
సాక్షి, తిరుపతి: సౌత్‌జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడ నుంచి తాజ్ హోటల్‌కు పయనమైన సమయంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన విజయకుమారి సీఎం కాన్వాయ్ వద్దకు వచ్చి సహాయం చేయాలని కోరింది.
ఇది గమనించిన సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌ను ఆపి ఓఎస్డీని పంపి ఆమె సమస్య తెలుసుకోవాలని చెప్పారు. అనారోగ్యం, వయసు భారం పెరుగుతండటంతో కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా ఉద్యోగం కావాలని విజయకుమారి కోరింది.