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment