సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిది కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కాగా తిరుపతిలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు సోమవరాం హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో పోలీసులు ఆయనను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు నిరసనపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
ఆలోచనలతో చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. అనుకూల మీడియాలో ప్రచారం కోసమే చంద్రబాబు ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు నానా యాగీ చేశారని, చంద్రబాబు ప్రవర్తన చాలా దారుణమన్నారు. పంచాయతీ ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతామని పేర్కొన్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment