
సాక్షి, తిరుపతి: ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఒక్క సెంటు పంట నష్టపోయినా ఆదుకుంటామన్నారు. చంద్రబాబుకు రాజకీయ ఆలోచన తప్ప మరొకటి లేదన్నారు.
చదవండి: తిరుపతిపై గత పాలకుల నిర్లక్ష్యం: నాటి పాపాలు.. నేటి శాపాలు!
జిల్లాలో రోడ్లు, పంటలు 70-80 శాతం నష్టం వాటిల్లింది. వరద నష్టం అంచనా వేస్తున్నాం. ఇది ప్రకృతి విపత్తు. ఊహించని నీరు రావడం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు తెగింది. తప్ప, ఇందులో ఎవరి తప్పులేదు. అధికారంలోకి రావాలన్న ధ్యాసతోనే చంద్రబాబు మాపై విమర్శలు చేస్తున్నాడు. తాను అధికారంలోకి వచ్చాక వరద బాధితులకు పరిహారం ఇస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment