వోక్సెన్ స్కూల్ కొత్త క్యాంపస్ రెడీ
- తొలి దశలో రూ.200 కోట్ల వ్యయం
- స్టార్టప్‌ల కోసం రూ.100 కోట్ల ఫండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేనేజ్‌మెంట్ విద్యనందిస్తున్న వోక్సెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కొత్త క్యాంపస్ రెడీ అయింది. హైదరాబాద్ సమీపంలోని సదాశివపేట వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఏర్పాటైంది. తొలి దశలో రూ.200 కోట్లు ఖర్చు చేశారు. యూకే కేంద్రంగా వ్యాపారాలు సాగిస్తున్న ఎన్నారై ప్రవీణ్ పుల దీన్ని ఏర్పాటు చేశారు. మూడు దశల్లో రానున్న ఈ క్యాంపస్ పూర్తయితే ఏక కాలంలో 2,000 మంది విద్యార్థులు చదువుకునే వీలుంది.
రెండేళ్ల వ్యవధి గల పీజీ డిప్లమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సు ఫీజు రూ.17.5 లక్షలు. ఏడాది వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఫర్ ఎక్స్‌పీరియెన్స్‌డ్ ప్రొఫెషనల్స్ కోర్సు ఫీజు రూ. 18.05 లక్షలు. ఒక బ్యాచ్ ఇప్పటికే పూర్తయింది. క్యాంపస్ కోసం మొత్తం రూ.500 కోట్లు పెట్టుబడి పెడతామని ప్రవీణ్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. కాగా విద్యార్థుల కోసం వోక్సెన్ ట్రేడ్ టవర్ పేరిట ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఈవో శ్రీకుమార్ సంగయ తెలిపారు. చక్కని వ్యాపార ఆలోచనకు ఫండింగ్ చేస్తామని, దీని కోసం రూ.100 కోట్ల ఫండ్ ఏర్పాటు చేశామని వె ల్లడించారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు పెద్ద పీట వేస్తామన్నారు. ఒక విద్యార్థికి రూ.1 కోటి సీడ్ ఫండ్ అందించామన్నారు.