vijayakumari
-
వయనాడ్ వారియర్స్: స్త్రీని కాబట్టి వెనక్కు తగ్గాలా?
ప్రమాదం జరిగినప్పుడు స్త్రీలను అక్కడకు వెళ్లనివ్వరు. చాలామంది స్త్రీలు తమ భర్త, కొడుకులను సహాయానికి పంపడానికి సంశయిస్తారు. కాని వయనాడ్ వరద బీభత్సం సంభవించినప్పుడు ఒక అంగన్వాడి టీచర్ రక్షణ దళాలతో సమానంగా రంగంలో దిగింది. సహాయక చర్యల్లో పాల్గొంది. ‘ఇంత దారుణ పరిస్థితిలో అందరూ ఉంటే స్త్రీని కాబట్టి నేను వెనక్కు తగ్గాలా?’ అని ప్రశ్నించిందామె.వయనాడ్‌లోని చిన్న పల్లె ముప్పైనాడ్. అక్కడ అంగన్వాడి టీచర్‌గా పని చేస్తోంది 36 ఏళ్ల విజయకుమారి. జూలై 30 తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫోన్ కాల్ అందుకుంది. వాళ్ల పల్లె నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న చూరల్‌మలను వరద చుట్టుముట్టిందని అందరూ ప్రమాదంలో ఉన్నారని. ఆమె అంగన్వాడి టీచర్. ప్రమాదస్థలంలో ఆమెకు ఏ విధమైన విధులు లేవు ఒక ఉద్యోగిగా. ఒక పౌరురాలిగా ఎలాంటి నిర్బంధం లేదు సేవకు. కాని ఆమె ఆగలేక΄ోయింది. వెంటనే బయల్దేరడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. బయట భారీ వర్షం. హోరు గాలి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. అయినా సరే తన టూ వీలర్ తీసి చూరల్మలకు బయలుదేరింది. తెల్లవారుజాము ఐదు అవుతుండగా అక్కడకు చేరుకుంది.కాని అక్కడ కనిపించిన దృశ్యం ఆమెను అవాక్కు చేసింది. తనకు బాగా పరిచయమైనప్రాంతం, జనావాసం ఇప్పుడు కేవలం బురదదిబ్బ. ఎవరు ఏమయ్యారో తెలియదు. సహాయ బృందాలు వచ్చి అప్పుడప్పుడే సహాయక చర్యలు మొదలెట్టాయి. విజయకుమారి ఏమీ ఆలోచించలేదు. వెంటనే రంగంలో దిగింది. వారికి తనను పరిచయం చేసుకుని అగ్నిమాపక బృందం వారి షూస్, ఇనుపటోపి పెట్టుకుని రంగంలో దిగింది. ఆ తర్వాత ఆమె చేసినదంతా ఎవరూ చేయలేనంత సేవ. ‘నా ఎదురుగా మహా విపత్తు.ప్రాణంపోయిన వారు ఎందరో. ఇలాంటి సందర్భంలో స్రీగా వెనక్కు తగ్గాలా? అనిపించింది. కాని మనిషిగా ముందుకే వెళ్లాలని నిశ్చయించుకున్నాను. సహాయక చర్యల్లో పాల్గొన్నాను. తెల్లవారుజాము 5 నుంచి 8 లోపు ఎన్నో మృతదేహాలను వెలికి తీసి రవాణా చేయడంలో సాయ పడ్డాను’ అందామె.పనికి వచ్చిన కరాటే..విజయకుమారికిపోలీసు కావాలని చిన్నప్పటి నుంచి కోరిక.పోలీసు కావాలని కరాటే నేర్చుకొని బ్రౌన్ బెల్ట్ వరకూ వెళ్లింది. అంతేకాదు పరీక్షలు రాసిపోలీస్గా సెలెక్ట్ అయ్యింది కూడా. కాని వాళ్ల నాన్నకు ఆమె ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. అపాయింట్మెంట్ లెటర్ చింపేశాడు. ఆమె అంగన్వాడి టీచర్‌గా మిగలాల్సి వచ్చింది. పోలీస్ కావాలని నేను తీసుకున్న కరాటే శిక్షణ, చేసిన ఎక్సర్సైజులు నాకు ఈ సమయంలో తోడు వచ్చాయి. రక్షణ దళాలతో సమానంగా నేను కష్టపడ్డాను. మనిషికి మనిషి సాయం చేయాల్సిన సమయం ఇది. ముఖ్యంగా ఈ సమయంలో ఎందరో స్త్రీలు దుఃఖంతో స్పృహ త΄్పారు. సహాయక బృందాల్లో అందరూ మగవారే ఉంటారు. వారు ఓదార్చలేరు. కాని నేను స్త్రీని కావడం వల్ల వారిని దగ్గరకు తీసుకొని ఓదార్చగలిగాను. ఇలాంటి సందర్భాల్లో స్త్రీలు ఉండాలి స్త్రీల కోసం’ అంటుంది విజయకుమారి. ఆమె సేవలను అందరూ మెచ్చుకుంటున్నారు. -
కేశిరాజు విజయ కుమారి: 19 X 7 = ?
‘‘డిజిటల్ యుగంలో లెక్కలు చేయడం సులువైంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చేతిలో కంప్యూటర్ ఉన్నట్లే. ఈ విజ్ఞాన పరిణామం ఎటు దారి తీసిందో తెలుసా? ఏడెనిమిదులు ఎంతో చెప్పలేకపోతున్న తరం తయారైంది. అవన్నీ గుర్తు పెట్టుకోవడం తన పని కాదనుకుంటోంది మెదడు. కాలిక్యులేటర్ ఉండగా తనకెందుకు శ్రమ అని విశ్రాంతిలోకి వెళ్తోంది. కాలిక్యులేటర్ ఉండాల్సింది చేతిలో కాదు... తలలో. నిజమే! కాలిక్యులేటర్ బుర్రలో ఉండాలి... ఎక్కాలు నాలుక మీద నాట్యం చేయాలి.’’ అని... పిల్లలకు ఎక్కాలు నేర్పించడానికి ముందుకొచ్చారు కేశిరాజు విజయ కుమారి. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ చిన్న గ్రామం కవిటం. థింక్ బిగ్ అని ఏపీజే అబ్దుల్ కలామ్ చెప్పగా ఆమె వినలేదు. కానీ తనకు తానుగా పెద్ద కలనే కన్నారు. ఐఏఎస్ కావాలనే కల నెరవేరకపోవడానికి ఒకటి కాదు రెండు కాదు కుటుంబ రీత్యా అనేక కారణాలు. అడ్డంకులు ఐఏఎస్ కాకుండా ఆపగలిగాయి, కానీ సమాజానికి సేవ చేయడానికి కాదు కదా అనుకున్నారామె. తన ఎదురుగా కనిపించిన ప్రతి సమస్యకూ పరిష్కారాన్ని వెతుకుతూ, పరిష్కరించే వరకు విశ్రమించకుండా శ్రమించారు. బాల్యంలోనే నాన్న పోవడం, పిల్లల పెంపకం బాధ్యతను మోస్తూ అమ్మ భుజాలు అరిగిపోవడం చూస్తూ పెరిగారామె. అంతేకాదు... తొలి ఉద్యోగం ఒక ఎన్జీవోలో టీచర్‌గా. దాంతో ఆ తర్వాత కూడా ఆమె అడుగులు సర్వీస్ వైపుగానే సాగాయి. దశాబ్దాలపాటు మహిళల కోసమే సేవలందించారామె. ఈ ప్రయాణంలో ఆమెకో కొత్త సంగతి తెలిసింది. డిగ్రీ చదువుకున్న వాళ్లకు కూడా ఎక్కాలు రావడం లేదు. నేర్చుకుని మర్చిపోయారా అంటే... అదీ కాదు. బడి గడప తొక్కని, అక్షరాలు నేర్వని బాల్యం ఉంటుంది. కానీ బడికి వెళ్లి అక్షరాలు నేర్చుకుని ఎక్కాలు నేర్వని బాల్యం ఉంటుందని ఊహించలేదామె. మరింత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తెలిసిందేమిటంటే... నేటి బాల్యానికి ఎక్కాలు నేర్చుకోవడం టైమ్ వేస్ట్ పనిగా ఉంటోందని. కాలిక్యులేటర్ లేకుండా వందలో నాలుగోవంతు ఎంత అంటే చెప్పడం చేతకావడం లేదని. ఇన్ని తెలిసిన తర్వాత ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి ఎక్కాల పుస్తకాలు పంచు తున్నారు. ఒకటి రెండు నెలల పాటు వాళ్లకు నేర్చుకునే టైమ్ ఇచ్చి ఆ తర్వాత పోటీలు పెడుతున్నారు. ప్రతి క్లాసులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు పాల్గొన్న వాళ్లకు కూడా ప్రోత్సాహకాలిస్తున్నారు. రకరకాలుగా సాగిన తన సామాజిక ప్రస్థానాన్ని ఆమె సాక్షితో పంచుకున్నారు. ఆడపిల్ల పుట్టాలి... చదవాలి! ‘‘మా వారి ఉద్యోగరీత్యా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువ కాలం ఉన్నాను. పెళ్లికి ముందు చదువు చెప్పిన అలవాటు ఉండడంతో అక్కడ ఖాళీగా ఉండలేకపోయేదాన్ని. పైగా మేము నార్త్‌లో ఉన్న రోజుల్లో అక్కడి మహిళలు దాదాపుగా నిరక్షరాస్యులే. నేనిక్కడ చదివింది సెకండ్ లాంగ్వేజ్ హిందీ మాత్రమే. కానీ అక్షరాలు, వాక్యాలు నేర్పించడానికి సరిపోయేది. వాళ్లకు నేర్పిస్తూ నేను హిందీ మాట్లాడడం నేర్చుకున్నాను. భాష మీద పట్టు రావడంతో వాళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం సులువైంది. ఘూంఘట్ చాటున, అత్తింటి నియమాల మాటున జీవించడమే వాళ్లకు తెలిసింది. కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే బిడ్డను కనకూడదని, గర్భస్రావం చేయించుకోవాలని నూరిపోసింది అక్కడి సమాజం. యువతులు కూడా అదే నిజమనే విశ్వాసంతో ఉండేవాళ్లు. స్త్రీ లేని సమాజం ఎలా మనుగడ సాగిస్తుందో చెప్పమని, దక్షిణాదిలో ఆడపిల్ల çపుడితే లక్ష్మీదేవి పుట్టినట్లు భావిస్తారని వాళ్లకు నచ్చచెప్తుంటే... ‘ఇద్దరు మగపిల్లలున్న తల్లి ఆమె ఏ మాటైనా చెబుతుంది. ఆడపిల్లకు కట్నాలిచ్చేది ఎవరు’ అని అక్కడి మగవాళ్లలో నా మీద వ్యతిరేకత పెల్లుబుకుతుండేది. నాది నిశ్శబ్ద ఉద్యమం కాబట్టి నా మీద దాడులు జరగలేదు. ఇంటిముందు మురుగు కాలువ ఓపెన్ డ్రైనేజ్‌లో పిల్లలు పడుతుంటారు కూడా. పరిశుభ్రత లేమిని, ఇలాంటి సమస్యలను ప్రశ్నిస్తూ, మహిళలను కలుపుకుని స్థానిక మున్సిపల్ ఆఫీసులకు వెళ్లేదాన్ని. రోడ్డు శుభ్రం చేసిన తర్వాత ఆ కాలనీలో నివసించే ఆడవాళ్ల చేత సంతకం చేయించుకునే నియమం పెట్టారు మున్సిపల్ కమిషనర్. నేర్చుకోవడానికి వయసు పరిమితి ఎందుకు! నా ఉద్దేశం ఒక్కటే. ‘మహిళ కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తే... ఆ క్షణంలో బెంబేలెత్తిపోకూడదు. ప్రతి ఒక్కరి చేతిలో ఏదో ఒక పని ఉండాలి. ఆర్థిక స్వావలంబన సాధించాలి’... అని. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఇక్కడి మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేకం చేశాను. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్‌లో వయో పరిమితి ఉంటుంది. అందులో ఇమడని వాళ్లు ‘మాకూ నేర్చుకోవాలని ఉంది’ అంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది. అలాంటి వాళ్ల కోసం కేవీఎస్ ఫౌండేషన్ స్థాపించి ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. శిక్షణ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు 2006 నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. శిక్షణ కార్యక్రమాల నుంచి పుట్టుకు వచ్చిన అవసరమే ఈ ఎక్కాల ఉద్యమం’’ అన్నారు విజయకుమారి. టైలరింగ్ నేర్పించేటప్పుడు నడుము చుట్టు కొలత లో నాలుగో వంతు మార్క్ చేయమంటే చాలామందికి తెలిసేది కాదు. దాంతో ముందు లెక్కలు నేర్పించాల్సి వచ్చేది. ఏదో సందేహం వచ్చి హైదరాబాద్‌లోని మా అపార్ట్మెంట్ పిల్లలను అడిగాను. ఎక్కాలు చదవడం ఏంటన్నట్లు చూశారు. అపార్ట్మెంట్లో ఎక్కాల పోటీలు పెట్టాను. పాల్గొనడానికే సిగ్గుపడుతున్నారు కొందరు. స్కూళ్లకు వెళ్లాను. ప్రైవేట్ స్కూళ్లు పెద్దగా స్పందించలేదు. ప్రభుత్వ పాఠశాలలు స్వాగతించాయి. సిటీలో ఇప్పటికి మూడువేల ఎక్కాల పుస్తకాలు పంచాను. ఉప్పరపల్లి, ప్రభుత్వ పాఠశాల లో రెండవ తరగతి పిల్లాడు చాలా త్వరగా ఇరవై ఎక్కాలు నేర్చుకున్నాడు. పిల్లలకు చక్కగా నేర్పిస్తే మెరికల్లా తయారవుతారు. ప్రైవేట్ విద్యారంగం పిల్లలను మార్కుల పోటీలోకి నెట్టేస్తూ, లెక్కలకు పునాది వంటి ఎక్కాలను నిర్లక్ష్యం చేస్తోంది. మహిళలకు స్కిల్ డెవలప్‌మెంట్‌తోపాటు పిల్లలకు ఎక్కాలు నేర్పించే మరో నిశ్శబ్ద ఉద్యమాన్ని చేపట్టాను. – కేశిరాజు విజయకుమారి, సామాజిక కార్యకర్త, కేవీఎస్ ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
వినతి కోసం మహిళ యత్నం.. కాన్వాయ్ ఆపిన సీఎం జగన్
-
వినతి కోసం మహిళ యత్నం.. కాన్వాయ్ ఆపిన సీఎం జగన్
సాక్షి, తిరుపతి: సౌత్‌జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడ నుంచి తాజ్ హోటల్‌కు పయనమైన సమయంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన విజయకుమారి సీఎం కాన్వాయ్ వద్దకు వచ్చి సహాయం చేయాలని కోరింది. ఇది గమనించిన సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌ను ఆపి ఓఎస్డీని పంపి ఆమె సమస్య తెలుసుకోవాలని చెప్పారు. అనారోగ్యం, వయసు భారం పెరుగుతండటంతో కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా ఉద్యోగం కావాలని విజయకుమారి కోరింది. -
జీవితం..రంగస్థలం
సొంత ఇల్లే కాదు.. సొంత ఊరు అంటూ లేని దుర్భర బతుకు. తల్లిదండ్రులు పెట్టేబేడా సర్దుకుని ఎక్కడికెళితే అక్కడకు పయనం. పొట్ట కూటి కోసం రంగస్థలాన్ని నమ్ముకుని జీవిస్తున్న కళాకారుల జీవితం.ఇలాంటి స్థితిగతుల నుంచే వచ్చారు విజయకుమారి. పాశ్చాత్య సంస్కృతి మోజులో పట్టణ, నగర ప్రాంతాల్లో రంగస్థల నాటకాలకు ఆదరణ తగ్గినా.. పల్లె సీమలు అక్కున చేర్చుకున్నాయి. కళాపోషకులు ఔదార్యం చాటుకుంటూ వచ్చారు. ఒడిదుడుకుల జీవితంలో కాసింత ఊరటనందించారు. అదే విజయకుమారికి కొండంత అండగా నిలిచింది. కష్టాల కడలి నుంచి తీరం వైపుగా కుటుంబ నావను నెట్టుకువచ్చే ప్రయత్నంలో ఆమెచివరికంటా సాగిస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం. అనంతపురం కల్చరల్: సొంతూరు ఇది అంటూ చెప్పలేను మా సొంతూరు ఏది అంటే నిర్ధిష్టంగా ఇది అంటూ చెప్పలేను. రంగస్థలంపై ఆధారపడి జీవించే కుటుంబం కావడం వల్ల చాలా ఇబ్బందులుండేవి. ఆ రోజుల్లో కాపురాలన్నీ డేరాల్లోనే జరిగిపోయేవి. నాన్న రామారావు ఒంగోలు వద్ద కోటవరంలో జన్మించారని చెప్పేవారు. అమ్మ భవానమ్మ కూడా ఆ చుట్టుపక్కలే జన్మించినట్లు అనుకుంటున్నాం. మాకైతే కచ్చితంగా తెలీదు. నాన్న తబలా వాయిస్తూండేవారు. అమ్మ నాటకాల్లో వేషాలు వేస్తుండేవారు. ముఖ్యంగా భారతీయ నాటక రంగాన్ని మలుపు తిప్పిన వారు సురభి నాటక సమాజంలో వారు కళాకారులు. ఆ రోజుల్లో నాటక సమాజాల్లో అందరమూ కలిసున్నా ఎవరి తిండి, ఎవరి బట్టలు వారివే కావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా ఉండేవి. నన్ను ఫ్రీ హాస్టల్లో చేర్పించి చదివించారు. చిన్నవయసులోనే నటప్రస్థానం సురభి నాటక సమాజంలో పిల్లలు పుట్టారంటే వారు కూడా రంగస్థల ప్రవేశం చేయాల్సిందే. అలా నా 12వ ఏట ‘శ్రీ కృష్ణలీలలు’ నాటకంలో బాలకృష్ణుడి పాత్రలో నేను నటించాను. కిరాయికే నాటకాలు ఆడేవాళ్లు. బుధవారం వచ్చిందంటే జీతాలిచ్చేవారు. ఒకటి రెండు పాత్రల తర్వాత నన్ను నెల్లూరులోని వాకాడ హాస్టల్లో చదువుకోమని వదిలిపెట్టారు. అక్కడ చదువుకుంటూనే పీటర్ మాస్టర్ వద్ద సంగీతం, కృష్ణమాచార్యుల వద్ద భరత నాట్యం నేర్చుకున్నాను. కుటుంబంపై ప్రభావం మేము ముగ్గురం అక్కాచెళ్లలం. నేను పెద్దదాన్ని. 1953లో బాసర క్షేత్రంలో నిండు గర్భిణిగా ఉన్న మా అమ్మ రంగస్థలంపై నర్తిస్తున్నప్పుడు అమ్మవారి సన్నిధిలో నేను జన్మించాను. మా చెల్లెలు మనోహరమ్మ అద్భుతమైన ఆర్టిస్టు. పెళ్లి తర్వాత రంగస్థలానికి ఆమె దూరమయ్యారు. కొన్నాళ్లు హరికథలు కూడా చెప్పేది. మరో చెల్లెలు లీలావతి చిన్నప్పటి నుంచి రంగస్థలానికి దూరంగా ఉండిపోయింది. తమ్ముడు ఆనంద్ మేకప్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. మరో తమ్ముడు రమేష్ కాస్తంత దూరంగానే ఉన్నాడు. ఇక మా ఆయన సెల్వం. ఆయన పుట్టి పెరిగింది తమిళనాడైనా అనంతకొచ్చి స్థి«రపడ్డారు. మా పెళ్లికి ముందు మా పక్కింట్లోనే ఉండేవారు. ఆయన మంచి మేకప్ ఆర్టిస్టే. ఆరేళ్ల కిందట ఆయన చనిపోయారు. మా పెద్ద కూతురు విజయశారదకు పెళ్లయింది. మంచి నటీమణి. ఇప్పటికీ నాటకాలు వేస్తూ ఉన్నారు. ఇంకొక కూతురు రాజేశ్వరికి నాటక విద్య అబ్బలేదు. కొడుకు కిరణ్‌కుమార్ మంచి డాన్సర్. వాడు కూడా రంగస్థలాన్నే నమ్ముకున్నాడు. చిత్రమేమంటే పీజీల దాకా వారంతా బాగా చదువుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాక రంగస్థలంపైనే ఉండిపోవాల్సి వచ్చింది. అనంతలో స్థిర నివాసం సురభి నాటక సమాజంలో ఉంటూ దేశ దిమ్మరులుగా ఉన్న మేము 1972లో అనంతపురం వచ్చి స్థిరపడ్డాం. ఇల్లు గడవాలంటే నాటకాలు వేయడం మినహా మాకు మరో గత్యంతరం లేదు. పెళ్లి తర్వాత నేను ముఖానికి మళ్లీ రంగుపూసుకోవాల్సి వచ్చింది. సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల రంగస్థల నాటకాలను చూసేందుకు వచ్చే వారి సంఖ్య క్రమేణా తగ్గుతూ వచ్చింది. ఆ సమయంలోనే రంగస్థలంపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చాం. సొంతంగా ఎస్ఆర్కే నాటక సమాజాన్ని స్థాపించి రాష్ట్రమంతటా వివిధ ప్రదర్శనలు ఇచ్చాం. కొత్త ప్రయోగాలతో కళాభిమానులను అలరించాం. 2002లో జిల్లాలో తొలిసారి మేమే పోటీ నాటకాలను వేయించాం. ప్రఖ్యాత నటులు గుమ్మడి గోపాలకృష్ణ, సినీనటులు సుత్తివేలు వంటి వారిని న్యాయనిర్ణేతలుగా ఏర్పాటు చేశాం. మా స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘సాయిబాబా విజయ లీలలు’ నాటకం అప్పట్లో అనంత వాసులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అలాగే 2011లో ‘శ్రీనివాస కల్యాణం’ నాటిక సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులకు మిగిల్చింది. కళా స్రవంతి సంస్థ ద్వారా మరోసారి అనంతపురంలోని లలితాకళాపరిషత్‌లో పోటీ నాటకాలు ఆడించాం. ప్రభుత్వ ఆదరణ అంతంతే.. అనకూడదు కానీ ప్రభుత్వం మాకు ఎన్నో చేయొచ్చు. రూ. లక్షలు ఖర్చు పెట్టి నాటకాలు వేస్తే ప్రభుత్వం కేవలం రూ.8 వేలు, మరోసారి రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. న్యాయపరంగా పింఛన్లయినా ఇస్తే అదే పదివేలు. 60 ఏళ్లకే పింఛన్ ఇస్తున్నామంటారు. నాకిప్పుడు 66 ఏళ్లు. నాకిప్పటికీ పింఛన్ రావడం లేదు. ఈ ఐదేళ్లలో లెక్కకు మించి చాలా సార్లు దరఖాస్తులు అందజేస్తూ వచ్చాను. ఎందుకు పింఛన్ ఇవ్వడం లేదో స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. 45 ఏళ్లకే పింఛన్, హెల్త్ కార్డులు జారీ చేస్తే కళాకారులకు ఎంతో ఊరటగా ఉంటుంది. పల్లెలు బతికిస్తున్నాయి రంగస్థల కళనే వృత్తిగా మార్చుకుని జీవించే కుటుంబాలు ఈ జిల్లాలో చాలా ఉన్నాయి. తెర లేచినప్పటి నుంచి నాటకం అయిపోయే వరకు ఈలలు వేస్తూ సాగే ఉత్సాహం.. ఆసక్తి ఎంతో పల్లెల్లో మేము చూశాం. టికెట్టు కొని బండ్లు కట్టుకుని వచ్చి నాటకాలు చూసేవారు. పల్లెల్లో ఉన్నట్లుగా కళాపోషకులు పట్టణ ప్రాంతాల్లో కరువయ్యారు. పల్లె వాసుల ఔదార్యమే మమ్మల్ని బతికిస్తోంది. కళాకారుల కాలనీ అద్భుతం నా 53 సంవత్సరాల రంగస్థల అనుభవంతో చెబుతున్నాను. రాష్ట్రంలో ఎక్కడా లేనట్లుగా అనంతపురంలో కళాకారులు ఐక్యతతో ఓ కాలనీని ఏర్పాటు చేసుకున్నాం. అప్పట్లో అనంతపురం ప్రజా ప్రతినిధులు కళాకారులను ప్రోత్సహించారు. ప్రస్తుత ప్రజా ప్రతినిధులు కళాకారుల పట్ల సానుభూతి చూపు తున్నారు. కాలనీలో ఎవరైనా కళాకారులు చనిపోతే దహన సంస్కారాలను అందరూ కలిసి చేసుకుంటాం. ఎంతో ఆదర్శంగా జీవిస్తున్న మా కాలనీలో మౌలిక వసతులు లేవు. 40 ఏళ్లకే రోగాల పుట్ట రంగు పూసుకుని, చిరునవ్వులు చిందిస్తూ లేని సంతోషాన్ని కనబరచే కళాకారుల జీవితాల్లో అనేక బాధలూ ఉన్నాయి. ప్రకృతికి విరుద్ధంగా తెల్ల ్లవార్లు మేల్కొనడం... సరైన తిండితిప్పలు లేకపోవడంతో 40 ఏళ్లకే దాదాపు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగుల వల్ల కంటి చూపు దెబ్బ తింటోంది. నిద్ర లేమి వల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. ముఖానికి వేస్తున్న రంగుల్లో తేడాలొస్తే చర్మవ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అంతేకాక తరచూ రంగు వేయడం వల్ల ముఖ సౌందర్యం తగ్గి పోతోంది. మైక్ సిస్టం సక్రమంగా లేకపోవడ వల్ల స్థాయికి మించి గట్టిగా అరవడం, రాగాలు తీయడం వల్ల గొంతు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలెక్కువ. ఇలాంటి దశలోనే ఒక కిడ్నీ చెడిపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. నాటకాలు ఆపేస్తే పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఎలా చేయాలని మదనపడ్డాను. అలాగే అతి కష్టంపై నాటకాలు ఆడుతూ వచ్చాను. అప్పట్లో ఆరోగ్యశ్రీ నన్ను ఆదుకుంది. విచిత్రమేమంటే మత్తు ఇంజక్షన్ కూడా వేయించుకోకుండా కేవలం సంగీతం వింటూ ఆపరేషన్ చేయించుకున్నా. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రెండో కిడ్నీ సమస్య తలెత్తింది. -
మహిళా కౌలు రైతు ఆత్మహత్య
ప్రకాశం: అప్పుల బాధ తాళలేక ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కల్లవారిపాలెం గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన గొట్టిపాటి విజయకుమారి(41) 18 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసింది. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం సుమారు రూ. 15 లక్షల వరకు అప్పులు తెచ్చింది. దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పార్ధీలు.. తల్లిచాటు బిడ్డలు..
చార్మినార్: భాగ్యనగరం ఎందరో వలస జీవులకు పుట్టిల్లు. భారతదేశంలోని అన్ని జాతులను, భిన్న సంప్రదాయాలను తనలో ఇముడ్చుకున్న మహా సంగమం. సిటీలో ఏ మూలకు వెళ్లినా కొంగొత్త పరిమళాలు సుతారంగా తాకుతునే ఉంటాయి. వందల ఏళ్ల కాలగమనంలో.. హైదరాబాద్ నగర జీవనంలో పార్ధీలు తమ ప్రత్యేకతను చాటుతునే ఉన్నారు. పితృస్వామిక సమాజంలో మాతృ ప్రాధాన్యం గల కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. నిజాం కాలంలో వలస రాజస్థాన్ ప్రాంతానికి చెందిన కొండజాతి ప్రజలను పార్ధీలనేవారు. అప్పట్లో వీరు కొండలు, గుట్టల్లో ఉంటూ వేట జీవనాధారంగా సంచార జీవనం సాగించేవారు. పిట్టల వేట వీరి ప్రధాన వృత్తిగా ఉండేది. జనసామాన్యంలో పిట్టలోళ్లుగా స్థిరపడ్డారు. మహిళలను ప్రత్యేకంగా పార్ధన్ అని పిలుస్తారు. చిత్తోడ్‌ఘర్ నుంచి వలసవచ్చిన మీరాబాయిపై గోల్కొండ నవాబు మనసు పారేసుకున్నాడట. ఆమెకు నవాబు 17 గ్రామాల్ని బహుమతిగా ఇచ్చినట్టు పార్ధీల కథనం. 400 ఏళ్ల క్రితమే నగరానికి వలస వచ్చిన వీరు ఇప్పటికీ తమ సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. సిటీలో ప్రత్యేక బస్తీలు.. తొలినాళ్లలో పిట్టల వేట ప్రధాన వృత్తిగా ఉండేది. ప్రస్తుతం పళ్లు, కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. పార్ధీలకు ప్రత్యేక భాష ఉన్నా.. లిపి లేదు. వీరి కుటుంబాల్లో స్త్రీలదే ముఖ్య భూమిక. పూర్తిగా మాతృస్వామిక వ్యవస్థ. వ్యాపారాలు వారి కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. భార్యలు చెప్పినట్టు భర్తలు నడుచుకోవాల్సిందే. ప్రస్తుతం నగరంలో పార్ధీలు సుమారు 2.5 లక్షల మంది ఉన్నారు. కానీ వీరి సంక్షేమానికి ఎలాంటి అసోసియేషన్లు లేవు. బస్తీల వారీగా పంచాయతీ కమిటీలే కీలక నిర్ణయాలు చేస్తాయి. హోలీ సంబరాలు స్పెషల్.. వీరు వినాయక చవితి, హోలీ పండగల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కుటుంబంలోని అంద రూ డాన్సులు చేస్తూ వినాయక నిమజ్జనానికి తరలివస్తారు. హోలీని మూడు రోజులు జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా ఉన్న పార్ధీలంతా శివారులోని జల్పల్లిలో గుడారాలు వేసుకుని హోలీని అట్టహాసంగా చేస్తారు. వీరికి ప్రత్యేక బస్తీలు.. నగరంలో పార్ధీలకు ప్రత్యేక బస్తీలు ఉన్నాయి. పురానాపూల్, ఎస్.వి.నగర్, లక్ష్మీనగర్, విష్ణునగర్, జాలీ హనుమాన్, లాల్‌దర్వాజా, రాజన్నబౌలి, ఎల్బీనగర్, చిక్కడపల్లి, మురళీధర్ బాగ్, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, ఫతేనగర్, ఎర్రగడ్డ, సీతాఫల్మండి, చిలకలగూడ, బాలానగర్, కాచిగూడ చౌరస్తా, ఉప్పర్‌గూడ, రాణిగంజ్ ప్రాంతాల్లో పార్ధీవాడలు ఉన్నాయి. రాజకీయ నిర్ణేతలుగా.. నగరంలో వందల ఏళ్ల క్రితం స్థిరపడిన పార్ధీలు ఇక్కడి రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. పురానాపూల్ డివిజన్ నుంచి ఎన్నికైన కాశీరాం 1968-69లో డిప్యూటీ మేయర్‌గా కొనసాగారు. పార్ధీల తరఫున ఎన్నికైన మొదటి ప్రజాప్రతినిధి ఆయనే. 1986 ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పురానాపూల్ డివిజన్ నుంచి ఎస్. విజయకుమారి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కొన్ని డివిజన్లలో అభ్యర్థుల భవితవ్యం వీరు తేల్చనున్నారు. -
జిల్లాలో ఎక్సైజ్ దాడులు
కడప అర్బన్/తొండూరు/ముద్దనూరు/సిద్ధవటం, న్యూస్‌లైన్: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ విజయకుమారి ఆధ్వర్యంలో సోమవారం జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. వీటిలో 7 కేసుల్లో ఒకరిని అరెస్టు చేసి 66 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 3,800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 25 కిలోల నల్లబెల్లంను స్వాధీనం చేసుకున్నారు. బెల్టుషాపుల కేసులను ఐదు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఐదు మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 25 లీటర్ల బ్రాందీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోమవారం రాబడిన సమాచారం మేరకు గుర్రంగుంపుతాండాలోని ఓ ఇంటిపై దాడి చేశారు. మూడె సుశీలమ్మ తన ఇంటికి తాళం వేసి పరారైంది. రెవెన్యూ అధికారుల సమక్షంలో సుశీలమ్మ ఇంటి తాళం పగులగొట్టగా ఇంటిలో 16 లీటర్ల నాటుసారా ఉన్నట్లు గమనించి స్వాధీనం చేసుకున్నారు. సుశీలమ్మపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిలో కడప ఎస్సై స్వామినాథ్, హెడ్కనాఇస్టేబుల్ నారాయణరెడ్డి, కానిస్టేబుళ్లు గోపాలకృష్ణ, సుబ్రమణ్యం, కొత్త కానిస్టేబుల్ విజయ్ ప్రవీణ్, విష్ణువర్ధన్‌రెడ్డిలు పాల్గొన్నారు. తిమ్మాపురంపేటలో... తొండూరు మండలం తిమ్మాపురంపేటలో అక్రమంగా నిల్వ ఉన్న 87మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఫ్లయింగ్ స్క్వాడ్ ఎస్ఐ బాల అంకయ్యతోపాటు ముద్దనూరు పోలీసులు తిమ్మాపురం పేటలో దాడులు నిర్వహించారు. జల్లా దామోదర్‌రెడ్డి తన కలం దొడ్డిలో అక్రమంగా నిల్వ ఉన్న 87మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాచగూడిపల్లెలో ... ఒంటిమిట్ట మండలం రాచగూడిపల్లెలో సోమవారం దాడులు నిర్వహించి బొమ్మిల చెన్నయ్య నుంచి 25మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రామ్మోహన్ తెలిపారు. ఒంటిమిట్ట మండలం రాచగూడిపల్లెలో మద్యం విక్రయాలు అక్రమంగా జరుగుతున్నాయని సమాచారం తెలియడంతో హుటాహుటీన ఎస్ఐలు శ్రీధర్‌బాబు, లావణ్యలు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు. బొమ్మిళ్ల చెన్నయ్యను రిమాండ్‌కు తరలించామన్నారు. -
అధికారులకు బదిలీల ఫోబియా...
అనివార్యమే... అయినా అనువైన చోటుకోసం యత్నం ఎన్నికలయ్యాక మళ్లీ వచ్చేందుకు ముందస్తు ఒప్పందం! మూణాళ్ల ముచ్చటగా జెడ్పీ సీఈవో పోస్టు సాక్షి, మచిలీపట్నం : ఎన్నికల నేపథ్యంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ అనివార్యమైంది. ఇదే సమయంలో జిల్లాను వదిలి వెళ్లలేక.. నిబంధనలను కాదని ఇక్కడే ఉండలేక వారు మధనపడుతున్నారు. గత్యంతరంలేని స్థితిలో ఎన్నికల తంతు ముగిశాక మళ్లీ జిల్లాకు వద్దామనుకునే లోపాయికారీ ఒప్పందాలతో వారు బదిలీకి సిద్ధపడుతున్నారు. ఇదే సమయంలో తమకు పొరుగు జిల్లాల్లోనూ పదిలమైన చోటు కోసం అన్వేషణ మొదలెట్టారు. ఎన్నికల బదిలీని తమకు అనుకూలమైన ప్రాంతానికి చేసుకునేలా రాజధాని స్థాయిలో కొందరు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ఏఎస్వో పద్మ బదిలీని నిలుపుదల చేసేందుకు ఒక కీలక అధికారి పట్టుబడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అనేక వివాదాల నడుమ జెడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు పరిస్థితి మూణ్ణాళ్ల ముచ్చటగానే మారిపోవడం గమనార్హం. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లాలో మూడేళ్లు నిండిన ఉద్యోగులు, సొంత జిల్లా ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎంపీడీవో, తహ శీల్దార్, పోలీసుల బదిలీల ప్రక్రియను ఫిబ్రవరి 10వ తేదీలోగా పూర్తిచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో ఇప్పటికే జిల్లాలో ఎన్నికల బదిలీలకు తెరలేచింది. కాగా, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులుగా పనిచేస్తున్న కీలక అధికారులకు బదిలీ తప్పనిసరి అయ్యింది. దీంతో నందిగామ, మైలవరం, అవనిగడ్డ, తిరువూరు, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులుగా పనిచేస్తున్న డీఆర్డీఏ పీడీ కె.శివశంకర్, జడ్పీ సీఈవో బి.సుబ్బారావు, ఉడా భూసేకరణ విభాగాధికారిణి మనోరమా, పోలవరం ప్రొజెక్టు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఝాన్సీలక్ష్మి, డీఆర్డీఏ ఏపీడీ విజయకుమారిని బదిలీ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వీరంతా మూడున్నరేళ్లకుపైగా ఇక్కడే ఉండటం, అందులోనూ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిండంతో బదిలీ అనివార్యమైంది. దీంతో పొరుగున్న ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో తమకు అనుకూలమైన చోటు కోసం వారి స్థాయిల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కుర్చీలాటలో సుబ్బారావు గెలిచినా.... జెడ్పీలో జరిగిన కూర్చీలాటలో గెలిచి సీఈవో కుర్చీని అధిరోహించిన బి.సుబ్బారావు మూడు నెలలు తిరగకుండానే బదిలీకావడం చర్చనీయాంశమైంది. అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో నూజివీడు ఆర్డీవోగా పనిచేసిన సుబ్బారావు గత ఏడాది నవంబర్ 19న జెడ్పీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికే జెడ్పీ సీఈవో, డెప్యూటీ సీఈవో పోస్టుల భర్తీ నిబందనలకు విరుద్దంగా జరిగిందని ఇద్దరు ఉద్యోగులు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించిన సంగతి తెల్సిందే. సుబ్బారావు నియామకం చెల్లదని ట్రిబ్యూనల్ తీర్పు వస్తుందని ప్రతివాదులు ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన ఇలా బదిలీ అయ్యారు. సీఈవోగా మూడు నెలల వ్యవధిలోనే ఆయనపై ఇలా బదిలీవేటు పడటంతో కుర్చీలాటలో గెలిచినా ఓడినట్టే అయ్యింది. పద్మ బదిలీ కాకుండా కీలక అధికారి ప్రయత్నాలు... జిల్లాలోని సివిల్ సప్లైస్ విభాగంలో పనిచేస్తున్న ఒక అధికారిణి బదిలీ చర్చనీయాంశమైంది. విజయవాడలో ఏఎస్వో-1(రూరల్)గా పనిచేస్తున్న కోమలి పద్మ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా పనిచేశారు. దీంతో ఆమెకు బదిలీ అనివార్యమని అధికారులు నిర్ధారించారు. ఇదే సమయంలో ఆమె బదిలీని నిలుపుదల చేసేందుకు కుటుంబ సన్నిహితుడు, కీలక అధికారి ఉన్నతస్థాయిలో వత్తిడి తెచ్చినట్టు సమాచారం. కోమలి పద్మకు శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయినట్టు చెబుతున్నారు. ఆ బదిలీని నిలుపుదల చేసేలా ఉన్నతస్థాయి ప్రయత్నాలు ఊపందుకున్నాయి.