Renigunta Airpot
-
వినతి కోసం మహిళ యత్నం.. కాన్వాయ్ ఆపిన సీఎం జగన్
-
వినతి కోసం మహిళ యత్నం.. కాన్వాయ్ ఆపిన సీఎం జగన్
సాక్షి, తిరుపతి: సౌత్‌జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడ నుంచి తాజ్ హోటల్‌కు పయనమైన సమయంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన విజయకుమారి సీఎం కాన్వాయ్ వద్దకు వచ్చి సహాయం చేయాలని కోరింది. ఇది గమనించిన సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌ను ఆపి ఓఎస్డీని పంపి ఆమె సమస్య తెలుసుకోవాలని చెప్పారు. అనారోగ్యం, వయసు భారం పెరుగుతండటంతో కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా ఉద్యోగం కావాలని విజయకుమారి కోరింది. -
తిరుచానూరు ఆలయంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా
తిరుపతి: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, డాక్టర్ గురుమూర్తి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా తిరుచానూరు పద్మావతి ఆలయానికి చేరుకున్నారు. స్పీకర్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానం పలికారు. -
బాబు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, తిరుపతి: ఎన్నికల కోడ్, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ధర్నా చేయడానికి తిరుపతికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంపట్ల రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధపట్ల టీడీపీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. ప్రతిపక్ష నేతపై అధికారులు ఇంతగా శ్రద్ధ తీసుకున్న దాఖలాల్లేవని రాజకీయ పరిశీలకులూ అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ చిత్తూరు, తిరుపతిలో టీడీపీ శ్రేణులతో కలిసి నిరసనలో పాల్గొనేందుకు చంద్రబాబు సోమవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న విషయం తెలిసిందే. ఇందుకు ఎలాంటి అనుమతి లేకపోవడంతో చంద్రబాబును పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. వెంటనే హైదరాబాద్‌కు తిరిగి పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ఎన్ని విమానాలున్నాయో అన్నింటిలో టికెట్లు బుక్‌చేశారు. అయితే, పక్కా పథకం ప్రకారం అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు ముప్పుతిప్పలు పెట్టినా.. ఆయన ఆరోగ్యంపట్ల వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రత్యేక వైద్యులు, అంబులెన్స్‌ను ఉదయం నుంచి రాత్రి వరకు విమానాశ్రయంలోనే ఉంచారు. అక్కడ భారీ బందోబస్తునూ ఏర్పాటుచేశారు. అలాగే, తిరుపతి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో పోలీసులను భారీగా మోహరించారు. రేణిగుంట, విమానాశ్రయానికి వెళ్లే ప్రతి ఒక్కరిని, ప్రతి వాహనాన్ని తనిఖీచేసి అనుమతించారు. విమానాశ్రయంలో వేచి ఉన్న చంద్రబాబును ప్రతి అరగంటకు ఒకసారి వైద్యులు వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆయన కోసం ప్రత్యేకంగా భోజనం, అల్పాహారం, పండ్లు, డ్రైఫ్రూట్స్ అన్నీ ఏర్పాటుచేశారు. అయితే, చంద్రబాబు తన ఇంటి నుంచి తెప్పించుకున్న భోజనం, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌నే తీసుకున్నారు. కాఫీ మాత్రమే అధికారులను అడిగి తెప్పించుకున్నారు. ఆయన కోరిక మేరకు కలెక్టర్, ఎస్పీ కాగా, ధర్నా చేయడానికి అనుమతి ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. తాను కలెక్టర్, ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తానని చంద్రబాబు డిమాండ్ చేశారు. పదే పదే అదే విషయాన్ని ప్రస్తావించడంతో చిత్తూరు, తిరుపతి అర్బన్ ఎస్పీలు సెంథిల్‌కుమార్, వెంకట అప్పలనాయుడుతో పాటు జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, ఆర్డీవో కనకనరసారెడ్డి చంద్రబాబుతో చర్చించారు. ఆయన చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నారు. దీంతో ఉదయం నుంచి టీడీపీ శ్రేణులు, ఎల్లో మీడియా చేసిన దు్రష్పచారాన్ని అధికార యంత్రాంగం తిప్పికొట్టినట్లయింది. 9 గంటల పాటు బాబు అండ్ కో ఆడిన డ్రామా అధికార యంత్రాంగం పనితీరుతో బెడిసికొట్టింది. -
‘దాని కోసమే చంద్రబాబు ఇంత డ్రామా చేస్తున్నారు’
సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిది కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కాగా తిరుపతిలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు సోమవరాం హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎయిర్పోర్ట్ లాంజ్‌లో పోలీసులు ఆయనను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు నిరసనపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆలోచనలతో చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. అనుకూల మీడియాలో ప్రచారం కోసమే చంద్రబాబు ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు నానా యాగీ చేశారని, చంద్రబాబు ప్రవర్తన చాలా దారుణమన్నారు. పంచాయతీ ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతామని పేర్కొన్నారు. చదవండి: అందుకే చంద్రబాబును అడ్డుకున్నాం: తిరుపతి ఎస్పీ రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా -
చంద్రబాబు, తిరుపతి, ఎస్పీ అప్పలనాయుడు, చిత్తూరు, విమానాశ్రయం
-
విమానానికి తప్పిన ప్రమాదం
రేణిగుంట (చిత్తూరు జిల్లా): రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఉదయం 8.30 గంటలకు రన్‌వేపై వెళ్తున్న ఫైరింజన్ అదుపుతప్పి బోల్తా పడింది. కొన్ని నిమిషాల వ్యవధిలో ఇండిగో విమానం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు రన్‌వే వైపు వచ్చింది. రన్‌వేపై జరిగిన విపత్తును గుర్తించిన పైలెట్ విమానాన్ని దించకుండా గగనతలంలో కాసేపు చక్కర్లు కొట్టారు. అటు నుంచి అటే టేకాఫ్ అయి విమానాన్ని బెంగళూరుకు తరలించారు. విమానంలో మొత్తం 48 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 33 మంది రేణిగుంటలో దిగాల్సి ఉండగా, 15 మంది బెంగళూరుకు చేరుకోవాలి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఫైరింజన్‌ను పక్కకు తీసుకెళ్లారు. యథావిధిగా విమాన రాకపోకలు కొనసాగాయి. ఇక్కడ దిగాల్సిన 33 మంది ప్రయాణికులను మళ్లీ బెంగళూరు నుంచి విమానంలో మధ్యాహ్నం 12.45కు తీసుకొచ్చారు. విమానం రావడానికి కొన్ని నిమిషాల ముందు ఫైరింజన్ రన్‌వేపై తనిఖీలు చేయడం ఆనవాయితీ. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఫైరింజన్ బోల్తా పడినట్లు అధికారులు భావిస్తున్నారు. -
సమస్యలు ఆలకిస్తూ.. భరోసా ఇస్తూ..
రేణగుంట (చిత్తూరు జిల్లా): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించేందుకు సోమవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విమానాశ్రయం వెలుపల ఏర్పాటుచేసిన గ్యాలరీలో ఉన్న అర్జీదారుల సమస్యలను ఎంతో ఓర్పుగా ఆలకించారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి.. గ్యాలరీలో ఉన్న అందరి వద్దకు వెళ్లి ఒక్కొక్కరి అర్జీని స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. అర్జీలను జిల్లా కలెక్టర్ భరత్‌గుప్తాకు అందించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో తమ సమస్యలపై సీఎం స్పందించిన తీరుకు వారంతా ముగ్థులయ్యారు. ప్రాణభిక్ష పెట్టండి సారూ.. గ్యాలరీలో ఇద్దరు చెల్లెళ్లు తమ అన్నకు ప్రాణభిక్ష పెట్టండి అని అడిగిన తీరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కదిలించింది. సీఎం వారి దగ్గరకు రాగానే.. ‘మా అన్న హరికృష్ణ తిరుపతి రవీంద్రభారతి స్కూల్లో 10వ తరగతి చవివేవాడు. 2015 నవంబర్ 21న స్కూల్ సిబ్బంది భవనం పైనుంచి కిందకు తోసేశారు. మూడేళ్లపాటు కోమాలో ఉన్నాడు.. చెన్నై ఆస్పత్రిలో తొమ్మిది ఆపరేషన్లు చేశారు. చికిత్స కోసం రూ.10 లక్షలు ఆర్థిక సాయం కావాలి’.. అని బాధితుని ఇద్దరు చెల్లెళ్లు చాందిని, రంజని సీఎంను వేడుకున్నారు. గత ప్రభుత్వంలో అనేకమార్లు విన్నవించినా న్యాయం జరగలేదని వివరించారు. దీంతో రూ.10లక్షలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. చాందిని, రంజని చదువులు, కుటుంబ ఖర్చుల నిమిత్తం మరో రూ.5లక్షలు ఇస్తామని చెప్పారు. గెస్ట్ టీచర్లకు న్యాయం ఇక తిరుపతిలోని టీటీడీ విద్యాసంస్థలలో గెస్ట్ టీచర్లుగా పనిచేస్తున్న 20మంది తమను కాంట్రాక్టు టీచర్లుగా పరిగణించి ఉద్యోగ భరోసా కల్పించాలని సీఎంకు విన్నవించారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామన్నారు. వీరితోపాటు ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు.. 2008 డీఎస్సీలో క్వాలిఫై అయిన అభ్యర్థులూ ముఖ్యమంత్రికి తమ సమస్యలను చెప్పుకున్నారు. -
రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక
సాక్షి, అమరావతి : సాధారణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకునేందుకు ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల సందర్శనపై ఆసక్తి చూపుతూ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ నుంచి కేరళలోని గురువాయూర్ ఆలయ దర్శనానికి బయలుదేరారని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ శ్రీకృష్ణుణ్ణి దర్శనం చేసుకుని ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు. ఈ మధ్యలో ప్రధాని మోదీ మాల్దీవుల్లో జరిగే విదేశాంగ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా రేణిగుంట చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కొలంబో నుంచి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రధాని రాకను పురస్కరించుకుని విమానాశ్రయానికి అతి సమీపంలోనే బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు విజయోత్సవ సభగా నామకరణం చేస్తున్నట్టు తెలిపారు. సభ అనంతరం ప్రధాని స్వామివారి దర్శనానికి తిరుమలకు వెళ్లి తిరిగి అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారని చెప్పారు. -
రేణిగుంట రన్‌వేపై తప్పిన ముప్పు
రేణిగుంట, శంషాబాద్: చిత్తూరు జిల్లా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ సమయంలో రన్‌వే చివర కుంగడంతో అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా విమానాన్ని గాల్లోకి లేపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయాన్ని పైలట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెప్పడంతో వారు కుంగిన రన్‌వేకు మరమ్మతులు చేసి మంగళవారం రాత్రి 7.40 గంటల సమయంలో విమానాల రాకపోకలకు అనుమతించారు. సుమారు 5 గంటలపాటు విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లో అవస్థలు పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన పలు విమానాలు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి నిలిచిపోయాయి. అలాగే తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు, స్పైస్‌జెట్ విమానం నిర్ణీత సమయానికి రాకపోవడం, తిరిగి ఇక్కడి నుంచి సాయంత్రం 5.45, 7.10 గంటలకు వెళ్లాల్సిన విమానాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వర్షంలోనే రన్‌వే విస్తరణ పనులు అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలకు వీలుగా రేణిగుంట విమానాశ్రయంలో రన్‌వే విస్తరణకు కేంద్ర విమానయానశాఖ అనుమతులు మంజూరుచేసింది. రెండ్రోజుల క్రితం రన్‌వే విస్తరణ పనులు ప్రారంభించారు. సోమవారం రాత్రి 10 గంటలకు వర్షంలోనే రన్‌వే పొడిగింపు పనుల్ని కొనసాగించారు. మంగళవారం ఉదయం నుంచి ఆ రన్‌వేపై పలు విమానాలు రాకపోకలు సాగించాయి. అవన్ని చిన్న విమానాలు కావడంతో రన్‌వే సగం వరకే వెళ్లి టేకాఫ్ తీసుకున్నాయి. అయితే మధ్యాహ్నం 2.50 గంటలకు రేణిగుంట నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానం పెద్దది కావడంతో రన్‌వే చివరి వరకు వెళ్లి టేకాఫ్‌కు ప్రయత్నించింది. రన్‌వే చివర కుంగిఉండడాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమై విమానాన్ని వెంటనే గాల్లో లేపాడు. విషయాన్ని కేంద్ర విమానయానశాఖ ఉన్నతాధికారులకు పైలట్ ఫిర్యాదు చేశాడు. -
ఎయిర్‌పోర్టులో ఏమైంది
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రమం.. మంగళవారం ఉదయం 9గంటలు.. భద్రతాదళాలు ఆందోళనగా అటూ ఇటూ పరుగెడుతున్నాయి..ఏం జరుగుతుందో తెలియడం లేదు. నిశితంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులంతా ఊపిరి బిగపట్టి కూర్చున్నారు. ఏదో విపత్తు జరిగిందని అక్కడ ఉత్కంఠ వాతావరణాన్ని చూస్తున్న వారంతా భావిస్తున్నారు. చివరకు మాక్‌డ్రిల్ అని తెలిశాక ఊపిరిపీల్చుకున్నారు. రేణిగుంట: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రమంలో పెనుముప్పు సంభవించిన యుద్ధ వాతావరణం మంగళవారం కనిపించింది. కేంద్ర భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టు ప్రాంగణా న్నంతా చుట్టుముట్టి విమానాశ్రయంలోకి వెళ్లే ప్రయాణికులను, సిబ్బందిని బయటకు పంపేశారు. దీంతో ప్రయాణికులు ఒకింత భయాందోళనకు లోనయ్యారు. విమానాశ్రయంలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బలగాలు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎయిర్‌పోర్టులో ఏదో విపత్తు నెలకొం దని సగటు ప్రయాణికులు భావించారు. అదంతా ఎయిర్‌పోర్టులో అప్పుడప్పుడూ జరిగే మాక్ డ్రిల్‌లో భాగమని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నా రు. వివరాల్లోకి వెళితే.. ఎయిర్‌పోర్టు సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మనీష్‌కుమార్ నేతృత్వంలో మంగళవారం ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులను ఉగ్రవాదుల చెర నుంచి, విపత్తుల నుంచి రక్షించే విధానాన్ని సిబ్బందికి అవగాహన నిమిత్తం ముందస్తుగా పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందితో యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. విమానాశ్రయ ఉన్నతాధికారులకు అసలు విషయం తెలిసినా కిందిస్థాయి సిబ్బందికి గానీ, ప్రయాణికులకు గానీ తెలియకుండా గోప్యత పాటించారు. దీంతో సుమారు గంటకు పైగా ఎయిర్‌పోర్టులో హై అలెర్ట్ నెలకొంది. -
తిరుపతి నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం
సాక్షి, తిరుపతి: రేణిగుంట విమానాశ్రయం నుంచి ఇండిగో నూతన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఆదివారం ఉదయం ఈ సర్వీసులను ప్రారంభించారు. ప్రతిరోజు మూడు సర్వీసులు హైదరాబాద్‌కు, రెండు సర్వీసులు బెంగుళూరుకు తిరిగేలా విమానాలను నడపనున్నారు. ఇప్పటివరకు రేణిగుంట విమానాశ్రం నుంచి కేవలం హైదరాబాద్, విజయవాడలకు మాత్రమే విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్, ట్రూజెట్ కంపెనీలు మాత్రమే తమ సర్వీసులు కొనసాగిస్తున్నాయి. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... ప్రపంచంలో డొమెస్టిక్ విమానాల రాకపోకల్లో భారత్ మొదటిస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. -
స్పైస్‌జెట్ వివూనానికి తప్పిన ముప్పు
–హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వచ్చిన విమానం –72 వుంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది సురక్షితం రేణిగుంటః హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న స్పైస్ జెట్ విమానం ల్యాడింగ్ సమయంలో అదుపు తప్పి రన్‌వేను దాటిపోయింది. శనివారం రాత్రి 8 గంటలకు చేరుకోవాల్సిన వివూనం వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల దృష్యా ల్యాండింగ్‌లో విమానం అత్యంత వేగంగా ల్యాడింగ్ కావటంతో నిర్ధేశిత రన్‌వేను దాటి అర్ద కిలోమీటర్ పైగా వెళ్లిపోయింది. వర్షం కురవటంతో విమాన చక్రాలు బురదలో కూరుకుపోయాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో 72 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విమానంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. నిర్ధేశిత రన్‌వే నుంచి విమానం దూసుకుపోవటంతో ప్రయాణికులు కొన్ని క్షణాలు పాటు తవు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురయ్యారు. వారిని ఎయిర్పోర్ట్ అధికారులు ల్యాండింగ్ ప్రదేశం నుంచి ప్రత్యేక బస్సులు ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్ అధికారులు గోప్యతను ప్రదర్శించారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ల్యాండింగ్ తర్వాత తవు కుటుంబీకులతో విషయాన్ని పంచుకోవటం ద్వారా పలు న్యూస్ చానల్స్‌లో కథనాలు వెలువడటంతో ప్రమాద విషయం బయటకు పొక్కింది. పైలట్ నిర్లక్ష్యమా, విమానంలో సాంకేతిక లోపమా, వాతావరణ ప్రతికూల పరిస్థితా అన్న విషయం విచారణలో తేలాల్సి ఉంది. విమానం కూరుకుపోవటంతో దానిని బయటకు తీసేందుకు విమానాశ్రయ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.