తిరుపతి నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం | indigo finghts from tirupathi | Sakshi
Sakshi News home page

తిరుపతి నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం

Published Sun, Jan 7 2018 11:22 AM | Last Updated on Sat, Jun 2 2018 2:59 PM

indigo finghts from tirupathi

సాక్షి, తిరుపతి: రేణిగుంట విమానాశ్రయం నుంచి ఇండిగో నూతన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఆదివారం ఉదయం ఈ సర్వీసులను ప్రారంభించారు. ప్రతిరోజు మూడు సర్వీసులు హైదరాబాద్‌కు, రెండు సర్వీసులు బెంగుళూరుకు తిరిగేలా విమానాలను నడపనున్నారు.

ఇప్పటివరకు రేణిగుంట విమానాశ్రం నుంచి కేవలం హైదరాబాద్, విజయవాడలకు మాత్రమే విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఎయిరిండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్, ట్రూజెట్‌ కంపెనీలు మాత్రమే తమ సర్వీసులు కొనసాగిస్తున్నాయి. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... ప్రపంచంలో డొమెస్టిక్‌ విమానాల రాకపోకల్లో భారత్‌ మొదటిస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement