ప్రధాన వార్తలు

బిగ్ న్యూస్:: అవును.. నేను పాక్ ఆర్మీ ఏజెంట్‌నే: తహవూర్ రాణా
26/11 ముంబయి ఉగ్రదాడుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ హుస్సేన్ రాణా తన నేరాన్ని అంగీకరించాడు. అంతేకాదు.. పాకిస్తాన్ ఆర్మీకి అత్యంత విశ్వసనీయమైన ఏజెంట్‌గానూ తాను పనిచేశానని విచారణలో వెల్లడించాడు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సోమవారం ఓ కథనం ప్రచురించింది. ముంబై ఉగ్రదాడుల కేసులో అమెరికా నుంచి అప్పగింత మీద వచ్చిన రాణా.. ప్రస్తుతం ఢిల్లీ తిహార్ జైలులో NIA కస్టడీలో ఉన్నాడు. అయితే ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణలో 2008 ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రేమయం ఉన్నట్లు అంగీకరించాడు. అంతేకాదు తాను, తన మిత్రుడు డేవిడ్ హెడ్లీతో కలిసి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ద్వారా పలు శిక్షణా శిబిరాల్లో పాల్గొన్నట్టు వెల్లడించాడు. లష్కరే తోయిబా కేవలం ఉగ్రవాద సంస్థ మాత్రమే కాదని ప్రధానంగా ఓ గూఢచార సంస్థలా పనిచేస్తుందని తహవూర్ రాణా వెల్లడించినట్లు తెలుస్తోంది. ముంబైలో ఇమ్మిగ్రేషన్ సెంటర్‌ను ఓపెన్ చేయాలన్న ఆలోచన తనదేనని, ఆ కార్యాలయం ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను వ్యాపార ఖర్చులుగా చూపించానని, 2008 నవంబర్‌లో జరిగిన ముంబయి దాడుల సమయంలో తాను ముంబయిలోనే ఉన్నానని, అది ఉగ్రవాదుల ప్రణాళికలో భాగమే అని అంగీకరించాడు. దాడులకు ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వంటి ప్రదేశాలను స్వయంగా పరిశీలించినట్టు తెలిపాడు. అంతేకాదు.. ఈ దాడులు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) సహకారంతోనే జరిగాయని తాను నమ్ముతున్నట్లు తహవూర్ రాణా వెల్లడించాడు. ఈ మేరకు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే.. ముంబై దాడుల్లో తన ప్రమేయం లేదంటూ రాణా ఇప్పటిదాకా బుకాయిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాజా విచారణలో తన పాత్రను అంగీకరించడంతో పాటు పాక్ నిఘా వ్యవస్థ ప్రేమయం ఉండొచ్చన్న వ్యాఖ్యలు ఈ కేసును కీలక మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.

కేరళ శారీలో పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారన్న అరోపణలతో అరెస్టయిన హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా విచారణలో ఆమె నడిపిన అనేక బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా కేరళ పర్యాటకరంగ ప్రోత్సహక ప్రచారంలో అతిథిగా భాగస్వామ్యం వహించారని, ఈ సందర్భంగా ఆమె కేరళను సందర్శించారని వెల్లడయ్యింది. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు వచ్చిన సమాధానంలో జ్యోతి మల్హోత్రాతో ముడిపడిన ఒక అంశం వెలుగు చూసింది. దక్షిణాదిని పర్యాటకంపరంగా ప్రోత్సహించేందుకు అతిథులుగా ఎంపిక చేసిన 41 మంది ఇన్‌ఫ్లుయెన్లర్లలో జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారని తేలింది. వీరి పర్యటనకు కేరళ ప్రభుత్వం నిధులు సమకూర్చిందని, వారి ప్రయాణం, వసతి, ఆహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించిదని సమాచారం. అలాగే వీడియోలను చిత్రీకరించడంలో వారికి సహాయం చేయడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీని కూడా ప్రభుత్వం నియమించింది.జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం సహకరించిందన్న విషయం బయటపడిన దరిమిలా ప్రతిపక్షాలు అధికార ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కేరళ ప్రభుత్వం సరైన వెరిఫికేషన్ లేకుండా విదేశీ గూఢచారులను ఆహ్వానించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వీటిపై కేరళ పర్యాటక మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ స్పందిస్తూ కేరళకు ఇతర ఇన్‌ఫ్లుయెన్లర్లతో పాటు జ్యోతిని ఆహ్వానించారని అన్నారు. ఇది కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో చేసిన ప్రయత్నమన్నారు. ఇది పారదర్శకంగా, మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమమని, గూఢచారులని ముందుగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యపడదని అన్నారు.కేరళలో జ్యోతి మల్హోత్రా కొచ్చి, కన్నూర్, కోజికోడ్, అలప్పుజ, మున్నార్, తిరువనంతపురం ప్రాంతాలను సందర్శించారు. వీటికి సంబంధించిన వ్లాగ్‌లను ఆమె తన యూట్యూబ్ ఛానల్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో షేర్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత గత మే నెలలో ఆమెను అరెస్టు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌ను సందర్శించారని పోలీసుల విచారణలో తేలింది.జరిగింది ఇదే.. జ్యోతి మల్హోత్రా.. హర్యానాకు చెందిన 33 ఏళ్ల యూట్యూబ్ వ్లాగర్, "Travel with Jo" అనే ఛానెల్ ద్వారా పలు దేశాల్లోని ప్రయాణ అనుభవాలను పంచుకుంటూ ప్రజాదరణ పొందారు. అయితే, 2025 మేలో ఆమెపై పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.2023లో ఆమె మొదటిసారిగా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అక్కడ ఆమెకు "దానిష్" అనే పాక్ అధికారి పరిచయం అయ్యాడు. అదే సమయంలో ఆమె పాక్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 2023 నుంచి 2025 మధ్యకాలంలో ఆమె కనీసం మూడు సార్లు పాకిస్తాన్‌కు ప్రయాణించినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. లాహోర్, కటాస్ రాజ్ ఆలయం వంటి ప్రదేశాల్లో ఆమె తీసిన వీడియోలు ఇప్పుడు దర్యాప్తులో భాగంగా పరిశీలించబడుతున్నాయి. 2024–2025లో కేరళ టూరిజం శాఖ ఆమెను అధికారికంగా ఆహ్వానించి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టూరిజం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆహ్వానించింది. ఆమె ప్రయాణ ఖర్చులు, వసతి, షెడ్యూల్ అన్నీ ప్రభుత్వమే భరించింది. ఆమె "కేరళ సారీ" ధరించి తేయ్యం ప్రదర్శనలో పాల్గొన్న వీడియో వైరల్ అయింది. 2025 ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడికి ముందు ఆమె పాకిస్తాన్లో కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెకు అక్కడ సాయుధ రక్షణ ఉండటం గమనార్హం. ఇది ఆమెపై ఉన్న అనుమానాలను మరింత బలపరిచింది. దర్యాప్తులో భాగంగా.. ఆమె యూట్యూబ్ ఛానెల్లోని పాక్, బంగ్లాదేశ్, థాయిలాండ్ వీడియోలన్నీంటిని ఏజెన్సీలు పరిశీలించాయి. డిలీట్ చేసిన డాటాను సైతం రికవరీ చేసి గుట్టును తేల్చే ప్రయత్నంలో ఉన్నాయి. 2025 మే 16న హర్యానాలోని హిసార్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై Official Secrets Act, 1923 కింద కేసు నమోదు చేశారు. జూన్ 12న బెయిల్ అభ్యర్థన తిరస్కరించబడింది. జూన్ 23న న్యాయస్థానం ఆమె న్యాయ హిరాసతను మరో రెండు వారాలు పొడిగించింది. తదుపరి విచారణ జూలై 7న(ఇవాళ) జరగనుంది. పాక్‌కు భారత రహస్యాలను చేరవేశారనే అభియోగాల కింద జ్యోతితో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో మరో 12 మందిని అరెస్ట్ చేశారు.

పసిడి ప్రియుల్లో మళ్లీ ఆశలు.. పడుతున్న ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఈ రోజు వినియోగదారులకు ఊరట కల్పించింది. క్రితం ముగింపుతో పోలిస్తే సోమవారం బంగారం ధర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళా (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

అయ్యో.. ఇలా ఎందుకు చేశావు గిల్?.. చిక్కుల్లో కెప్టెన్?!
భారత టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సాధించాడు. ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలిసారి టీమిండియాకు టెస్టు విజయాన్ని అందించాడు. బ్యాటర్‌గానూ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని.. సారథిగా రెండో ప్రయత్నంలోనే చిరస్మరణీయ గెలుపుతో సత్తా చాటాడు.చారిత్రాత్మక విజయంతోనే సమాధానంఈ నేపథ్యంలో 25 ఏళ్ల శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కెప్టెన్‌గా ఇతడేంటి? అన్న వాళ్లకు చారిత్రాత్మక విజయంతోనే సమాధానమిచ్చాడంటూ మాజీ క్రికెటర్లు ఈ కుర్రాడిని కొనియాడుతున్నారు. అయితే, అంతా బాగానే ఉన్నా టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయంలో గిల్ వ్యవహరించిన తీరు అతడిని చిక్కుల్లో పడేసేలా ఉంది.చిక్కుల్లో పడేలా గిల్ చర్య?టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకం (269)తో చెలరేగిన గిల్.. రెండో ఇన్నింగ్స్ (161)లోనూ శతక్కొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో తాను అవుటైన కాసేపటికే గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ ప్రకటన చేశాడు.డ్రెసింగ్‌రూమ్ బయటకు వచ్చి అప్పటికి క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా (69*), వాషింగ్టన్ సుందర్ (12*)లను వెనక్కి రావాల్సిందిగా గిల్ రెండు చేతులతో సైగ చేశాడు. అయితే, ఈ సందర్భంగా అతడు తన జెర్సీ తీసేసి.. బ్లాక్ వెస్ట్ (లో దుస్తులు)తో దర్శనమిచ్చాడు. అది నైక్ బ్రాండ్‌కు చెందినది.ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు గిల్ తీరును విమర్శిస్తూ అతడితో పాటు బీసీసీఐ కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే..బీసీసీఐ అధికారిక కిట్ స్పాన్సర్ అడిడాస్ అన్న విషయం తెలిసిందే. ఇందుకు గానూ భారత పురుషుల జట్టు జెర్సీలు, కిట్లు రూపొందించేందుకు బీసీసీఐతో భారీ మొత్తానికి అడిడాస్ 2023లో ఐదేళ్లకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే, ఆ బ్రాండ్‌కు కాంపిటీటర్ అయిన మరో బ్రాండ్ వెస్ట్ ధరించి గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం.. అది విశేషంగా వైరల్ కావడంతో చట్టపరంగా బోర్డుకు, అతడికి చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. మరి కొందరేమో ఓ అడుగు ముందుకేసి.. ‘‘నువ్వు ఇప్పుడు కెప్టెన్‌వి. ఆచితూచి అడుగేయాలి. ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు’’ అంటూ గిల్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 10 -14 మధ్య లార్డ్స్‌లో మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లు🏏టీమిండియా- 587 & 427/6 d🏏ఇంగ్లండ్- 407 & 271🏏ఫలితం- ఇంగ్లండ్‌ను 336 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 🏏తొలి టెస్టులో ఓటమికి బదులు తీర్చుకుని.. సిరీస్ 1-1తో సిరీస్ సమం🏏ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- శుబ్‌మన్ గిల్.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్pic.twitter.com/SkeKPaxH5S— Shubman Gill (@ShubmanGill) July 6, 2025While Siraj & Akash Deep tore through England, the umpire had other plans for DSP Siraj… and got the stare of the century. 😤🎥India made history — first Asian team to conquer Edgbaston! 🏰🇮🇳From serious records to serial reactions —Historic win. Hilarious moments. One… pic.twitter.com/jF3q64fpws— Star Sports (@StarSportsIndia) July 6, 2025

విశాఖ: సంచలన కేసు.. కూటమి నేతలకు లింకులు?
సాక్షి, విశాఖపట్నం: నగరంలో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. అరెస్టుల సంఖ్య పెరగడంతో పాటు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ఈ కేసులో కూటమి నేతల కుమారులు ఉన్నట్లు, వాళ్లను తప్పించే ప్రయత్నాలు జరిగిపోయాయని సమాచారం.ప్రశాంత నగరంగా పేరున్న విశాఖ.. ఏడాది కాలంగా నేరాలకు అడ్డాగా మారిపోయింది. ఎన్నడూ లేనివిధంగా తాజాగా డ్రగ్స్ కేసు బయటపడింది. అయితే ఈ విచారణలో తీగ లాగితే లింకులు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తొలుత త్రీటౌన్ పోలీసులు ప్రకటించారు. అయితే శనివారం నాటికి అందులో ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేసినట్లు చూపించారు. అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా, సౌతాఫ్రికాకు చెందిన థామస్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు. మిగిలిన ముగ్గురిని అనుమానితులుగా పేర్కొన్న పోలీసులు.. ఆదివారం మరొకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నగరానికి చెందిన డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య వర్మ రూ. 65 వేల రూపాయలు తో డ్రగ్స్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని, ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు. అయితే.. ఈ కేసులో కూటమి నేతలకు లింకులు ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్‌కేసులో కూటమి నేతల కుమారులు ఉన్నారని సమాచారం. దీంతో కూటమి ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ స్వయంగా రంగంలోకి దిగారు. ఓ ఎమ్మెల్యే ఫోన్ కాల్‌తో ముగ్గురిని ఈపాటికే బయటకు పంపించేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

చిన్నతనం నుంచే ఇంత పిచ్చా, పట్టించుకోకపోతే ముప్పే : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
సోషల్ మీడియా మత్తు వైరస్‌లా పట్టి పీడిస్తోంది. రీల్స్ మోజులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడటం లేదు. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అంతా సోషల్ మీడియాకు ఎంత అడిక్ట్ అవుతున్నారు అనే దానికి నిదర్శనం తాజా ఘటన ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఎండీ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దీంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ఎంత ప్రమాదకరమో సజ్జనార్ హెచ్చరించారు. పిల్లల వ్యవహారంపై జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. వీసీ సజ్జనార్ ఎక్స్ పోస్ట్చిన్నతనం నుంచే రీల్స్ పిచ్చి అనే మానసిక రోగానికి పిల్లలు ఇలా గురైతుండటం అత్యంత బాధాకరం. సోషల్ మీడియా మత్తులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడటం లేదు.ఇలాంటి సోషల్ మీడియా వ్యసనాన్ని చూస్తూ వదిలేస్తే.. ఎంతో మంది పిల్లలు, యువకుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది.సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన పిల్లలకు కౌన్సెలింగ్ అనేది అత్యవసరం. ఈ వ్యసనం వల్ల జరిగే అనర్థాలను స్పష్టంగా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.అందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. బిజీ లైఫ్ అంటూ పిల్లల పట్ల ఏమాత్రం ఆశ్రద్దగా ఉండొద్దు. నిర్లక్ష్యంగా ఉంటే మీ పిల్లల జీవితాలను మీరే చేజేతులా నాశనం చేసిన వాళ్లుగా మిగిలిపోతారు. గుర్తుంచుకోండి.. నష్టం జరిగిన తర్వాత బాధపడితే లాభం ఉండదు. ముందే మేలుకోండి. పొంచి ఉన్న సోషల్ మీడియా ముప్పుకు మీ పిల్లలని దూరంగా ఉంచండి. ఎక్కడ జరిగిందీ ఘటన, ముగ్గురు అరెస్ట్ఇన్ఫ్లుయెన్సర్లలో రీల్ మానియా వారి ప్రాణాలను ఎలా ప్రమాదంలో పడవేస్తుందో చెప్పే మరో ఉదాహరణ, ఒడిశాలోని బౌధ్ జిల్లాలో పురునపాణి స్టేషన్ సమీపంలోని దలుపాలి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్ బాలురను పోలీసులు అరెస్టు చేశారు.ఈ వీడియోలో ఒక బాలుడు పట్టాలపై పడుకుని అత్యంత ప్రమాదకరమైన స్టండ్ చేశాడు. దీన్నిస్నేహితులలో ఒకరు డైరెక్ట్ చేయగా, మరొకరు వీడియో తీశాడు. ఈ స్టంట్‌ను చూస్తున్న చప్పట్లతో కేరింతలు కొట్టాడు. బాలుడు లేచి నిలబడి ఫోటోలకు పోజు ఇచ్చాడు. స్నేహితులు ఆనందంతో కేకలు వేస్తుండటం చూడవచ్చు. పోలీసులు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి నిర్లక్ష్యపు చర్యలు ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయని,భద్రతా చట్టాలను ఉల్లంఘన అని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాలో తమ పిల్లల వ్యవహారాన్ని ఒక కంట కని పెట్టాలని తల్లిదండ్రులను కోరారు.అయితే ట్రాక్‌లపై పడుకున్న బాలుడు స్పందించాడు. ఇలా చేస్తే ఈ రీల్ వైరల్ అవుతుందని తన స్నేహితులు ఈ చెప్పారని, ట్రాక్‌పై ఉండగా, మీదనుంచి రైలు వెళుతున్నపుడు, గుండె వేగంగా కొట్టుకుందని, బ్రతుకుతానని ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు. కాగా వెర్రి తలలు వేస్తున్న సోషల్ మీడియా ధోరణులపై నెటిజనులను హెచ్చరించడం ఇదే మొదటిసారి. కాదు అనేక విషయాలపై ఆయన యువతను, టీనజర్లను హెచ్చరిస్తూనే ఉంటారు. బిడ్డల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ తల్లిదండ్రులకు నిరంతరం సూచనలిస్తూనే ఉంటారు. అంతేకాదు ఇటీవల బెట్టింగ్ యాప్‌లపై ప్రకటించిన యుద్ధం, దాని ప్రభావం తెలిసిన సంగతే.

ఆ మాటల మతలబు ఏమిటి పవన్?
జగన్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడో చూస్తా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్! రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లూ మామూలే కానీ.. పవన్ కల్యాణ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌ల ఈ మాటల వెనుక ఏదో నిగూఢ అర్థం ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. 2024 నాటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి గెలిచిన తీరుపై ఇప్పటికీ చాలా సందేహాలు ఉన్నాయి. టీడీపీ ఆర్భాటంగా ప్రకటించి అమలు చేయని సూపర్ సిక్స్ వాగ్ధానాల ప్రభావం కొంత ఉంటే ఉండవచ్చునేమో కానీ.. వైఎస్సార్సీపీకి అనూహ్యంగా తగ్గిన సీట్లు ఈవీఎంల మహిమ వల్లేనని సామాన్యులతోపాటు మేధావులూ బహిరంగంగానే ప్రకటించారు. కూటమి నేతల మాటలిప్పుడు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లుగా ఉన్నాయి. ఏడాది కూటమి పాలనలో జరిగిన పరిణామాలు, కూటమి నేతల దాష్టీకాలు, పోలీసులను అడ్డంపెట్టుకుని తమను వేధిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు చాలా ఆగ్రహంతో ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కొన్నేళ్లు ఓపిక పడితే మళ్లీ అధికారం మనదే అని భరోసా కూడా ఇస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే జగన్‌కు రాష్ట్రం నలుమూలల్లోనూ ప్రజాదరణ వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒకరకమైన పట్టుదలతో ఉంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఎక్కడ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడో అన్న భయం పట్టుకుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ మధ్యే ఒక సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మళ్లీ గెలిచే పరిస్థితిలోకి వచ్చిందన్న అర్థంతో మాట్లాడారు. అలాగే జగన్‌ను ఒక భూతంలా అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలూ చేశారు. మంత్రి లోకేశ్ కూడా పలు సందర్భాల్లో జగన్ మళ్లీ వస్తే ఏమిటని పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారని.. చెబతూండటం ప్రస్తావనార్హం. ఈ వ్యాఖ్యలన్నింటి ద్వారా స్పష్టమయ్యే విషయం ఒక్కటే.. ఓటమి ఎదురుదెబ్బ నుంచి జగన్ బాగా పుంజుకున్నట్లే అని! ప్రజాదరణ బాగా పెరిగిందీ అని! దీనికి కారణం ఏమిటో కూడా కూటమి నేతలకు బాగానే తెలుసు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతూండటంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. కూటమి నేతలు మాత్రం ఈ మాట చెప్పకుండా, జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అప్రమత్తంగా ఉంటామని అంటున్రాను. తాజాగా పవన్ కల్యాణ్ కూడా సరిగ్గా ఆ దారిలోనే మార్కాపురం సభలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ వారు మళ్లీ అధికారంలోకి ఎలా వస్తారో తామూ చూస్తామని అన్నారు. అధికారంలో ఉన్న వారు తాము తిరిగి అధికారంలోకి వచ్చేలా పాలన చేస్తున్నామని, మానిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తున్నామని చెప్పగలగాలి. ఏడాది సమయంలో ఏమి సాధించారో చెప్పాలి. కాని ఈ ముగ్గురు నేతలు పెద్దగా వాటి జోలికి వెళ్లడం లేదు. పవన్ కూడా జగన్ టైమ్ లో అభివృద్ది జరగలేదని విమర్శించారు. పవన్‌కు నిజంగా అభివృద్దిపై శ్రద్ద ఉంటే మార్కాపురంలో జగన్ హయాంలో చేపట్టిన వైద్యకళాశాల భవనాలను చూసి ఉండాల్సింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భవనాల నిర్మాణం ఎందుకు ఆగిందో చెప్పి ఉండాలి.అంతేకాదు. వెలిగొండ ప్రాజెక్టును ఏడాది కాలంగా ఎందుకు పూర్తి చేయలేదు? నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు? వీటిపై మాట్లాడకుండా, వైఎస్సార్సీపీ వారు అనని మాటలను వారికి అంటకట్టి సినిమా డైలాగులు చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం? పవన్ తరచు సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారట. కొత్త సినిమా ప్రచారం గురించి అప్పడప్పుడు కొన్ని సభలు పెట్టుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కుత్తుకలు కోస్తామని, గూండాగిరి చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని పవన్ చెబుతున్నారు. అబద్దాలు చెప్పడంలో టీడీపీ రికార్డును దాటిపోవాలని పవన్ అనుకుంటే ఎవరం ఏమీ చేయలేం. ఈ ఏడాదిలో కూటమికి చెందిన వారు ఎన్ని దాడులు చేశారు? వైఎస్సార్సీపీ వారు ఎంతమంది హత్యలు, దాడులకు గురయ్యారు? తప్పుడు కేసులలో పెట్టి ఎందరిని అరెస్టు చేశారు? అన్నవి పవన్ కు తెలియదా! అయినా.. అధికారంలో ఉన్నప్పుడు అంతా హాపీ అనుకుంటూ పవన్ అనుకోవచ్చు. రాజకీయ విమర్శల వరకు ఓకే. కాని వైఎస్సార్సీపీ వారు అధికారంలోకి ఎలా వస్తారో చూస్తామని అనడంలోనే అనుమానం కలుగుతుంది. బహుశా గత ఎన్నికలలో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లోనూ ఈవీఎంలు తమని గట్టెక్కిస్తాయన్న ధీమానా? ఒక రకంగా ఇది పవన్ కల్యాణ్ బెదిరింపుగానే చూడాలి. రఫ్పా, రఫ్పా అనే డైలాగుకు వక్రభాష్యం చెబుతున్న పవన్ కల్యాణ్ తాను విపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా దౌర్జన్య పూరితంగా మాట్లాడింది.. అభ్యంతరకరంగా మాట్లాడింది గుర్తు లేకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని పవన్ చేసిన ఆరోపణపై ఇంతవరకు ఎందుకు నోరు విప్పడం లేదు? ఈ సంవత్సరంలో మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనలపై పవన్ ఎన్నడైనా స్పందించారా? ఏమీ చేయక పోయినా, ప్రభుత్వం ఎంత అరాచకంగా ఉన్నా గెలవగలమని వారు భావిస్తున్నారంటే ఈవీఎంల మానిప్యులేషన్ తమ చేతిలో ఉందన్న అభిప్రాయమే కారణమా?. కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేతలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు ఈవీఎంల అక్రమాలు, ఓట్ల పోలింగ్‌లో జరిగిన అవకతవకలను ఆధార సహితంగా ఎన్నికల కమిషన్‌కు వివరించి వచ్చారు. వారి లెక్కల ప్రకారం పోలింగ్ శాతంలో తేడా వల్ల 87 శాసనసభ నియోజకవర్గాలలో గెలుపు, ఓటములను నిర్దేశితమయ్యాయి. పోలింగ్ ముగిసే టైమ్ కు ఉన్న ఓట్ల శాతం, తదుపరి నమోదైన ఓట్ల శాతానికి ఉన్న తేడా ఏకంగా 12.54 శాతం ఉన్న సంగతిని వారు తెలియ చేశారు. హిందుపూర్, రాయచోటి వంటి నియోజకవర్గాలలో ఓటింగ్ సరళి వ్యత్యాసాలను వివరించారు. అనూహ్యమైన రీతిలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ మార్పులు, ఎన్నికల అధికారులు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించకుండా దాటవేసి, దగ్దం చేసిన తీరు మొదలైనవి చూసిన వారందరికి ఏదో మోసం జరిగి ఉంటుందన్న భావన ఏర్పడింది. ఎక్స్ అధిపతి ఎలన్ మస్క వంటి వారు కూడా ఈవీఎంలను టాంపర్ చేయవచ్చని చెప్పడం కూడా గమనించాలి. ఎవరో ఎందుకు. టీడీపీ ఓటమి పాలైన ప్రతి సందర్భంలోను చంద్రబాబు నాయుడు ఈవీఎంలను తప్పుపట్టారు. వాటి ద్వారా మోసం చేయవచ్చని గతంలో ఆయన స్వయంగా ప్రదర్శనలు చేయించారు.ఇప్పుడు ఆయన మాట్లాడకపోతుండవచ్చు. అది వేరే సంగతి.ఒంగోలు లో వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని అప్పట్లో వైఎస్సార్సీపీలో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు చేసిన ప్రయత్నాలను ఎన్నికల సంఘం, అధికారులు అంగీకరించకుండా డ్రామా నడపడం, వీవీప్యాట్ స్లిప్ లను పది, పదిహేను రోజుల్లోనే దగ్దం చేయడం వంటివి పలు సందేహాలకు అవకాశం ఇచ్చాయి. కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు కూడా ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించాయి. సీపీఎం నేత వి.శ్రీనివాసరావు కూడా ఏపీలో 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు, తాజాగా పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ ఎలా గెలుస్తుందో తామూ చూస్తామంటూ చేసిన ప్రకటనలపై కూడా సందేహాలు కలుగుతాయి. ఈవీఓంల మహిమను తక్కువ అంచనా వేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే బాలెట్ పత్రాలనే వాడాలని వైఎస్సార్సీపీతో సహా పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ఎన్నికల సంఘం అంగీకరించకపోతే ప్రజలలో ఈవీఎంలపై అనుమానాలు మరింతగా బలపడతాయి. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

బ్రిక్స్‌తో పొత్తు ఉంటే.. ట్రంప్ లేటెస్ట్ వార్నింగ్
బ్రిక్స్ సదస్సు వేళ.. అమెరికా అధ్యక్షుడు మరో సంచలన ప్రకటన చేశారు. బ్రిక్స్‌తో పొత్తు ఉంటే 10 శాతం అదనపు సుంకాలు తప్పవని హెచ్చరించారు. బిక్స్ విధానాలు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆయన.. ఈ అడిషనల్ టారిఫ్‌ల విధింపులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల BRICS దేశాలపై గట్టి హెచ్చరిక జారీ చేశారు. BRICS కూటమి అమెరికా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని ట్రంప్ ఆరోపించారు. BRICSతో పొత్తు పెట్టుకునే ఏ దేశమైనా 10% అదనపు టారిఫ్‌కు గురవుతుందని ప్రకటించారు. ఈ విధానంలో ఏ దేశానికి.. ఎలాంటి మినహాయింపులు ఉండబోదు అని స్పష్టం చేశారు. అయితే బ్రిక్స్‌ను అమెరికా వ్యతిరేక కూటమిగా ఆయన ఎందుకు అభివర్ణించారో స్పష్టత లేనప్పటికీ.. .. బ్రెజిల్ రియో డి జనీరో వేదికగా BRICS 2025 సమ్మిట్ జరుగుతున్న వేళ.. ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. తాజాగా BRICS దేశాలు అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులను తీవ్రంగా ఖండించాయి. అమెరికా యుద్ధ చర్యలతో వాణిజ్య ఆంక్షలు వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. అంతేకాదు.. అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్లను ప్రస్తావించకుండానే.. ప్రతీకార సుంకాలు, బెదిరింపులను ఖండిస్తూ రియో డి జనీరో డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. ఇందులో.. BRICS నేతలు ఏకపక్ష టారిఫ్ విధానాలను తీవ్రంగా ఖండించారు ఈ సుంకాలు WTO నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఈ నిర్ణయాలు.. ప్రపంచ వాణిజ్య స్థిరత్వాన్ని ఇది దెబ్బతీస్తుందని హెచ్చరించారు.BRICS 2009లో ఏర్పాటైంది. భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, UAE, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్.. సభ్య దేశాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం 11 సభ్య దేశాల కూటమి జనాభా.. ప్రపంచ జనాభాలో సుమారు 49.5% (దాదాపు 3.93 బిలియన్ మంది) కలిగి ఉంది. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో (GDP) సుమారు 40% వాటా కలిగి ఉన్నాయి. అంతేకాదు.. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 26% వాటా BRICS దేశాలదే.ట్రంప్ ఇప్పటికే 12 దేశాలకు టారిఫ్ నోటీసులు సిద్ధం చేశారని తెలిపారు. అమెరికా టారిఫ్ మినహాయింపు 90 రోజుల గడువు ముగుస్తుండడంతో.. ఈ నిర్ణయం జూలై 9న అమలులోకి వచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ మొదలైంది. అయితే..ఆగస్టు 1 నుంచి నూతన వాణిజ్య సుంకాలు: అమెరికా నూతన సుంకాలు జులై 9 నుంచి అమల్లోకి వస్తాయని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అవి ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తాజాగా అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలను నిర్ణయించే పనిలో ట్రంప్ నిమగ్నమై ఉన్నారని వెల్లడించారు.

'హరిహర వీరమల్లు సినిమా అడ్డుకుంటాం'
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా (Hari Hara Veeramallu)కు చిక్కులు తప్పేలా లేవు. ఈ మూవీ పూర్తి కల్పితమని, ప్రజావీరుడు పండగ సాయన్న జీవిత చరిత్రను తీసుకుని చరిత్రలో ఎక్కడాలేని కల్పిత పాత్రలతో ఈ సినిమా తీస్తున్నారని బీసీ సంఘం నాయకుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి డాక్టర్ శివ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించే ఈ సినిమాను అడ్డుకుంటామని, త్వరలో ఈ చిత్రంపై హైకోర్టులో పిల్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పండగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీశారని తాము ఆరోపించగా చిత్రయూనిట్ తప్పును సమర్థించుకుకోవాలని చూసింది. ఇది పండగ సాయన్న మూవీ కాదని, 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర బుక్కరాయలు కథ అని చెప్పారు.కానీ, సినిమా ట్రైలర్లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. డబ్బుల కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తప్పకుండా అడ్డుకుంటాం. త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తాం అని శివ తెలిపారు. హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే.. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ జూలై 24న విడుదల కానుంది.చదవండి:విశ్వంభర డేట్ ఫిక్స్?

కోరుట్ల: చిన్నమ్మా.. ఎంత పని చేశావమ్మా!
కోరుట్ల: పట్ణణంలో శనివారం రాత్రి హత్యకు గురైన ఆరేళ్ల బాలిక హితాక్షి కేసు కొత్త మలుపు తిరిగింది. చిన్నారిని ఆమె చిన్నమ్మే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ప్రస్తుతం కథలాపూర్ పోలీస్ స్టేషన్లో నిందితురాలు మమతను విచారిస్తున్న పోలీసులు, ఇవాళ.. లేదంటే రేపు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. కోరుట్ల ఆదర్శనగర్ పాప హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం హితిక్ష అనే ఐదేళ్ల పాప అదృశ్యం కాగా, ఆమె తండ్రి ఫిర్యాదుతో ఈ ఘోర హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఇంటిపక్కనే బాత్రూమ్లో విగతజీవిగా పాప మృతదేహాం లభించగా.. గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. పలు కోణాల్లో బృందాలుగా పోలీసుల విచారణ చేపట్టి అనుమానంతో పలువురిని ప్రశ్నించారు. ముందుగా మృతదేహం దొరికిన ఇంటి యజమానిని అనుమానించినా.. అతడికి ఈ హత్యతో సంబంధం లేదని నిర్ధారించుకున్నారు. అయితే తోటికోడలు పెత్తనం సహించలేకే మమత ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. హత్యలో ఒక్కరే ఉన్నారా..? మరెవరైనా పాలుపంచుకున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆదర్శనగర్‌కు చెందిన సోదరులు ఆకుల రాము, లక్ష్మణ్‌లకు నవీన, మమతతో వివాహమైంది. నవీన, మమత అక్కాచెల్లెళ్ల కూతుళ్లు. రాము, నవీన దంపతులకు కుమారుడు వేదాంశ్, కూతురు హితాక్షి (6) ఉన్నారు. రాములు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లాడు. లక్ష్మణ్, మమత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. నాలుగు నెలల క్రితం మమత ఆన్లైన్లో బెట్టింగ్‌కు పాల్పడి రూ.18 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. దీనిపై కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌క్రైం కేసు నమోదైంది. వారి కుటుంబంలో కొద్దికాలంగా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇంట్లో నవీనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమెపై మమత ద్వేషం పెంచుకున్నట్లు తెలిసింది. శనివారం ఉదయం వేదాంశ్, హితాక్షిని స్కూల్‌కు పంపిన నవీన.. ఆడపడుచుతో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. ఇంట్లో అత్తతోపాటు మమత మాత్రమే ఉంది. సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు రాగానే మమత వారితో కలిసి పెద్దపులుల వేషధారణలు చూసేందుకు వెళ్లింది. అదే సమయంలో తన వెంట కూరగాయలు కోసే కత్తి, మొక్కలు కత్తిరించే కట్టర్‌ను తీసుకెళ్లినట్లు సమాచారం. సమీపంలోని ఇంటికి గేటు, బాత్రూంకు తలుపు లేకపోవడం.. సదరు ఇంటి యజమానికి ఆ ఏరియాలో కొంత వివాదాస్పదుడిగా పేరు ఉండటంతో ఆ ఇంటిని హత్య కోసం ఎంచుకున్నట్లు సమాచారం. రాత్రి 7.30 గంటల సమయంలో ముగ్గురు పిల్లలను ఇంటికి పంపిన మమత.. హితాక్షిని సదరు ఇంట్లోకి తీసుకెళ్లి గొంతుపై కత్తితో కోసి, కట్టర్‌తో మెడ, గొంతు చుట్టు కత్తిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హితాక్షి చనిపోగానే హడావుడిగా ఇంటికి తిరిగి వెళ్లిన మమత.. రక్తం మరకలు ఉన్న దుస్తులు మార్చుకొని వాటిని వాషింగ్ మెషీన్లో వేసి, అందరితోపాటు హితాక్షి కోసం వెతికినట్లు తెలిసింది. హితాక్షి మృతదేహం దొరకగానే నవీనతో కలిసి ఆస్పత్రికి వచ్చిన మమత అక్కడ బోరున విలపించడం గమనార్హం.
థియేటర్లో చిన్న చిత్రాలు.. ఓటీటీలో 26 సినిమాలు/ సిరీస్‌లు
అత్తపై కోడలు దాడి.. వీడియో తీసిన తల్లి
చాక్లెట్ డే : చాక్లెట్‌తో ఆరోగ్యం, ఇంట్రస్టింగ్ ఫాక్ట్స్
వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా.. సిరీస్ కైవసం
'కన్పప్ప'లో వాళ్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
బిగ్ న్యూస్:: అవును.. నేను పాక్ ఆర్మీ ఏజెంట్‌నే: తహవూర్ రాణా
రిటర్నులు ఎవరు వేయక్కర్లేదంటే..
Indonesia: అదృశ్యమైన రైతు.. భారీ కొండచిలువ కడుపులో..
కూటమి నేతా.. మజాకా!
నాలుగో భార్య వచ్చిన వేళావిశేషం.. లాటరీ గెలిచిన నటుడు
'మా అమ్మ ప్రెగ్నెన్సీ'.. వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్
జియో కొత్త ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఏడాది వ్యాలిడిటీ
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్
ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఆకస్మిక ధనలాభం
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. విహాన్ శతకం.. భారత్ భారీ స్కోరు
ఆ మహానుభావుల విలువ తగ్గించకండి సార్!
రౌడీషిటర్‌తో కౌన్సిలర్ వివాహేతర సంబంధం
కొడుకు వీడియో వైరల్.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి!
జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. సంఘంలో ఆదరణ
భూమిపైకి కుసుమ ఖడ్గం
అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
ఎంతోసేపు పురిటినొప్పులు భరించాక పుట్టావురా.. నటి భావోద్వేగం
ఈ రాశి వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు.. పనులు విజయవంతంగా సాగుతాయి.
అదేదో ట్రంప్‌కు చెపితే బెటరనుకుంటా కామ్రేడ్!
వనిందు హసరంగా ప్రపంచ రికార్డు.. వన్డేల్లో తొలి ప్లేయర్‌గా
రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు
థియేటర్లో చిన్న చిత్రాలు.. ఓటీటీలో 26 సినిమాలు/ సిరీస్‌లు
అత్తపై కోడలు దాడి.. వీడియో తీసిన తల్లి
చాక్లెట్ డే : చాక్లెట్‌తో ఆరోగ్యం, ఇంట్రస్టింగ్ ఫాక్ట్స్
వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా.. సిరీస్ కైవసం
'కన్పప్ప'లో వాళ్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
బిగ్ న్యూస్:: అవును.. నేను పాక్ ఆర్మీ ఏజెంట్‌నే: తహవూర్ రాణా
రిటర్నులు ఎవరు వేయక్కర్లేదంటే..
Indonesia: అదృశ్యమైన రైతు.. భారీ కొండచిలువ కడుపులో..
కూటమి నేతా.. మజాకా!
నాలుగో భార్య వచ్చిన వేళావిశేషం.. లాటరీ గెలిచిన నటుడు
'మా అమ్మ ప్రెగ్నెన్సీ'.. వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్
జియో కొత్త ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఏడాది వ్యాలిడిటీ
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్
ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఆకస్మిక ధనలాభం
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. విహాన్ శతకం.. భారత్ భారీ స్కోరు
ఆ మహానుభావుల విలువ తగ్గించకండి సార్!
రౌడీషిటర్‌తో కౌన్సిలర్ వివాహేతర సంబంధం
కొడుకు వీడియో వైరల్.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. సంఘంలో ఆదరణ
భూమిపైకి కుసుమ ఖడ్గం
ఎంతోసేపు పురిటినొప్పులు భరించాక పుట్టావురా.. నటి భావోద్వేగం
ఈ రాశి వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు.. పనులు విజయవంతంగా సాగుతాయి.
అలాగే, తనకు నోబెల్ వచ్చేటట్లు అర్జంటుగా ఏదైనా ఒక చట్టం చేయమంటున్నారు!!
వనిందు హసరంగా ప్రపంచ రికార్డు.. వన్డేల్లో తొలి ప్లేయర్‌గా
అదేదో ట్రంప్‌కు చెపితే బెటరనుకుంటా కామ్రేడ్!
రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు
చరిత్ర సృష్టించిన పంత్.. ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు బద్దలు
సినిమా

'హరిహర వీరమల్లు సినిమా అడ్డుకుంటాం'
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా (Hari Hara Veeramallu)కు చిక్కులు తప్పేలా లేవు. ఈ మూవీ పూర్తి కల్పితమని, ప్రజావీరుడు పండగ సాయన్న జీవిత చరిత్రను తీసుకుని చరిత్రలో ఎక్కడాలేని కల్పిత పాత్రలతో ఈ సినిమా తీస్తున్నారని బీసీ సంఘం నాయకుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి డాక్టర్ శివ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించే ఈ సినిమాను అడ్డుకుంటామని, త్వరలో ఈ చిత్రంపై హైకోర్టులో పిల్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పండగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీశారని తాము ఆరోపించగా చిత్రయూనిట్ తప్పును సమర్థించుకుకోవాలని చూసింది. ఇది పండగ సాయన్న మూవీ కాదని, 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర బుక్కరాయలు కథ అని చెప్పారు.కానీ, సినిమా ట్రైలర్లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. డబ్బుల కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తప్పకుండా అడ్డుకుంటాం. త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తాం అని శివ తెలిపారు. హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే.. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ జూలై 24న విడుదల కానుంది.చదవండి:విశ్వంభర డేట్ ఫిక్స్?

జర్నలిస్టు నుంచి నిర్మాతగా.. 25 మంది తెలుగమ్మాయిలను పరిచయం చేస్తా!
‘‘ఒకప్పుడు శాటిలైట్ హక్కులు, ఆ తర్వాత హిందీ డబ్బింగ్ హక్కులు, ఇటీవల ఓటీటీ ... ఇలా ఒక్కో టైమ్‌లో ఒక్కో విధంగా నిర్మాతలకు ఆదాయం వస్తుంటుంది. కానీ ఈ అన్ని దశల్లోనూ థియేటర్స్‌లో ఆడిన సినిమాలే ఎక్కువ లాభాలను తీసుకువచ్చాయి. థియేటర్స్‌లో ఆడిన సినిమాలే మంచివని నిర్మాతలు మరింత నమ్మితే ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు కూడా బాగుంటాయి. ఓటీటీ వాళ్ల నుంచి డబ్బులొస్తాయి అని హీరో–డైరెక్టర్ కాంబినేషన్‌ని సెట్ చేసుకుని ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు వర్కౌట్ కాలేదు’’ అని నిర్మాత ఎస్కేఎన్ (SKN) అన్నారు. ఈరోజుల్లో మూవీ చేశాం..సోమవారం (జూలై 7) ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్కేఎన్ మాట్లాడుతూ– ‘‘జర్నలిస్ట్‌గా ఉన్న నేను చరణ్, బన్నీ (రామ్‌చరణ్, అల్లు అర్జున్) సలహా మేరకు పీఆర్ఓగా కెరీర్ ఆరంభించాను. అయితే దర్శకుడు మారుతి తన దర్శకత్వంలో చేయబోయే సినిమాకు నిర్మాతగా ఉండమని ప్రోత్సహించాడు. అలా మారుతి దర్శకత్వంలో నేను, శ్రేయాస్ శ్రీను కలిసి ‘ఈ రోజుల్లో..’ సినిమా చేశాం. ఆ సినిమా సక్సెస్‌తో నిర్మాతగా నా జర్నీ మొదలైంది. 25 మంది తెలుగమ్మాయిల పరిచయంఇక యూవీ క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గీతా ఆర్ట్స్, మైత్రీ... ఇలా ఇతర నిర్మాణ సంస్థలతోనూ అసోసియేట్ అయి, సినిమాలు చేస్తున్నానంటే ఇందుకు కారణం అల్లు అరవింద్‌గారు ఇచ్చిన ప్రోత్సాహం. ఎలాంటి కష్టం వచ్చినా స్థిరంగా ఉండటం మిత్రుడు, నిర్మాత బన్నీ వాసు నుంచి నేర్చుకున్నా. అల్లు అర్జున్‌గారి నుంచి నాకు మోరల్ స΄ోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అయితే నిర్మాతగా ఉండటం అనేది ముళ్ల సింహాసనం లాంటిది. ఇక 25 మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేయాలనే టార్గెట్‌తో ఏడెనిమిది మందిని పరిచయం చేశాను. సినిమాలుహీరోయిన్స్ అని మాత్రమే కాకుండా... ఇతర విభాగాల్లోనూ చాన్స్ కల్పిస్తున్నాం. త్వరలో ఓ మహిళా దర్శకురాలిని పరిచయం చేయనున్నాను. ఇక రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’, కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. తెలుగు ‘బేబీ’ హిందీ రీమేక్ షూటింగ్ వచ్చే నెల ప్రారంభిస్తాం. సంతోష్ శోభన్, అలేఖ్య హారికల సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నూతన దర్శకులు కృష్ణ, అవినాష్‌లతో సినిమాలు ఉన్నాయి. ‘ది రాజాసాబ్’ తర్వాత మారుతితో ఓ సినిమా, హిందీ ‘బేబీ’ తర్వాత సాయి రాజేశ్‌తో మరో సినిమా ఉన్నాయి. ‘త్రీ రోజెస్ 2’ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది’’ అని చెప్పారు.చదవండి: ధురంధర్: వాస్తవ కథను వెలికి తీద్దాం

మహేశ్‌బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు
సినీ నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా, ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆయన్ని.. 3వ ప్రతివాదిగా పేర్కొంటూ నమోదైన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. మొత్తం ముగ్గురు ప్రతివాదులకు నోటీసులిచ్చిన కమిషన్.. ప్రతివాదుల హాజరు కోసం విచారణను సోమవారాని కి వాయిదా వేసింది. సాయి సూర్య డెవలపర్స్ బాలాపూర్ గ్రామంలో లేఅవుట్ వేశామని చెప్పడంతో ఆకర్షితులైన ఓ మహిళా డాక్టర్, మరో వ్యక్తి చెరో ప్లాటు కొనడానికి రూ. 34.80 లక్షలు చెల్లించారు. అయితే ప్రతిపాదిత ప్రాంతంలో లేఅవుట్ లేదని తెలుసుకొని డబ్బు తిరిగివ్వాలని అడగ్గా సంస్థ యజమాని కంచర్ల సతీశ్‌చంద్ర గుప్తా రూ. 15 లక్షలే చెల్లించారు. బాధితులు వేసిన కేసులో సంస్థతోపాటు దాని యజమాని, ప్రచారకర్తగా ఉన్న మహేశ్‌బాబును ప్రతివాదులుగా పేర్కొన్నారు.ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం మహేష్‌బాబుకి గతంలో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది.

వాస్తవ కథను వెలికి తీద్దాం
‘‘ఒక భారీ అగ్ని ఎగిసే క్షణం ఆసన్నమైంది... కొందరు అపరిచితుల గురించి తెలియని వాస్తవ కథను వెలికి తీద్దాం’’ అంటూ హిందీ చిత్రం ‘ధురంధర్’లోని తన పోస్టర్ని, టీజర్‌ని షేర్ చేశారు హీరో రణ్వీర్ సింగ్. ఆదివారం (జూలై 6) రణ్వీర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్, టీజర్‌ని విడుదల చేసి, ఈ సినిమాని డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. టీజర్లో రణ్వీర్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించారు.థ్రిల్, వయొలెన్స్, మిస్టరీలతో ఈ టీజర్ సాగుతుంది, ‘ధురంధర్’లో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రామ్‌పాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడిగా తొలి చిత్రం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ (2019)తో జాతీయ అవార్డు సాధించిన ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని భారత నిఘా, శాంతి భద్రతల మాజీ అధికారి, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో బీ62 స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిత్రదర్శకుడు ఆదిత్య ధర్ ఓ నిర్మాత కాగా, జ్యోతీ దేశ్‌పాండే సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల రెడ్‌బుక్ అరాచకాలకు హైకోర్టు రెడ్‌సిగ్నల్

మా భూములిచ్చే ప్రసక్తే లేదు... ఏపీ రాజధాని భూ సమీకరణ సభల్లో ఎమ్మెల్యే, అ«ధికారులను తరిమికొట్టిన రైతులు

పాకిస్తాన్‌పై యుద్ధం ఎందుకు ఆపేశారో మోదీ ప్రభుత్వం చెప్పాలి... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్

ఏపీలో గత ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యలో పెరుగుదలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రుజువులు అందజేసిన వైఎస్సార్సీపీ... తమ విజ్ఞప్తులపై సీఈసీ సానుకూలంగా స్పందించిందన్న పార్టీ నేతలు

ఘటన జరిగిన రెండేళ్లకు కేసు నమోదు చేయడం ఏమిటి?... వల్లభనేని వంశీపై కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య... బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం

ప్రజలకు అండగా నిలబడాలి, నిత్యం వారికి అందుబాటులో ఉండాలి... వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రతినిధులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం

ఏపీలో ధాన్యం బకాయిలు వేయి కోట్లు. రెండు నెలలు దాటినా రైతులకు చెల్లింపు లేదు. పట్టించుకోని కూటమి ప్రభుత్వం

ఏపీలో ఈసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు? ఫలితాలొచ్చి 45 రోజులైనా ప్రారంభించకపోవడం ఏమిటి?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

ఆంధ్రప్రదేశ్‌లో బాలికల విద్యను భ్రష్టు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం.. ‘హైస్కూల్ ప్లస్’లు వ్యూహాత్మకంగా నిర్వీర్యం

ప్రమాదానికి ప్రయాణికులు బాధ్యులవుతారా? సింగయ్య మృతి ఘటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలొద్దు... నల్లపాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం
క్రీడలు

అక్కా.. ఇది నీ కోసమే.. బంతి అందుకున్న ప్రతిసారీ..: ఆకాశ్ దీప్ భావోద్వేగం
‘‘మా అక్కకు క్యాన్సర్. గత రెండు నెలలుగా ఆమె వ్యాధితో పోరాడుతోంది. ఇంత వరకు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే, ప్రస్తుతం మా అక్క పరిస్థితి బాగానే ఉంది. తను కోలుకుంటోంది.ఈ మ్యాచ్‌లో నా ఆటతీరుతో ఆమె ఎంతగానో సంతోషించి ఉంటుంది. మా అక్కకు నా ఈ మ్యాచ్‌ను అంకితమిస్తున్నా. ఆమె ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ చెరగకూడదు. ఇది నీ కోసమే అక్కా.. బంతి అందుకున్న ప్రతిసారి నా మనసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి.నీ రూపమే నా మదిలో మెదులుతుంది. నిన్ను సంతోషరచాలనే నా ప్రయత్నాలు. మేమంతా నీతోనే ఉన్నాం’’ అంటూ టీమిండియా స్టార్ ఆకాశ్ దీప్ (Akash Deep) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston)లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ పేస్ బౌలర్.. తన ప్రదర్శనను క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అక్కకు అంకితమిచ్చాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో గిల్ సేన.. ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఆది నుంచే ఆధిపత్యంఇలాంటి తరుణంలో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు బరిలో దిగిన భారత్.. ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగి డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) బాది జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఇంగ్లండ్‌కు 608 పరుగుల మేర భారీ లక్ష్యం విధించగలిగింది.కీలక వికెట్లు కూల్చి.. విజయం అందించిఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆట పూర్తవుతుందనగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. తొలిరోజే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, ఐదో రోజు వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యం కాగా.. ‘డ్రా’ భయం అభిమానులను వెంటాడింది. కానీ ఆకాశ్ దీప్ ఇంగ్లండ్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు.అద్భుతమైన డెలివరీలతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. బెన్ డకెట్ (25), ఓలీ పోప్ (24), జో రూట్ (6), హ్యారీ బ్రూక్ (23), జేమీ స్మిత్ (88) రూపంలో ఏకంగా ఐదు కీలక వికెట్లు కూల్చిన ఆకాశ్.. బ్రైడన్ కార్స్ (38) వికెట్‌తో సిక్సర్ కొట్టాడు. తద్వారా ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తొలిసారి టెస్టు మ్యాచ్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.బుమ్రా లేడు కాబట్టే..నిజానికి రెండో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో ఆకాశ్ దీప్‌నకు తుదిజట్టులో చోటు దక్కింది. ఇక అక్క క్యాన్సర్‌తో పోరాడుతున్న వేళ.. ఓవైపు తోబుట్టువు గురించి మనసులో ఆందోళనలు చెలరేగుతున్నా ఈ రైటార్మ్ పేసర్ తన ఏకాగ్రత చెదరనీయలేదు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.#AkashDeep’s 6/99 was nothing short of sensational. A game-changing performance that turned the tide in India’s favour, securing a historic victory.#ENGvIND 👉 3rd TEST, THU, JULY 10, 2:30 PM onwards on JioHotsta pic.twitter.com/JfBGgKQF7T— Star Sports (@StarSportsIndia) July 6, 2025 ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లతో మెరిశాడు. ఇలా రెండో టెస్టులో మొత్తంగా పది వికెట్లు తీసి టీమిండియా చిరస్మరణీయ విజయంలో కీలకంగా మారాడు. మిగతా వాళ్లలో సిరాజ్ మొత్తంగా ఏడు వికెట్లు కూల్చగా.. ప్రసిద్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు (జూలై 2-6)వేదిక: ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్హామ్భారత్: 587 & 427/6 డిక్లేర్డ్ఇంగ్లండ్: 407 & 271ఫలితం: ఇంగ్లండ్‌పై 336 పరుగుల తేడాతో భారత్ భారీ విజయంప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్‌మన్ గిల్.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్

జాక్‌పాట్!.. భారీ ధరకు అమ్ముడుపోయిన సెహ్వాగ్ కొడుకు
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ జాక్‌పాట్ కొట్టేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 (DPL Auction) వేలంలో ఏకంగా రూ. 8 లక్షలు దక్కించుకున్నాడు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఈ మేర భారీ మొత్తం వెచ్చించి ఈ అన్క్యాప్డ్ ప్లేయర్‌ను సొంతం చేసుకుంది.డబుల్ సెంచరీ వీరుడుకాగా ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryavir Sehwag) ఢిల్లీ తరఫున అండర్-19 క్రికెట్ ఆడుతున్నాడు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న 17 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటాడు. ముఖ్యంగా గతేడాది మేఘాలయ జట్టు మీద డబుల్ సెంచరీతో మెరిసిన ఆర్యవీర్.. తృటిలో తండ్రి రికార్డుకు దూరమయ్యాడు. 297 పరుగుల వద్ద అవుటైన అతడు ట్రిపుల్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు.కాగా టెస్టుల్లో సెహ్వాగ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 319 కాగా.. అతడి కుమారుడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఈ రికార్డును చేరుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఫెరారీ కారు గెలుచుకునే అవకాశం చేజార్చుకున్నాడు. గతంలో సెహ్వాగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.ఫెరారీ మిస్ అయ్యావు‘‘టెస్టు క్రికెట్లో నేను కొన్ని మైలురాళ్లు సాధించానని నా కుమారులకు తెలుసు. అందుకే.. కనీసం స్కూల్ క్రికెట్లోనైనా నా హయ్యస్ట్ స్కోరు 319 పరుగుల బెంచ్ మార్కును దాటితే వారికి ఫెరారీ కొనిస్తానని చెప్పాను’’ అని సెహ్వాగ్ గతంలో చెప్పాడు.ఇక తన కుమారుడు ఆర్యవీర్ 2024లో ఈ ఫీట్‌ను మిస్ కాగా.. ‘‘బాగా ఆడావు ఆర్యవీర్. కానీ కేవలం 23 పరుగుల తేడాతో ఫెరారీ మిస్ అయిపోయావు. నీలోని పరుగుల దాహాన్ని ఇలాగే ఉండనివ్వు. సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధించు. ఆడుతూనే ఉండు’’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.అమ్ముడుపోని వేదాంత్కాగా ఇలా తనదైన శైలిలో పరుగులు సాధిస్తున్న ఆర్యవీర్‌ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తమ సొంతం చేసుకుంది. అయితే, సెహ్వాగ్ చిన్న కుమారుడు వేదాంత్ (Vedant Sehwag)కు మాత్రం వేలంలో నిరాశే మిగిలింది. నిజానికి ఆర్యవీర్ కంటే ముందే వేదాంత్ పేరు వేలంలోకి వచ్చింది.ఖరీదైన ఆటగాడిగా సన్రైజర్స్ప్లేయర్కానీ అతడిని కొనేందుకు ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 వేలంలో సిమర్జీత్ సింగ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ సెంట్రల్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 39 లక్షలు వెచ్చించింది. ఈ రైటార్మ్ పేసర్ ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉన్న విషయం తెలిసిందే. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లలోనూ సిమర్జీత్ భాగమయ్యాడు.మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ స్టార్ నితీశ్ రాణాను వెస్ట్ ఢిల్లీ లయన్స్ కొనుగోలు చేసింది. రూ. 34 లక్షల ధరకు అతడు జట్టుతో చేరాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇషాంత్ శర్మ కూడా ఇదే జట్టుకు ఆడనున్నాడు. అతడి కోసం ఫ్రాంఛైజీ రూ. 13 లక్షలు వెచ్చించింది.ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో భాగమైన జట్లు ఇవేసౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, పురాణీ ఢిల్లీ గతేడాది ఆడగా.. ఈసారి అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు వచ్చాయి. ఇక 2024లో మొదలైన డీపీఎల్‌లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ విజేతకాగా.. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ రన్నరప్‌గా నిలిచింది.చదవండి: IND vs ENG 2nd Test: బర్మింగ్‌హామ్‌లో జైహింద్

ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా చరిత్రను తిరగరాసింది. ఎక్కడైతే వరుస పరాజయాలు చవిచూసిందో అక్కడే ఘన విజయం సాధించి సగర్వంగా తలెత్తుకుంది. తొమ్మిదో ప్రయత్నంలో ఎడ్జ్‌బాస్టన్ వేదికపై తొలిసారి టెస్టు మ్యాచ్‌లో జయభేరి మోగించింది. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును ఏకంగా 336 పరుగుల (India Beat England)తో చిత్తు చేసింది.ఇక భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు ఇదే తొలి విజయం. లీడ్స్‌లో స్టోక్స్ బృందం చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూనే.. సరికొత్త చరిత్ర సృష్టించాడు గిల్. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా సత్తా చాటి విమర్శకులకు సమాధానం ఇచ్చాడు.ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో గిల్ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)తో చెలరేగి.. ఆతిథ్య జట్టుకు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆఖరి రోజు వర్షం అడ్డంకిగా మారినా.. పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) తన అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను కట్టడి చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తంగా పది వికెట్లు కూల్చాడు.ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతేఈ నేపథ్యంలో విజయానంతరం కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఆకాశ్ దీప్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడు తన ప్రాణం పెట్టి పూర్తి నిబద్ధతతో ఆడాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో అద్భుతం చేశాడు. ఇలాంటి వికెట్ మీద ఇలా బౌలింగ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. అతడొక అద్భుతం అంతే’’ అంటూ ఆకాశ్‌ను ఆకాశానికెత్తాడు.కెప్టెన్‌కు ఇంకేం ఇబ్బందిఅదే విధంగా మిగతా బౌలర్ల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మా బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. పేసర్లే 17 వికెట్లు తీసి ఇస్తే.. కెప్టెన్‌కు ఇంకేం ఇబ్బంది ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా 20 వికెట్లు తీయగల బౌలింగ్ దళం మాకు ఉంది. గతంలో ఎన్నోసార్లు సిరీస్ తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత తిరిగి పుంజుకున్నాం. మా గెలుపునకు కారణం అదేగత మ్యాచ్ అనంతరం లోపాలపై దృష్టి పెట్టాం. ఈసారి బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శన వల్లే విజయం సాధ్యమైంది’’ అని తమ గెలుపునకు గల కారణాన్ని వెల్లడించాడు. ఇక తన వ్యక్తిగత ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నానన్న గిల్.. క్రీజులో ఉన్నప్పుడు బ్యాటర్‌గానే ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.కాగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చినా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కలిసి అతడు లేని లోటును పూడ్చారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఆరు వికెట్లతో అదరగొట్టగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు కూల్చాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్ దీప్.. ఆరు వికెట్లు కూల్చి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వారిలో సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.చదవండి: Akash Deep: ‘ఆకాశ’మంత ఆనందం... #AkashDeep’s 6/99 was nothing short of sensational. A game-changing performance that turned the tide in India’s favour, securing a historic victory.#ENGvIND 👉 3rd TEST, THU, JULY 10, 2:30 PM onwards on JioHotsta pic.twitter.com/JfBGgKQF7T— Star Sports (@StarSportsIndia) July 6, 2025

సబలెంకా జోరు
లండన్: టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక్కొక్కరూ వెనుదిరుగుతుండగా... మరోవైపు అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా ముందంజ వేసింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సబలెంకా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–4, 7–6 (7/4)తో ఎలీసా మెర్టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది. 122 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకాకు రెండు సెట్లలో గట్టిపోటీ ఎదురైంది. అయితే కీలకదశలో సబెలంకా పైచేయి సాధించి వరుస సెట్లలో విజయాన్ని ఖరారు చేసుకుంది. అర డజను ఏస్‌లు సంధించిన సబలెంకా ఒక్కడబుల్ ఫాల్ట్ మాత్రమే చేసింది. నెట్ వద్దకు 15 సార్లు దూసుకొచ్చి 10 సార్లు పాయింట్లు గెలిచింది. తన సరీ్వస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. 36 విన్నర్స్ కొట్టిన సబలెంకా 18 అనవసర తప్పిదాలు చేసింది. ఆరోసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న సబలెంకా 2021లో, 2023లో సెమీఫైనల్లో ని్రష్కమించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) 7–6 (7/3), 6–4తో సోనె కర్తాల్ (బ్రిటన్)పై, లౌరా సిగెముండ్ (జర్మనీ) 6–3, 6–2తో సొలానా సియెరా (అర్జెంటీనా)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఫ్రిట్జ్ మూడోసారి... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), కామెరాన్ నోరి (బ్రిటన్), కరెన్ ఖచనోవ్ (రష్యా) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. జోర్డాన్ థాంప్సన్ (ఆ్రస్టేలియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రిట్జ్ తొలి సెట్‌ను 6–1తో నెగ్గి, రెండో సెట్లో 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో గాయం కారణంగా థాంప్సన్ వైదొలిగాడు. దాంతో ఈ టోర్నీలో ఫ్రిట్జ్ మూడోసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కామెరాన్ నోరి 4 గంటల 27 నిమిషాల్లో 6–3, 7–6 (7/4), 6–7 (7/9), 6–7 (5/7), 6–3తో నికోలస్ జారీ (చిలీ)పై, ఖచనోవ్ 6–4, 6–2, 6–3తో కామిల్ మజార్జక్ (పోలాండ్)పై గెలుపొందారు.
బిజినెస్

స్థిరమైన దీర్ఘకాలిక విధానాలు అవసరం
ప్యారిస్: భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించి స్థిరమైన, దీర్ఘకాల విధానాలు.. రాష్ట్రాల వ్యాప్తంగా ఏకరూపత అవసమని ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ స్టెల్లాంటిస్ ఇండియా సీఈవో శైలేష్ హజేలా అభిప్రాయపడ్డారు. అప్పుడే ఆటోమొబైల్ కంపెనీలు దీర్ఘకాల దృష్టితో వ్యాపార ప్రణాళికలను అమలు చేయగలవన్నారు. జీప్, సిట్రోయెన్ బ్రాండ్ల రూపంలో భారత మార్కెట్లో స్టెల్లాంటిస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌కు పెట్టుబడులతో వచ్చే వారు విధానాల పరంగా దీర్ఘకాల దృష్టిని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించింది ఏదైనా సరే, దేశవ్యాప్తంగా ఒకే మాదిరిగా, దీర్ఘకాలం పాటు అమలు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ఈవీలకు సంబంధించి, పన్ను పరమైన ఏకీకృత విధానాలు ఉండాలన్నారు. అప్పుడే కంపెనీలు రాష్ట్రాల వారీగా కాకుండా మొత్తం దేశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోగలవన్నారు. ఈవీలకు సంబంధించి రాష్ట్రాలు వేర్వేరు విధానాలు అమలును ప్రస్తావించారు. సిట్రెయెన్ బ్రాండ్ విస్తరణ గత కొన్ని సంవత్సరాలుగా స్టెల్లాంటిస్ గ్రూప్ భారత్‌లో కార్యకలాపాలకు అవసరమైన సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని శైలేష్ హజేలా తెలిపారు. ఇప్పుడు సిట్రోయెన్ బ్రాండ్ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. సేల్స్, నెట్వర్క్ విస్తరణపై దృష్టి సారించినట్టు తెలిపారు. వచ్చే ఏడాదిలో విక్రయ కేంద్రాలను రెట్టింపు చేసుకోనున్నట్టు (80 నుంచి 150కు) ప్రకటించారు. చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాలపై దృష్టి సారిస్తామన్నారు. టైర్4 పట్టణాల వరకు విస్తరిస్తామన్నారు. మార్కెట్ వాటాను వచ్చే 12 నెలల్లో రెట్టింపు చేసుకునే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. సిట్రోయెన్ బ్రాండ్‌పై రూ.2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు స్టెల్లాంటిస్ ఈ ఏడాదిలో ప్రకటించడం గమనార్హం.

భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై ఫోకస్!
న్యూఢిల్లీ: మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే పలు కీలక సంఘటనలు ఈ వారంలో చోటు చేసుకోన్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ వార్‌పై కీలక ప్రకటన వెలువడనుంది. అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలకు 90 రోజుల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకోగా.. భారత్ కూడా వాణిజ్య చర్చల్లో తలమునకలైంది. ఈ సంప్రదింపులు విజయవంతమై, డీల్ గనుక కుదిరితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ముఖ్యంగా వాణిజ్య సంబంధ రంగాలకు ఈ ఒప్పందం బూస్ట్ ఇస్తుందని చెబుతున్నారు. ‘ఈ వారం ఒక్క భారత్ మార్కెట్లకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు చాలా కీలకం కానుంది. ఉత్కంఠ రేపుతున్న జూలై 9 అమెరికా టారిఫ్ డెడ్‌లైన్ దగ్గరకొచి్చంది. ప్రపంచ వాణిజ్య స్థితిగతులను ఇది మార్చేయనుంది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ అదే రోజున విడుదల చేసే పాలసీ మినిట్స్ కూడా మార్కట్లపై ప్రభావం చూపుతుంది’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా పేర్కొన్నారు.ఫలితాల సీజన్.. టీసీఎస్ బోణీ కార్పొరేట్ ఫలితాల సీజన్ మళ్లీ మొదలవుతోంది. ఈ నెల 10న టీసీఎస్ క్యూ1 (2025–26, ఏప్రిల్–జూన్ క్వార్టర్) ఫలితాల బోణీ కొట్టనుంది. అదే రోజున టాటా ఎలెక్సీ కూడా ఫలితాలను ప్రకటించనుంది. ఈ వారంలోనే 11న అవెన్యూ సూపర్‌మార్ట్, ఆదిత్య బిర్లా మనీ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా మార్కెట్ ఫోకస్ క్యూ1 ఫలితాల వైపు మళ్లనుంది. ‘భారత్–యూఎస్ మధ్య వాణిజ్య చర్చల్లో సానుకూల ఫలితం వెలువడితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ వంటి రంగాలకు ఇది జోష్ ఇస్తుంది. మార్కెట్లు ఇప్పుడు పై స్థాయిల్లోనే కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న క్యూ1 ఫలితాలు కూడా సూచీల గమనానికి దిశా నిర్దేశం చేస్తుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. క్రూడ్, రూపాయి ట్రెండ్... బ్రెంట్ క్రూడ్ ధరల ట్రెండ్, డాలర్‌తో రూపాయి మారకం విలువ కదలికలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. అదేవిధంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల ధోరణి కూడా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. ‘ఎఫ్ఐఐలు మళ్లీ కొనుగోళ్ల బాట పట్టడానికి రెండు అంశాలు కీలకం కానున్నాయి. భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదరితే మార్కెట్లకు సానుకూలాంశం. ఎఫ్ఐఐలు మళ్లీ పెట్టుబడులకు సై అంటారు. అలాగే క్యూ1 ఫలితాల్లో రికవరీ సంకేతాలు కనిపించడం కూడా సానుకూలంగా నిలుస్తుంది. ఈ రెండింటి విషయంలో నిరుత్సాహం ఎదురైతే మార్కెట్‌పైనా, ఎఫ్ఐఐల నిధుల ప్రవాహంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మొత్తంమీద చూస్తే ఇండో–యూఎస్ వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కోసం వేచిచూసే ధోరణి, క్యూ1 ఫలితాలపై అంచనాల నేపథ్యంలో మార్కెట్లు కన్సాలిడేషన్‌లో ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమ్కా వ్యాఖ్యానించారు.గత వారమిలా... దేశీ సూచీలు గత వారంలో రివర్స్ గేర్ వేశాయి. బీఎస్‌ఎస్‌ఈ సెన్సెక్స్ 626 పాయింట్లు (0.74%), ఎన్ఎస్ఈ నిఫ్టీ 176 పాయింట్లు (0.68%) చొప్పున నష్ట పోయాయి.జూలైలో ఎఫ్‌పీఐలు ఆచితూచి... ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఆర్బీఐ రేట్ల కోత వంటి సానుకూలతల నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) గత నెలలోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. రూ.14,590 కోట్లు ఈక్విటీల్లో వెచ్చించారు. వెరసి వరుసగా మూడో నెలలోనూ పెట్టుబడుల బాటలోనే కొనసాగారు. అయితే, ఈ నెలలో మళ్లీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తొలి వారంలో రూ.1,421 కోట్ల అమ్మకాలు జరిపారు. ముఖ్యంగా అమెరికా ట్రేడ్ వార్ డెడ్‌లైన్ దగ్గరపడటం, క్యూ1 ఫలితాల సీజన్‌పై అంచనా అంచనాల నేపథ్యంలో ఎఫ్‌పీఐలు ప్రస్తుతానికి ఆచితూచి వ్యవహరిస్తున్నారని ఏంజెల్ వన్ సీనియర్ ఫండమెంటల్ ఎనలిస్ట్ వకార్జావెద్ ఖాన్ తెలిపారు. స్వల్పకాలానికి విదేశీ నిధుల ప్రవాహంలో తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చని పేర్కొన్నారు. 2025లో ఇప్పటిదాకా రూ.79,322 కోట్లను ఎఫ్‌పీఐలు వెనక్కి తీసుకోవడం గమనార్హం.

ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళా
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి. పెరుగుతున్న వ్యాపార కార్యకలాపాలు, విస్తరణ నేపథ్యంలో సుమారు 50,000 మందిని భర్తీ చేసుకోనున్నాయి. ఇందులో 21,000 మంది ఆఫీసర్ స్థాయి వారు కాగా, మిగిలిన వారు క్లర్క్ తదితర ఉద్యోగాలకు సంబంధించి ఉండనున్నారు. ప్రభుత్వరంగంలో 12 బ్యాంకులు ఉండగా, ఒక్క ఎస్బీఐనే 20,000 మందికి అవకాశం కల్పించనుంది. ఇందులో భాగంగా ఎస్బీఐ ఇప్పటికే 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకుంది. అలాగే, 13,455 మంది జూనియర్ అసోసియేట్స్ భర్తీని సైతం చేపట్టింది. శాఖల స్థాయిలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తాజా నియామకాలు చేపట్టినట్టు ఎస్బీఐ ప్రకటించడం గమనార్హం. 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని శాఖల స్థాయిలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంది. ఎస్బీఐలో మొత్తం ఉద్యోగులు 2025 మార్చి చివరికి 2,36,226 మంది ఉన్నారు. ఇందులో 1,15,066 మంది ఆఫీసర్ ర్యాంకుల్లోని వారే. ఉద్యోగుల వలసలను 2 శాతంలోపునకు పరిమితం చేసేందుకు ఎస్బీఐ చర్యలు తీసుకుంటుండడం గమనార్హం. ప్రభుత్వరంగంలో రెండో అతిపెద్ద బ్యాంక్ పీఎన్బీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో రూ.5,500 మందిని కొత్తగా నియమించుకోనుంది. ఈ ఏడాది మార్చి నాటికి పీఎన్బీ వ్యాప్తంగా 1,02,746 మంది ఉద్యోగులున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.4,000 మందిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియమించుకోనుంది. సబ్సిడరీల బలోపేతంపై దృష్టి.. సబ్సిడరీల కార్యకలాపాలను మరింత విస్తరించి, వాటిని స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ చేయడం ద్వారా రాబడులు పెంచుకోవడంపై దృష్టి సారించాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల ఆదేశించడం గమనార్హం. అవసరాలకు అనుగుణంగా సబ్సిడరీ సంస్థల్లో బ్యాంక్‌లు అదనపు పెట్టుబడులు పెడతాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్యకలాపాల విస్తరణతో సబ్సిడరీల్లోనూ నియామకాలు పెరిగే అవకాశాలు ఉంటాయని విశ్లేషకుల అంచనా.

బ్యాంక్ లాకర్.. ఎంత భద్రం?
చాలా మందికి బ్యాంక్ లాకర్ నమ్మకమైన, భద్రమైన వేదిక. రక్షణ దృష్ట్యా విలువైన డాక్యుమెంట్లు, బంగారం, వెండి, వజ్రాభరణాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరుస్తుంటారు. కొందరు నగదును కూడా లాకర్లలో పెడుతుంటారు. బ్యాంకు లాకర్లపై కొండంత భరోసాతో ఉండేవారికి యూపీలోని మొరాదాబాద్‌లో 2023లో జరిగిన ఒక ఘటనను గుర్తు చేయాల్సిందే. ఒక మహిళ తన కుమార్తె వివాహ అవసరాల కోసం ఉద్దేశించిన రూ.18 లక్షల నగదును, ఆభరణాలతోపాటు లాకర్లో ఉంచగా.. చెదలు ఆ నోట్లను చిత్తు చిత్తు చేసేశాయి. ఈ కేసులో ఆమెకు ఒక్క రూపాయి పరిహారం ముట్టలేదు. అందుకే లాకర్‌ను వినియోగించుకునే ప్రతి ఒక్కరూ ముందుగా నియమ, నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. లాకర్లో ఉంచిన వాటికి నష్టం జరిగతే బ్యాంక్ బాధ్యత ఏ మేరకు అన్నది స్పష్టత తీసుకోవాలి. అవసరమైతే బీమా రక్షణతో భరోసా కల్పించుకోవాలి. బ్యాంకు లాకర్లో పెట్టేశాం కదా ఇక నిశ్చింతగా ఉండొచ్చనుకుంటే పొరపాటే. అధిక తేమ లేదా చెదలు లాకర్లో ఉంచిన డాక్యుమెంట్లు, కరెన్సీ నోట్లను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. దీనికితోడు వరదల కారణంగా లాకర్లలోకి నీరు చేరొచ్చు. భూకంపం కారణంగా నిర్మాణమే దెబ్బతినొచ్చు. చోరీ, దోపిడీలన్నవి అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి అన్ని రకాల నష్టాలకూ బ్యాంక్‌లు పరిహారం చెల్లించవన్న విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. ‘‘విలువైన వాటిని స్టోర్ చేసుకునేందుకు బ్యాంక్ లాకర్లు భద్రమైన ఎంపికే. కానీ, ఇందులో రిస్క్ లు కూడా ఉన్నాయి. వీటిని అర్థం చేసుకుని సరైన చర్యలు తీసుకోవడం ద్వారా అందులో ఉంచిన మీ వస్తువులను రక్షించుకోవచ్చు’’ అని సాల్వే బస్సెల్స్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ మేనేజ్మెంట్ క్వాంటిటేటివ్ అనలిస్ట్ స్నేహాశిష్ దాస్ తెలిపారు. వేటికి పరిహారం.. లాకర్ విషయంలో ఆర్బీఐ 2021లో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. లాకర్లలో ఉంచిన వాటికి నష్టం జరిగితే బ్యాంక్ బాధ్యత ఏ మేరకో ఇందులో స్పష్టత ఇచ్చారు. బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా దొంగతనం, అగి్నప్రమాదం, భవనం కూలిపోవడం లేదా ఉద్యోగి మోసం కారణంగా లాకర్లలో ఉన్న వాటికి నష్టం వాటిల్లితే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా బ్యాంక్ లాకర్ వార్షిక అద్దె/చార్జీకి గరిష్టంగా 100 రెట్ల వరకే బ్యాంక్‌లు చెల్లిస్తాయి. ఉదాహరణకు బ్యాంక్ లాకర్ చార్జీ ఏటా రూ.5,000 ఉందనుకుంటే.. లాకర్లలో ఉంచిన వాటికి నష్టం జరిగితే బ్యాంక్ గరిష్టంగా రూ.5 లక్షలను చెల్లిస్తుంది. బ్యాంక్‌లు సరైన చర్యలు తీసుకున్నప్పటికీ వరదలు, భూకంపాల కారణంగా లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే అలాంటి సందర్భాల్లో బాధ్యత వహించబోవని దాస్ తెలిపారు. అంతేకాదు డాక్యుమెంట్లను సరైన భద్రతతో కూడిన ప్యాకేజీతో ఉంచకపోయినా నష్టానికి బ్యాంక్‌లు బాధ్యత తీసుకోవని చెప్పారు. తేమకు దెబ్బతినని, నీటితో తడిసినా దెబ్బతినని పాలిథీన్ బ్యాగుతోపాటు చెదలు పట్టలేని ప్యాక్‌తో రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కస్టమర్ల నిర్ల క్ష్యం వల్ల వాటిల్లే నష్టానికి బ్యాంకులు పరిహారం చెల్లించవు. లాకర్‌ను సరైన విధంగా లాక్ చే యకుండా వెళ్లిపోయిన సందర్భాల్లో నష్టానికి కస్టమర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్లాన్ అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ సీఎఫ్‌పీ విశాల్ ధావన్ తెలిపారు. వీటికి అనుమతి.. బంగారం, వెండి, వజ్రాభరణాలు, బంగారం/వెండి వస్తువులు, బంగారం కాయిన్లు, బిస్కెట్లు లాకర్లలో ఉంచొచ్చు. చట్టబద్ధమైన డాక్యుమెంట్లు, బీమా పత్రాలు, వీలునామాలు, ప్రాపర్టీ రిజి్రస్టేషన్ పత్రాలు, బర్త్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్లు ఉంచొచ్చు. షేరు సర్టిఫికెట్లు, మ్యూచువల్ ఫండ్స్ తదితర పెట్టుబడుల పత్రాలను కూడా భద్రంగా పెట్టుకోవచ్చు. ప్రముఖ బ్యాంక్‌లు లాకర్లలోనూ భిన్న రకాల సైజులను (నాలుగు రకాలు) ఆఫర్ చేస్తున్నాయి. వీటి చార్జీలు, సదుపాయాలు వేర్వేరుగా ఉన్నాయి. తమ అవసరాలకు అనుకూలమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. లాకర్ ఇన్సూరెన్స్.. లాకర్లో ఉంచిన వాటికి నష్టం జరిగితే కొన్ని సందర్భాల్లో బ్యాంకుల నుంచి పరిహారం రాదు. కనుక లాకర్ సదుపాయం వినియోగించే ప్రతి ఒక్కరూ లాకర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్‌లు చెల్లించే పరిహారం సైతం వార్షిక అద్దెకు గరిష్టంగా 100 రెట్లకు మించదు. లాకర్లో అంతకుమించి విలువైన వాటిని ఉంచే వారు తప్పకుండా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. లాకర్లో ఉంచిన వస్తువుల విలువను తెలియజేసే సర్టిఫికెట్లు/ధ్రువీకరణలను జాగ్రత్తగా దగ్గర ఉంచుకోవాలి. లాకర్లో ఉంచిన వాటి విలువకు తగ్గకుండా బీమా కవరేజీ తీసుకోవాలి. అగ్నిప్రమాదం, చోరీ, ఉగ్రవాదం, ప్రకృతి విపత్తుల కారణంగా లాకర్లోని వాటికి నష్టం వాటిల్లితే పరిహారం లభిస్తుంది. లాకర్లో విలువైన డాక్యుమెంట్లకు కవరేజీ కోసం రైడర్లు తీసుకోవాల్సి ఉంటుంది. లాకర్లో ఉంచిన వాటిని నిర్ధారించేందుకు వీలుగా ఫోన్లో ఫొటో తీసి పెట్టుకోవడం మంచిది. చాలా కంపెనీలు రూ. 3–40 లక్షల మధ్య సమ్ అష్యూర్డ్‌తో లాకర్ ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. హోమ్ ఇన్సూరెన్స్‌లోనూ లాకర్లో ఉంచిన వాటికి కవరేజీని భాగం చేసుకోవచ్చు. కాకపోతే హోమ్ ఇన్సూరెన్స్ మొత్తం కవరేజీలో లాకర్‌కు సంబంధించి 20% మించదు. వీటిని ఉంచడం చట్టవిరుద్ధమే.. → ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ నిషేధం. చెడిపోయే పదార్థాలు కూడా ఏవీ ఉంచకూడదు. హానికారకమైనవీ పెట్టకూడదు. → కరెన్సీ నోట్లను సైతం లాకర్లలో ఉంచకూడదు. ఒకవేళ ఉంచినట్టయితే వాటికి నష్టం వాటిల్లితే బ్యాంకులపై బాధ్యత ఉండదు. → బ్యాంక్‌లో శబ్ద కాలుష్యానికి దారితీసేవి, బ్యాంక్ లాకర్ల భద్రతకు ముప్పు కలిగించే వాటిని ఉంచడం నిబంధనలకు విరుద్ధం. భద్రత విషయంలో పూచీ ఉందా?లాకర్ల భద్రత విషయంలో బ్యాంక్‌లు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ అక్కడక్కడ లోపాలకు అవకాశం లేదని భావించకూడదు. లాకర్లను రీన్ఫోర్స్డ్ స్టీల్‌తో చేయించడమే కాకుండా, భద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో, యాక్సెస్ పరిమితంగా ఉండే చర్యలు తీసుకుంటాయి. వీటిని సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక అలారమ్ వ్యవస్థలతో పర్యవేక్షిస్తుంటాయి. బ్యాంక్ ఉద్యోగి, కస్టమర్ ఇద్దరి వద్ద ఉండే తాళం చెవులతో (డ్యుయల్ కీ) తెరవాల్సి ఉంటుంది. ఇది కూడా భద్రతా సదుపాయమే. తేమ, చెదలను తట్టుకునే విధంగా అధిక నాణ్యత కలిగిన లాకర్లను కొన్ని బ్యాంక్‌లు వినియోగిస్తున్నాయి. బ్యాంక్‌లు చెదల నివారణకు చర్యలు కూడా తీసుకుంటుంటాయి’’ అని దాస్ వివరించారు. బ్యాంక్ వైపు నుంచి భద్రతా పరంగా లోపాలను గుర్తించినట్టయితే వాటిని అధికారుల దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకెళ్లడం మంచిదే. ఈ నిర్లక్ష్యం కారణంగా భవిష్యత్తులో తమ లాకర్లలోని వాటికి నష్టం వాటిల్లితే ఆధారంగా పనికొస్తుంది.కొత్త ఒప్పందంపై సంతకం చేశారా? కొన్నేళ్ల క్రితం లాకర్ తీసుకుని, 2021 ఆగస్ట్ తర్వాత బ్యాంక్‌తో కొత్త అగ్రిమెంట్‌పై సంతకం చేయని వారు.. వెంటనే ఆ పనిచేయాలి. సవరించిన లాకర్ ఒప్పందాలపై కస్టమర్ల అంగీకారం తీసుకోవాలంటూ ఆర్బీఐ నాడు ఆదేశించింది. ఇందుకు గడువును తొలుత 2023 జనవరి 1కి పొడిగించింది. తర్వాత అదే ఏడాది డిసెంబర్ 31 వరకు, తర్వాత 2024 మార్చి 31 వరకు పొడిగించడం గమనార్హం. కానీ, 2025 చివరి వరకు గడువు ఇవ్వాలని బ్యాంక్‌లు కోరుతున్నాయి. లాకర్ ఖాతాదారుల్లో 20 శాతం వరకు ఇంకా ఒప్పందాలపై సంతకాలు చేయకపోవడమే ఇందుకు కారణం. సవరించిన కొత్త లాకర్ ఒప్పందాలపై సంతకాలు చేయకపోతే అప్పటి వరకు లాకర్ వినియోగించుకునేందుకు బ్యాంక్‌లు అనుమతించకపోవచ్చని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి పేర్కొన్నారు. తుది నోటీసు జారీ చేసి, అప్పటికీ కస్టమర్ల నుంచి స్పందన లేకపోతే లాకర్లను సీల్ చేయొచ్చని ప్లాన్అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ సీఎఫ్‌పీ విశాల్ ధావన్ తెలిపారు. కొత్త లాకర్ నిబంధనల ప్రకారం బ్యాంక్‌లు.. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కస్టమర్లను కోరొచ్చు. గతంలో ఈ డిపాజిట్ ఎంత మొత్తం అన్న పరిమితి లేదు. ఇప్పడు లాకర్ మూడేళ్ల అద్దె, కస్టమర్ డిఫాల్ట్ అయితే లాకర్ తెరిచేందుకు అయ్యే చార్జీలకు సరిపడానే డిపాజిట్ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త అగ్రిమెంట్‌కు అయ్యే చార్జీలను బ్యాంకులే భరిస్తాయి. నామినేషన్ తప్పనిసరి.. లాకర్ తెరిచే సమయంలో సర్వైవర్‌షిప్ క్లాజును నమోదు చేయాలి. లేదా నామినేషన్‌ను అయినా తప్పకుండా నమోదు చేయాలి. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో నామినీని లాకర్ తెరిచేందుకు బ్యాంక్ అనుమతిస్తుంది. ఉమ్మడిగా మరొకరితో కలసి లాకర్ తెరిచినట్టయితే.. ఇద్దరి సంతకాల ఆమోదంతో నిర్వహించే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు తమ వారసులను నామినీలుగా నమోదు చేయాలి. సర్వైవర్‌షిప్ క్లాజ్ ఎంపిక చేసుకుంటే. ఎనీవన్ లేదా సరై్వవర్ (ఎవరైనా లేక జీవించి ఉన్న వారు) ఆప్షన్ అనుకూలంగా ఉంటుంది. ఇవేమీ లేకుండా లాకర్ తీసుకుంటే.. దురదృష్టవశ్తాతూ మరణించిన సందర్భంలో లాకర్లో ఉన్న వాటిని పొందడానికి వారసులు ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. మరణ ధ్రువీకరణ సర్టి ఫికెట్, సక్సెషన్ సర్టిఫికెట్ లేదా లెటర్ ఆఫ్ అడ్మిని్రస్టేషన్ను సమర్పించాల్సి వస్తుంది. సాక్షులు, వారసుల సమక్షంలో లాకర్లో ఉన్న వాటిని బ్యాంక్ సిబ్బంది నమోదు చేయాల్సి వస్తుంది. కేవైసీ వివరాలతో క్లెయిమ్ సమర్పించాలి. ఈ ప్రక్రియలన్నీ ముగిసి లాకర్లో వాటిని పొందేందుకు చాలా సమయం పడుతుంది. ముందు జాగ్రత్తలు.. → డాక్యుమెంట్లను నీటికి తడవని, అగ్ని ప్రమాదంలో కాలిపోని విధంగా ప్యాక్ చేసి ఉంచుకోవాలి సురక్షితం. → నోట్లను లాకర్లో ఉంచకపోవడం మంచిది. దీనికి బదులు ఎఫ్డీ చేసుకోవడం వల్ల రక్షణతోపాటు రాబడి కూడా వస్తుంది. → లాకర్లో ఉంచిన ప్రతీ వస్తువు వివరాలను డైరీలో రాసుకోవాలి. ప్రతీ వస్తువును ఫొటో తీసి పెట్టుకోవాలి. → అవసరం లేకపోయినా సరే లాకర్లో ఉంచిన వాటిని నిర్ణీత కాలానికి ఒకసారి పరిశీలించుకోవాలి. కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా లాకర్‌ను తెరిచి చూడాలి. → లాకర్లో ఉంచే అన్నింటికీ కవరేజీ వర్తించే పాలసీ తీసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్
ఫ్యామిలీ

Infertility : అధిక బరువు ఉంటే ప్రెగ్నెన్సీ రాదా..?
నా బరువు వంద కిలోలు. పెళ్లైయి రెండు సంవత్సరాలు అవుతుంది. కాని, ప్రెగ్నెన్సీ రావటం లేదు. ప్రెగ్నెన్సీ కోసం నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– లలిత, కర్నూలు. ఊబకాయం ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన సమస్య. మరీ ముఖ్యంగా ఇరవై నుంచి ముప్పయ్యేళ్ల మధ్య వయస్సు మహిళలలో అధిక బరువు వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నెలసరి క్రమంగా రాకపోవడం, వచ్చినా ఎక్కువ, తక్కువ బ్లీడింగ్ అవటం ఉంటుంది. దీనితో పాటు దీర్ఘకాలిక వ్యాధులైన హైపర్ టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్ వంటి ఇతర జబ్బులు కూడా చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. వీటితో ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. దీనికి ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అంటే జంక్ ఫుడ్, ఫాస్టఫుడ్, బేకరీ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవాలి. వీటితో పాటు రోజుకు కనీసం ముప్పయి నుంచి నలభై నిమిషాలు వ్యాయామం లేదా యోగా వంటివి చేస్తూ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఒకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు థైరాయిడ్, డయాబెటిస్, హిమోగ్లోబిన్ వంటివి చేయించుకోవాలి. అలాగే డాక్టర్ సూచించిన మందులను వాడాలి. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ మాత్రలను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు నుంచే ఉపయోగించడం వలన అధిక బరువు, ఊబకాయం వలన వచ్చే సమస్యలను అధిగమించి ఆరోగ్యకరంగా గర్భందాల్చి, ఆరోగ్యకరమైన శిశువును పొందవచ్చు.ప్రెగ్నెన్సీలో ఓబెసిటీ వల్ల కలిగే సమస్యలు, వాటి పరిష్కారాలను వివరించండి? – శ్రీలలిత, వైజాగ్ఊబకాయంతో బాధపడుతున్న స్త్రీలు గర్భధారణకు ముందు నుంచే తమ బరువును నియంత్రణలోకి తెచ్చుకోవాలి. లేకపోతే ఓబెసిటీ కారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. దీనివల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. ఫలితంగా గర్భం దాల్చే ప్రక్రియలో ఆటంకం ఏర్పడుతుంది. బరువు నియంత్రణలో లేకపోతే తల్లి ఆరోగ్యంపైనే కాకుండా శిశువు అభివృద్ధిపైనా కూడా ప్రభావం పడుతుంది. గర్భధారణ మొదటి మూడునెలల్లో గర్భస్రావం జరగడం, శిశువులో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, తల్లికి గర్భధారణ సమయంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు. వీటివలన శిశువు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పుట్టబోయే బిడ్డ ఎక్కువ లేదా తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు కాన్పు సమయంలో సవాళ్లు ఎదురవుతాయి. ఉదాహరణకు, బిడ్డ బరువు ఎక్కువగా ఉండటం వలన సాధారణ కాన్పు సాధ్యపడక, శస్త్రచికిత్స అవసరమవుతుంది. ప్రసవ సమయంలో ఎక్కువ రక్తస్రావం, కుట్లు సరిగ్గా మానకపోవడం, ఇన్ఫెక్షన్స్ రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అనస్థీషియా సంబంధిత ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా తల్లి అధిక బరువు కారణంగా భవిష్యత్తులో మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శిశువు నెలలు నిండక ముందే పుట్టి, కొంతకాలం ఇన్‌క్యుబేటర్‌లో ఉంచాల్సి రావచ్చు. అందుకే, గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో, ప్రసవం తరువాత కూడా బరువును నియంత్రించాలి. గర్భం దాల్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన జాగ్రత్తలు, అవసరమైన రక్తపరీక్షలు, శిశువు ఎదుగుదలపై తగిన స్కానింగ్‌లు చేయించుకోవాలి. పోషకాహార సప్లిమెంట్లు, అవసరమైన మందులు డాక్టర్ సూచించిన మోతాదులో తీసుకుంటూ ఉండాలి. అవసరమైతే ఇతర నిపుణుల సలహాలు పాటిస్తూ, ఆరోగ్యవంతమైన ప్రెగ్నెన్సీ జర్నీని ప్లాన్ చేసుకోవచ్చు. డా‘‘ ప్రియదర్శిని, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: హీరో సల్మాన్‌ఖాన్ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్ న్యూరాల్జియా..)

నౌకాదళ యుద్ధ విమానాలు నడపనున్న తొలి మహిళ ఆమె..!
‘నావల్ ఏవియేషన్‌లో కొత్త అధ్యాయం మొదలైంది’ అని సగర్వంగా, సంతోషంగా ప్రకటించింది భారత నౌకాదళం. లింగ సమానత్వం దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళుతున్న భారత నౌకాదళం మరో చారిత్రక ఘట్టానికి తెర తీసింది. భారత నౌకాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పూనియా చరిత్ర సృష్టించింది...తొలి స్వాతంత్య్ర పోరుకేక వినిపించిన ప్రాంతంగా మీరట్‌కు చరిత్రలో ప్రత్యేకస్థానం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఆస్తా పూనియా ఎందరో ఫ్రీడమ్ ఫైటర్ల గురించి విని ఉండవచ్చు.ఇప్పుడు తానే ఒక ఫైటర్ (పైలట్)గా చరిత్ర సృష్టించింది. నావిక విమానయానం (నావల్ ఏవియేషన్)లో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అనేది లక్ష్యంగా ఉంటుంది. నావిక విమాన యానంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థుల శక్తిసామర్థ్యాలు, అంకితభావానికి ఈ ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం ప్రధాన మైలురాయి. విశాఖపట్టణంలో జరిగిన ఐఎన్ఎస్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అవార్డు అందుకుంది ఆస్తా పూనియా. పూనియాకు ఎలాంటి సైనిక కుటుంబ నేపథ్యం లేదు. బీటెక్ చేసిన తరువాత నేవీకి ఎంపికైంది. ఫైటర్‌గా భవిష్యత్‌లో మిగ్–28,కె నౌకాదళ రఫెల్ యుద్ధ విమానాలను ఆస్తా పూనియా నడిపే అవకాశం ఉంది. ఇప్పటివరకు మహిళా అధికారులు భారత నావికాదళంలో పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్లుగా సముద్ర నిఘా విమానాలు, హెలికాప్టర్లలో విధులు నిర్వహిస్తున్నారు. నౌకాదళ యుద్ధ విమానాలు నడపనున్న తొలి మహిళగా పూనియా చరిత్ర సృష్టించింది. ‘నౌకాదళ వైమానిక విభాగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలనే నిబద్ధతకు ఈ చారిత్రక ఘట్టం అద్దం పడుతుంది. ఆస్తా పూనియా అనేక అడ్డంకులను అధిగమించి నూతన శకానికి నాంది పలికింది’ అని ‘ఎక్స్’ వేదికగా భారత నౌకాదళం ప్రకటించింది.త్రివిధ దళాలలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 2016లో తొలిసారిగా మహిళలను ఫైటర్ స్ట్రీమ్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఫైటర్లు ‘ఐఏఎఫ్’లో రాఫెల్, సు–30ఎంకెఐ, మిగ్–29ఎస్ నడుపుతున్నారు. ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మేజర్ అభిలాష ఫస్ట్ ఉమెన్ కాంబాట్ ఏవియేటర్‌గా చరిత్ర సృష్టించింది.2023లో తొలి మహిళా కమాండింగ్ ఆఫీసర్‌ను నియమించి భారత నౌకాదళం చారిత్రక నిర్ణయం తీసుకుంది. 2020 నుంచి భారత నౌకాదళంలో మహిళా అధికారుల నియామకం 15 శాతం పెరిగింది. త్రివిధ దళాలలో గత కొన్ని సంవత్సరాలుగా మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, లింగ సమానత్వం వైపు వేస్తున్న అడుగులు చూస్తుంటే ‘అన్నీ మంచి శకునములే’ అనిపిస్తోంది.వింగ్స్ ఆఫ్ గోల్డ్‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అనేది నౌకాదళానికి చెందిన ప్రతిష్ఠాత్మకమైన పురస్కారమే కాదు... ప్రతిష్ఠాత్మకమైన పుస్తకం కూడా! యూఎస్ నావల్ ఏవియేషన్‌లో చరిత్ర సృష్టించిన ఆరుగురు మహిళల గురించి రాసిన పుస్తకం ఇది (వింగ్స్ ఆఫ్ గోల్డ్–ది స్టోరీ ఆఫ్ ది ఫస్ట్ ఉమెన్ నావల్ ఏవియేటర్స్) నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు నడపడంలో మహిళలకు శిక్షణ ఇవ్వాలని నావల్ ఆపరేషన్స్ చీఫ్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నో వెక్కిరింపు మాటలు వినిపించాయి. ‘వారు నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా సైన్యంలో పనిచేయలేరు’ అనే మాట బలంగా వినిపించింది. ఇలాంటి పురుషాధిపత్య భావజాలాన్ని తుత్తునియలు చేస్తూ ఈ ఫైటర్ పైలట్లు దూసుకెళ్లారు. చరిత్రలో నిలిచిపోయారు. బార్బరా ఆలెన్ రైని ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అవార్డ్ అందుకున్న తొలి మహిళ. ఆమె సి–1 ట్రేడర్, టి–39 శేబర్లినర్లాంటి యుద్ధ విమానాలను నడిపేది. అమెరికా నావికాదళానికి సంబంధించి తొలి మహిళా ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్లలో ఆమె ఒకరు. 1982లో ఒక ట్రైనింగ్ ఫ్లైట్ ప్రమాదంలో మరణించింది. (చదవండి:

ఆ చేదు అనుభవమే స్టార్టప్‌గా అంకురార్పణ..! ఇవాళ అమెరికాలో..
ఆపదలో అండగా...‘ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది’ అంటుంది కర్ణాటకలోని బెలగావికి చెందిన యువ ఇంజనీర్ నందిత యెనగి. శరద్ పాటిల్‌తో కలిసి సెల్ఫ్–డిఫెన్స్ బ్రాండ్ ‘వేల్ వేరబుల్’ను ప్రారంభించింది నందిత. ఈవ్–టీజింగ్ రూపంలో తనకో చేదు అనుభవం ఎదురైంది. ఆ సమయంలోనే వచ్చిన ఒక ఆలోచనే సెల్ఫ్–డిఫెన్స్ స్టార్టప్‌కు కారణం అయింది.ఉమెన్ సేఫ్టీ వేరబుల్స్‌పై కంపెనీ దృష్టి పెట్టింది. ‘వేల్ వేరబుల్’ కంపెనీ ప్రసిద్ధ టీవీ షో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ దృష్టిలో పడింది. కంపెనీ ప్రారంభించడానికి కారణం, లక్ష్యాల గురించి ఈ కార్యక్రమంలో వివరించింది నందిత. ఈ కంపెనీలో 30 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి అమన్ గుప్తా, వినీత్సింగ్లు ముందుకు వచ్చారు.‘మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా కంపెనీ మొదలు పెట్టాం. ఆత్మరక్షణ పరికరాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తాం’ అంటుంది నందిత. ఎలక్ట్రికల్ షాక్ వేరబుల్స్ ద్వారా సెల్ఫ్–డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి కొత్త అడుగు వేసింది...వేల్ వేరబుల్.దేశీయ మార్కెట్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ దృష్టిని కూడా ఆకట్టుకుంది వేల్ వేరబుల్. నందితను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ తమ కంపెనీ గ్యాడ్జెట్స్‌ను పరిచయం చేయడానికి తమ దేశానికి ఆహ్వానించింది. యూఎస్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో తమ కంపెనీ సెల్ఫ్–డిఫెన్స్ గ్యాడ్జెట్ల గురించి వివరించింది నందిత యెనగి.(చదవండి: మెడనొప్పి 'పీకల' మీదకు...! ఎందువల్ల ఈ పరిస్థితి)

మెడనొప్పి 'పీకల' మీదకు...
మెడనొప్పి అనే సమస్య జీవితకాలంలో ప్రతి వ్యక్తీ ఏదో ఓ సందర్భంలో ఎదుర్కొనేదే. అయితే అదేపనిగా నొప్పి వస్తుంటేనో లేదా మెడ నుంచి అది భుజానికీ లేదా చేతుల చివరలకో పాకుతుంటే మాత్రం కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనించాలి. మెడనొప్పికి కారణాలు, నివారణ, చికిత్స వంటి అంశాలను తెలుసుకుందాం. తీవ్రమైన మెడనొప్పి కారణంగా కొన్నిసార్లు కొంతమందిలో నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద ఒత్తిడి పెరిగి మూత్రవిసర్జనలో సైతం తేడాలు వచ్చి ఇతర సమస్యలకూ దారితీయవచ్చు. అందుకే ఎప్పుడో ఓసారి వచ్చే నొప్పిని మినహాయించి, పదే పదే నొప్పి వస్తున్నా లేదా దీర్ఘకాలంగా బాధిస్తున్నా డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.ఎందుకీ మెడనొప్పి... మెడ భాగంలో ఉండే వెన్నెముకలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మొదటిదాన్ని అట్లాస్ అనీ, రెండో వెన్నుపూసను యాక్సిస్ అంటారు. ఈ తర్వాత ఉండే పూసలను వరసగా సి3, సి4, సి5, సి6, సి7 అని పిలుస్తారు. ఈ వెన్నుపూసల మధ్య ఉండే ప్రదేశాన్ని స్పైనల్ కెనాల్ అంటారు. దానిలోంచి వెన్నుపాము వెళ్తూ మెదడు నుంచి చేతులు, కాళ్ల చివరి వరకు నరాలను తీసుకెళ్తుంది. వెన్నుపూసకూ, వెన్నుపూసకూ మధ్యనున్న ‘వర్టిబ్రల్ ఫొరామినా’ అనే రంధ్రాల నుంచి వెన్నుపాము తాలూకు నరాలు బయటకు వచ్చి అన్ని అవయవాలకూ వ్యాపించి ఉంటాయి. ఈ వెన్నుపూసల మధ్యన కుషన్‌లా, షాక్ అబ్జార్బర్‌లా డిస్క్‌లు ఉంటాయి. ఒక్కోసారి వెన్నుపూసల మధ్య కుషన్‌లా ఉండే డిస్క్‌లు పక్కకు జారడం వల్లనో లేదా బాగా అరగడంతో నరాలపై (ప్రధానంగా చేతులకి సప్లై అయ్యే నరాలపై) ఒత్తిడి పడి మెడనొప్పి వస్తుంటుంది. మెడదగ్గర ఉండే నరాలు భుజం వరకు ఉండటంతో ఈ నొప్పి మెడ నుంచి భుజం మీదుగా చేతుల వరకు పాకుతూ బాధిస్తుంటుంది.నిర్ధారణ ఇలా... మెడనొప్పి వచ్చే వారికి తొలుత ఎక్స్–రే పరీక్ష చేయిస్తారు. ఇందులో మెడ వెన్నుపూసలలో ఏమైనా తేడాలు వచ్చాయా అని తెలుస్తుంది. మరింత సునిశితమైన అంశాల కోసం ఎమ్మారై కూడా చేయించాల్సి రావచ్చు. ఏ నరంపై ఎంత ఒత్తిడి ఉంది, దేనివల్ల కలుగుతోంది, ఎముక ఏదైనా ఫ్రాక్చరైందా, నరాల్లో వాపు, గడ్డలు ఉన్నాయా... లాంటి అనేక విషయాలు ఎమ్మారైలో తెలుస్తాయి. ఉపశమనం కోసం... మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్లలో మెత్తటి గుడ్డను ముంచి, పిండి మెడపైన కాపడం పెట్టాలి. ఐస్ ముక్కను బట్టలో చుట్టి కాపడం పెట్టడం కూడా మంచిదే. ఈ కాపడాల వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మెడ కండరాల్లో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా మెడకు విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే ఆ సమయంలో మెడ కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అలా విశ్రాంతి ఇవ్వకపోతే నొప్పి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. నొప్పి ఉన్న సమయంలోనే గాక... మామూలు వేళల్లోనూ ఒకే భుజానికి బరువైన బ్యాగ్‌ల వంటివి తగిలించుకోకూడదు. ఇలా చేయడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. నడిచే సమయంలో ఒకేవైపునకు ఒంగడం సరికాదు. చికిత్స...సాధారణ మెడనొప్పి అయితే పెయిన్‌కిల్లర్ ఆయింట్మెంట్లను రోజుకి ఐదు నుంచి ఆరుసార్లు పూయాలి.నొప్పి నివారణ కోసం దీర్ఘకాలం పెయిన్‌కిల్లర్స్ ఉపయోగించడం సరికాదు. ఒకవేళ పెయిన్‌కిల్లర్స్‌తో ఒకటి రెండు రోజుల్లో రిలీఫ్ రాకపోతే తప్పనిసరిగా డాక్టర్‌ను / ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.డిస్క్ తన స్థానం నుంచి పక్కకు జరగడం లాంటిది జరిగితే శస్త్రచికిత్సతో సరిదిద్దాల్సిన అవసరం పడవచ్చు. డాక్టర్ రవితేజా రెడ్డి, కారుమూరి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ (చదవండి: హీరో సల్మాన్‌ఖాన్ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్ న్యూరాల్జియా..)
ఫొటోలు


హీరోయిన్గా మిత్రా శర్మ.. ఎంతందంగా ఉందో! (ఫోటోలు)


RK Sagar : ‘ది 100’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)


నెల్లూరులో ఘనంగా మొదలైన రొట్టెల పండగ..పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)


గూగూడు కుళ్లాయిస్వామి క్షేత్రం భక్తజన సాగరం (ఫొటోలు)


గోల్కొండ కోటలో ఘనంగా జగదాంబిక అమ్మవారి బోనాలు (ఫొటోలు)


ENG Vs IND 2nd Test : ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయం (ఫోటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 06-13)


ప్రిన్స్ చార్లెస్, ఓప్రా విన్ఫ్రే మెచ్చిన ప్రదేశం..ఫిట్నెస్కి కేరాఫ్ అడ్రస్ ఇది..! (ఫోటోలు)


భార్యతో ద్వారకా తిరుమల వెళ్లిన కమెడియన్ (ఫోటోలు)


కుట్రాళం జలపాతాలు చూశారా... ???
అంతర్జాతీయం

‘గ్లోబల్ సౌత్’కు దారుణ అన్యాయం
రియో డీ జనీరో: ప్రపంచ ఆర్థికవ్యవస్థ పురోగతికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్న దక్షిణార్ధ గోళ దేశాలు (గ్లోబల్ సౌత్) కీలక నిర్ణయాలు, ప్రయోజనాల విషయంలో బాధిత దేశాలుగా మిగిలిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికైంది. సదస్సుకు అధ్యక్ష, ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తున్న బ్రెజిల్‌లోని రియో డీ జనీరో నగరంలో ఆదివారం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. సదస్సులో భాగంగా ప్లీనరీ సెషన్లో తొలుత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా మాట్లాడాక మోదీ మాట్లాడారు. అవన్నీ నెట్‌వర్క్‌లేని ఫోన్లే ‘‘ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడే గ్లోబల్ సౌత్ దేశాలు చివరకు ద్వంద్వ ప్రమాణాల కారణంగా బాధితదేశాలుగా మిగిలిపోతున్నాయి. అభివృద్ది, వనరుల పంపిణీ, భద్రత వంటి ఏ రంగంలో చూసినా గ్లోబల్ సౌత్ దేశాలకు దక్కేది శూన్యం. వాతావరణ మార్పుల కట్టడికి ఆర్థిక సాయం, సుస్థిరాభివృద్ధి, అధునాతన సాంకేతికత బదిలీ వంటి అంశాల్లో గ్లోబల్‌సౌత్ దేశాలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వ్యవస్థలు, సంస్థలను తక్షణం సంస్కరణల బాట పట్టించి దక్షిణార్ధ గోళ దేశాలకు న్యాయం జరిగేలా చూడాలి. విశ్వ ఆర్థికానికి కీలక భాగస్వామిగా ఉండి కూడా ప్రధాన నిర్ణయాత్మక వేదికలపై గ్లోబల్సౌత్కు స్థానం దక్కడం లేదు. వాటి వాణి వినపడటం లేదు. ఇది ప్రాతినిధ్యం దక్కట్లేదనే మాట కంటే విశ్వసనీయంగా, ప్రభావవంతంగా పనిచేసి కూడా ఎలాంటి ప్రయోజనం, లబ్ధి పొందలేపోవడమే గ్లోబల్ సౌత్ దేశాలకు అశనిపాతమవుతోంది. 20వ శతాబ్దంలో ఆవిర్భవించిన ఎన్నో కీలక అంతర్జాతీయ వ్యవస్థల్లో మూడింట రెండొంతుల జనాభాకు అసలు ప్రాతినిధ్యమే దక్కడం లేదు. గ్లోబల్‌సౌత్ దేశాలు లేకుండా ఇలాంటి వ్యవస్థలన్నీ సిమ్‌కార్డు ఉన్నా నెట్‌వర్క్‌లేని మొబైల్ ఫోన్ లాంటివే’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై సమిష్టి పోరు ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా పోరాడాల్సిన అవసరం చాలా ఉందని మోదీ పిలుపునిచ్చారు. పహల్గాంలో అమాయక పర్యాటకులపై పాక్ ప్రేరేపిత జైషే ముష్కర మఠా జరిపిన పాశవిక దాడిని ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాధినేతలకు ఆయన గుర్తు చేశారు. బ్రిక్స్ వేదికగా ఆ దాడిని మరోసారి ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు అండగా నిలిచాయని గుర్తు చేసుకు న్నారు. మరోసారి అలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా పాక్‌కు మర్చిపోలేని రీతిలో సైనికంగా గుణపాఠం చెప్పామన్నారు. ఉగ్ర మూలాలను పెకిలించివేయనిదే ప్రపంచ శాంతి అసాధ్యమన్నారు.టైప్రైటర్లతో నేటి సాఫ్ట్వేర్ నడవదు ‘‘సమకాలీన ప్రపంచం, కాలానికి తగ్గట్లుగా మేం మారతాం అని ప్రస్ఫుటంగా తెలియజెప్పేందుకే బ్రిక్స్ కూటమిలోకి కొత్త దేశాలను ఆహ్వానిస్తున్నాం. మా బాటలోనే ఐరాస భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ, బహుళజాతి అభివృద్ధి బ్యాంక్‌లు సంస్కరణలను తీసుకొచ్చి తమ చిత్తశుద్ధిని చాటాలి’’ అని మోదీ హితవు పలికారు. కృత్రిమమేధ యుగంలో సాంకేతికత వారం వారం అప్డేట్ అవుతోంది. అలాంటప్పుడు 80 ఏళ్ల క్రితం ఏర్పడిన ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల్లో ఎప్పటికప్పుడు సంస్కరణల అప్డేట్లు జరగాల్సిందే. 20వ శతాబ్దినాటి టైప్రైటర్లతో 21వ శతాబ్దంలోని అధునాతన సాఫ్ట్వేర్ నడవదు. స్వీయ ప్రయోజనాలకంటే కూడా భారత్ మానవాళి ప్రయోజనాలకే పట్టకడుతుంది. బ్రిక్స్‌దేశాలతో కలిసి సమష్టిగా అన్ని రంగాల్లో నిర్మాణాత్మకమైన ప్రాతినిధ్యం వహించేందుకు మేం సదా సిద్ధంగా ఉన్నాం’’ అని మోదీ అన్నారు.

ఉగ్రవాదుల్ని భారత్‌కు అప్పగిస్తావా?.. నువ్వెలా ప్రకటిస్తావ్?
కరాచీ: ఇరుదేశాల మధ్య నమ్మకాన్ని చూరగొనే ప్రక్రియలో భాగంగా ఉగ్రవాదులు హఫీజ్ సయ్యద్, మసూద్ అజహర్‌లను భారత్‌కు అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి, పీపీపీ నాయకుడు బిలావల్ భుట్టో వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయి. గత శుక్రవారం ఖతార్‌కు చెందిన ఆల్ జజీర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ ప్రక్రియలో భాగంగా ఒకవేళ భారత్ ఆ ఉగ్రవాదుల్ని అప్పగించాలని కోరితే తాము అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బిలావాల్.లష్కరే తోయిబా (ఎల్ఇటి) మరియు జైషే మొహమ్మద్ (జెఎం) చీఫ్ మసూద్ అజార్‌ను అప్పగించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదమే తీవ్ర అంశంగా మారిన సమయంలో భారత్‌తో నమ్మకాన్ని చూరగొనడానికి ఇదొక మార్గమన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ ఎటువంటి అభ్యంతరం చెప్పదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావాల్ స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు భారత్‌లో నిర్వహించారని ఆరోపణలు నేపథ్యంలో వారిని అప్పగిస్తామని, అందుకు సంబంధించిన న్యాయప్రక్రియకు భారత్ సహకరించాలన్నారు. ఇందుకు భారత్ ప్రభుత్వం సహకరిస్తే, పాకిస్తాన్ నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదన్నారు. భారత్ ఆందోళన చెందుతున్న సంబంధిత వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలు చేశారని ప్రకటనగా మాత్రమే ఉందని, ఈ క్రమంలో భారత్ సహకరించి న్యాయపరంగా ముందుకు వెళతామంటే వారిని(సంబంధిత ఉగ్రవాదుల్ని) భారత్‌కు అప్పగిస్తామన్నారు.నున్వెలా ప్రకటిస్తావ్!బిలావల్ భుట్టో ప్రకటనపై ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ కుమారుడు తల్హా సయీద్ తీవ్రంగా మండిపడ్డారు. బిలావాల్ ఆ ప్రకటన ఎలా ఇస్తారంటూ ధ్వజమెత్తారు ఇది అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసినట్లేనని తల్హా విమర్శించారు. ఈ విషయంలో బిలావాలో అప్పగింత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఫ్రాన్స్ సంచలన ఆరోపణలు.. చైనా, పాక్‌లు కలిసి..!
తమ యుద్ధ విమానాల అమ్మకాలపై చైనా దుష్ర్పచారాం చేస్తోందని ప్రాన్స్ సంచలన ఆరోపణలు చేసింది. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న రఫెల్ యుద్ధ విమానాల అమ్మకాలను చైనా దెబ్బతీస్తోందని ఫ్రాన్స్ ఆరోపించింది. పలు దేశాల్లో చైనా రాయబార కార్యాలయాల్లో పని నేసే దౌత్య, రక్షణ ప్రతినిధులు ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారని ఫ్రాన్స్ మండిపడుతోంది. ఫేల్ విమానాలను కొనుగోలు చేయవద్దని, వాటి స్థానంలో చైనా తయారీ జెట్లను తీసుకుంటే మంచిదని వివిధ దేశాలను ఒప్పించే యత్నాలు జరగుఉతున్నాయని ఫ్రెంచ్ వర్గాల వెల్లడించాయి. తమ దేశం అధికంగా విమానాల అమ్మకాలనై అత్యధికంగా ఆధారపడిన దేశమని, దాన్ని చైనా దెబ్బ కొట్టడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు ప్రాన్స్ చెబుతోంది. చైనా తన అధికారిక బలంతో ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఫ్రాన్స్ అంటోంది. పాకిస్తాన్, చైనా కలిసి ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఫ్రాన్స్ విమర్శించింది. ఈ దుష్ప్రచారంలో భాగంగా, గత మే నెలలో భారత్‌తో జరిగిన ఘర్షణలో మూడు రఫేల్ విమానాలతో సహా ఐదు భారత విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ చేసిన వాదనలను చైనా వాడుకుంటోందని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఆన్లైన్లో కూడా ఈ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారని తెలిపింది. ఏఐతో మార్ఫింగ్ చేసిన యుద్ధ విమానాల శిథిలాలను చూపిస్తూ చైనా టెక్నాలజీ అమోఘమనే భావనను వారు కల్గిస్తున్నారని తెలిపింది. రఫెల్ అనేది యుద్ధ విమానం మాత్రమే కాదని, అది ఫ్రాన్స్ వ్యూహాత్మక సామర్థ్యానికి, నమ్మకానికి ప్రతీక ఫ్రాన్స్ పేర్కొంది. ఇప్పుడే దాన్నే చైనా తన అధికారిక బలాన్న ఉపయోగించి దుష్ప్రచారానికి దిగినట్లు ఫ్రాన్స్ ధ్వజమెత్తింది.రఫెల్ యుద్ధ విమానాలకు తయారు చేసే డసెల్ట్ ఏవియేషన్ 533 జెట్స్‌ను వివిద దేశాలకు అమ్మింది. ఈజిప్ట్, భారత్, ఖతర్, గ్రీస్, క్రొయేషియా, యూఏఈ, సెర్బియా, ఇండోనేషియా తదితర దేశాలకు ఫ్రాన్స్ తమ యుద్ధ విమానాలను విక్రయించింద. ఇప్పటివరకూ ఇండోనేషియా 42 యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేయగా, మరిన్ని రఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తోంది.

‘రెండు తలల పాము’తో మస్క్ ఎలక్షన్ ‘వెర్రి’!
వాషింగ్టన్: అమెరికా (usa) రాజకీయాల్లో కీలక మలుపు అంటూ,. ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (elon musk) రాజకీయ రంగంలోకి వస్తున్నానంటూ ఆయన స్వయంగా షేర్ చేసిన కొత్త పార్టీ ప్రకటన.. తాజాగా పెద్ద చర్చకు దారి తీసింది. ‘ది అమెరికా పార్టీ’ (the america party) అనే పేరుతో మూడో రాజకీయ శక్తిని ప్రకటించిన మస్క్, ఆ పార్టీకి రెండు తలల పాము మీమ్‌ను షేర్ చేశారు. కానీ మస్క్ నిజంగానే కొత్త పార్టీని పెట్టారా.. ?లేక జనాల్ని వెర్రివాళ్లను చేయడానికే ఇలా చేశారా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే.. అమెరికన్ చట్టాల ప్రకారం..ఆయన అధ్యక్షుడిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు అనర్హులు. దీంతో మస్క్ కొత్త పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదంటే.. కొత్త పార్టీ లేదు. ఏమీ లేదు. తూచ్ అని పక్కకు తప్పుకుంటారా? అని చూడాల్సి ఉండగా.. మస్క్ సౌతాఫ్రికన్ పౌరుడుమస్క్ 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా, అమెరికన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన అనర్హులు. ప్రస్తుత అమెరికా రాజ్యాంగాల ప్రకారం.. ఆర్టికల్ 2, సెక్షన్ 1 ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సదరు అభ్యర్థి అమెరికా పౌరుడై ఉండాలి. తద్వారా మస్క్‌కు అర్హత లేదు. కారణం ఆయన జన్మస్థలం దక్షిణాఫ్రికా కావడం. మస్క్ పార్టీపై సవాలక్ష ప్రశ్నలుఈ నేపథ్యంలో, మస్క్ పార్టీ విస్తరణకు ముందు వ్యతిరేక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన మాత్రం అధ్యక్ష పదవిపై నిర్ణయం వచ్చే ఏడాది చెబుతానంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ.. మస్క్ టార్గెట్ ఏంటి? అమెరికాను పాలించాలని చూస్తున్నారా? పార్టీగా ప్రభావం చూపాలని అనుకుంటున్నారా? అనేది సదరు అమెరికన్ పౌరుల్లో పుట్టుకొస్తున్న సవాలక్ష ప్రశ్నలు.. ఈ ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మస్క్‌కే మద్దతు ఈ క్రమంలో మస్క్ కొత్త పార్టీ ఏర్పాటు? అందుకు గల కారణాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలు ప్రజల స్వేచ్ఛను హరించుతున్నాయని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించిన కీలక ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మస్క్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జులై 4న తన కొత్త పార్టీని ప్రకటించారు. ముందుగా కొత్త పార్టీ స్థాపన విషయంలో నెటిజన్ల అభిప్రాయాల్ని సేకరించారు. కొత్త పార్టీకి మద్దతుగా 1.2మిలియన్ల మంది నెటిజన్లు స్పందించారు. దాదాపు 80 శాతం మంది మస్క్‌కు మద్దతు తెలిపారు. ఈ ఫలితాల ఆధారంగా, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆయన కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.త్వరలోనే పార్టీ లోగో ప్రకటనపార్టీ పేరు ది అమెరికా పార్టీగా నామకరణం చేసినా.. పార్టీ గుర్తును రెండు తలల పాము మీమ్‌ను షేర్ చేస్తూ తన పార్టీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందనే సంకేతాలిచ్చారు. ఇది అధికారిక పార్టీ లోగోగా ప్రకటించలేదు కానీ.. ప్రారంభ దశలో పార్టీ భావజాలానికి ప్రతీకగా ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీకి ప్రత్యేక లోగో, జెండా, రంగులు ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికల్లో మస్క్ పోటీఇక వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో 2–3 సెనేట్ స్థానాలు, 8–10 ప్రతినిధుల సభ స్థానాల్లో ఎలాన్ మస్క్ పోటీ చేయనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం. తన పార్టీ ద్వారా ప్రజల గొంతుకను వినిపించడమే తన పార్టీ ఉద్దేశమనే నినాధాలతో ప్రజల్లోకి వెళ్లనుంది. ఎన్నికల్లో మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహం అమెరికాలో ప్రతినిధుల సభ (House of Representatives) సభ్యుల పదవీకాలం కేవలం 2 సంవత్సరాలు. పదవీ కాలం పూర్తయిన వెంటనే ప్రతినిధుల సభ (House of Representatives) లోని 435 స్థానాలకు, సెనేట్ (Senate) లోని 34 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తన పార్టీ సైతం ఈ ఎన్నికల బరిలో దిగేలా ఎలాన్ మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఈ స్ట్రాటజీ ప్రకారం దేశంలోని అన్నీ స్థానాల్లో పోటీ చేయకుండా.. కేవలం గెలిచే స్థానాల్లో పోటీకి దిగడం, గెలుపు సమీకరణాల్ని మార్చే ప్రయత్నం చేయడం వంటి అంశాలు దీని కిందకే వస్తాయి.మస్క్ ముందున్న సవాళ్లుకాగా,మస్క్ సంపద, ప్రభావం ఉన్నప్పటికీ, మూడో పార్టీగా ఎదగడం సవాలుతో కూడుకున్నదే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరుఫున మస్క్ ప్రచారం చేశారు. ఆ సమయంలో నేను అమెరికా అధ్యక్షుడిని కాలేను. ఎందుకంటే? నేను సౌతాఫ్రికాలో జన్మించాను. మా తాత అమెరిన్. నేను ఆఫ్రికన్. కాబట్టి నేను అమెరికాకు అధ్యక్షుడిని కాలేను. రాకెట్లను, కార్లను నిర్మించడమే తన లక్ష్యమని చెప్పుకున్న మస్క్ ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ ప్రకటించడం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని పరోక్ష సంకేతాలివ్వడంపై అమెరికన్లు పెదవి విరుస్తున్నారు. మస్క్‌కు ఎలక్షన్ ఎర్రి ఉందంటూ మండిపడుతున్నారు.
జాతీయం

రైల్వే స్టేషన్లో పురుడు!
ఝాన్సీ: భారత ఆర్మీ.. సేవకు, త్యాగానికి మారు పేరు. ఆ పేరును మరోసారి నిలుపుకొన్నారీ ఆర్మీ వైద్యుడు. ఝాన్సీ స్టేషన్లో మహిళకు ప్రసవం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. పన్వేల్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ఓ గర్భిణీ భర్త, బిడ్డతో ప్రయాణిస్తోంది. మార్గమధ్యంలో ఆమెకు ప్రసవ వేదన మొదలైంది. భర్త వెంటనే రైల్ మదద్ యాప్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్మీలో వైద్యుడైన 31 ఏళ్ల మేజర్ రోహిత్ బచ్వాలా ఝాన్సీ రైల్వే స్టేషన్లో హైదరాబాద్ వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్నారు. పన్వేల్–గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఝాన్సీకి చేరగానే ఆయనకు విషయం తెలిసింది. ఏమాత్రం ఆలోచించకుండా స్టేషన్ లోని ఫుట్ ఓవర్ వంతెనను తాత్కాలిక ప్రసూ తి వార్డుగా మార్చారు. చిన్న కత్తి, జుట్టుకు పెట్టుకునే క్లిప్పులు, ధోతీ ఉపయోగించి సురక్షితంగా ప్రసవం చేశారు. మహిళా రైల్వే సిబ్బంది సహకరించారు. ప్రసవం తర్వాత మహిళకు, పురిటి పాపాయికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అందుబాటులో ఉన్న అతి సాధారణ వనరులతోనే ప్రసవం చేసిన మేజర్‌ను సైనిధికారులు కొనియాడారు. సోషల్ మీడియాలోనూ ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

భారత్‌లో 81 కోట్ల మందికి ఉచిత ఆహారమే గతి!
భారత్.. ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ సంపదలో ప్రజల మధ్య అంతరం మాత్రం నానాటికీ పెరుగుతోంది. ఇక పేదరిక నిర్మూలన అనేది సుదూర కల. ఎందుకంటే.. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా చెప్పుకుంటున్న జీడీపీ వృద్ధిరేటు ఈ అసమానతలను తగ్గించడం లేదు. దీంతో ఆదాయ ఆసమానతలను రూపుమాపకుండా పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యం కాదని తేలిపోయింది. జీడీపీలో పెరుగుదల ఉన్నప్పటికీ నిరుద్యోగం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఉచిత ఆహార పథకం మీద 81 కోట్ల మంది ఆధారపడి ఉన్నారంటే.. దేశ ఆర్థిక పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే.. కార్మి క చట్టాల అమలుతోపాటు అనేక చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ధనిక దేశంలో పేద విధానాలు దేశంలో విధానపరమైన లోపాలు పేద, ధనిక అంతరాన్ని మరింత పెంచుతున్నాయి. ఆర్థిక వృద్ధిలో అగ్రవాటా దేశంలోని కేవలం 5శాతం మందికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకొంటున్న భారత్‌లో.. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద.. 81.35 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు చెల్లించాల్సి వస్తుందంటే మన అభివృద్ది నమూనా ఎలాంటిదో అర్థమవుతుంది. అమలు కాని కనీస వేతన చట్టం.. కనీస వేతనాల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది బహిరంగ రహస్యం. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) చట్టాల కింద యజమానులు సమర్పించిన రిటర్న్‌లు చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఇంకా కొన్ని విభాగాల్లోని కార్మికులు ఈ రెండింటిలో నమోదే కాలేదు. 1970 కాంట్రాక్ట్ లేబర్ నియంత్రణ, రద్దు చట్టం వచ్చింది. కానీ.. ఐదు దశాబ్దాలైనా పరిశ్రమల్లో అమలు కాలేదు. అంతర్–రాష్ట్ర వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భలంగా ఉంది. సమాన పనికి సమాన వేతనం, ప్రయాణ చెల్లింపులు, వసతి, ఉచిత వైద్య సౌకర్యాలు వంటివి కాగితాలకే పరిమితమయ్యాయి. చెల్లింపులో లింగ అంతరం.. వేతనాల్లో స్త్రీ, పురుషుల మధ్య అంతరం కొనసాగుతూనే ఉంది. జెండర్‌తో సంబంధం లేకుండా సమాన పనికి సమాన వేతనం అందించాలని 1976 సమాన వేతన చట్టం చెబుతున్నా... దేశంలోని అత్యున్నత న్యాయస్థానం తీర్పులున్నా.. వివక్ష కొనసాగుతూనే ఉంది. అన్ని రంగాలలో మహిళలు ఒకే పనికి పురుషుల కంటే తక్కువ సంపాదిస్తూనే ఉన్నారు. ఈ అంతరాలు పోవాలంటే.. విధానాలు, చట్టాల అమలులో కఠినంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. అపరిమిత పని గంటలు.. దేశంలో జీడీపీ పెరుగుదల ఉన్నప్పటికీ నిరుద్యోగ యువత ఎక్కువగా ఉంది. 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారిలో నిరుద్యోగిత రేటు పట్టణ ప్రాంతాల్లో 17.9%, గ్రామీణ ప్రాంతాల్లో 13.7% ఉందని గణాంకాల మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం మే నెలలో తెలిపింది. కార్మికులకు 8 పని గంటలకోసం ఎన్ని ఉద్యమాలు జరిగాయో తెలిసిందే. అయినా.. ఇప్పటికీ అసంఘటిత, అనధికారిక రంగాల్లోని కార్మికులు రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేస్తారు. వీటికి అదనపు చెల్లింపులేమీ ఉండవు. చట్టం ప్రకారం రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికుల పని గంటలను రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలకు పరిమితం చేస్తే ఎక్కువ మందికి ఉపాధిని కల్పించవచ్చు. పేదరికాన్ని తగ్గించాలంటే.. కనీస పెన్షన్‌ను పెంచాలంటున్నారు నిపుణులు. 2004లోనే స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ దీనిని సిఫార్సు చేసింది. రెండు దశాబ్దాలు దాటినా.. పెన్షన్ రూ.1,000 దగ్గరే ఉంది. కొన్ని రాష్ట్రాలు సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న సామాజిక పెన్షన్ రూ. 4,000 కంటే కూడా చాలా తక్కువ. ట్రేడ్ యూనియన్లు, పెన్షనర్లు డిమాండ్ చేసినట్లుగా రూ. 7,000కి పెంచడం వల్ల లక్షలాది మంది జీవిత చరమాంకంలో గౌరవంగా జీవించగలుగుతారు. ఉపాధి హామీ పథకం పని రోజులను 150కి పెంచాలని, వేతనాన్ని రూ.400కు పెంచాలంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్

పనే చేయకుండా.. 12 ఏళ్లలో రూ.28 లక్షల జీతం
భోపాల్: ఓ కానిస్టేబుల్ 12 ఏళ్లపాటు ఎన్నడూ డ్యూటీ చేయకుండానే ఏకంగా రూ.28 లక్షల మేర వేతనం అందుకున్నాడు. వ్యవస్థ వైఫల్యం, యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ విడ్డూరం మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిశ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. 2011లో ఓ వ్యక్తి కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికయ్యాడు. భోపాల్ పోలీస్ లైన్స్‌లో పోస్టింగ్ సైతం ఇచ్చారు. కొన్ని రోజులకే ఆ బ్యాచ్‌లో మిగతా వారితో కలిపి అతడిని కూడా సాగర్ పోలీస్ ట్రెయినింగ్ సెంటర్‌కు ప్రాథమిక శిక్షణ కోసం పంపించారు అధికారులు. ట్రెయినింగ్ సెంటర్‌కు వెళ్లకుండా, నేరుగా విదిశలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, సెలవు కోరడం వంటివేమీ లేకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. స్పీడ్ పోస్ట్ ద్వారా సర్వీస్ రికార్డును పోస్టింగిచ్చిన భోపాల్ పోలీస్ లైన్స్ స్టేషన్‌కు పంపించాడు. వాటిని అందుకున్న అధికారులు అందులోని వివరాలను, అతడి హాజరీని, శిక్షణ స్టేటస్‌ను గురించిన వివరాలనుగానీ చూడనే లేదు. అది మొదలు అతడిని కొత్తగా రిక్రూటైన కానిస్టేబుల్‌గా పరిగణిస్తూ నెలనెలా ఠంచనుగా బ్యాంకు అకౌంట్లో వేతనం జమ చేస్తున్నారు. ట్రెయినింగ్ సెంటర్ అధికారులు గానీ, భోపాల్ పోలీస్ లైన్స్‌లో గానీ అతడిని ఎవరూ పట్టించుకోలేదు. ఇలా 12 ఏళ్లు గడిచాక 2023లో అసలు విషయం వెలుగు చూసింది. 2011వ బ్యాచ్ వారికి పే గ్రేడ్ ఎవాల్యుయేషన్ సమయంలో అతడిని గురించి వాకబు చేయగా తామెన్నడూ చూడలేదని, ఎక్కడ పనిచేస్తున్నాడో తెలియదని చెప్పడంతో అవాక్కవడం అధికారుల వంతయింది. ఈ వ్యవహారంపై ఏసీపీ అంకితా ఖటెర్కర్కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఆ కానిస్టేబుల్‌కు నోటీసులు పంపారు. విచారణకు హాజరైన అతగాడు తనకు మానసిక సమస్యలున్నాయని చెప్పాడు. ఇందుకు ఆధారాలను సమర్పించాడు. ప్రస్తుతం భోపాల్ పోలీస్ లైన్స్‌లోనే పనిచేస్తున్న ఇతడు రూ.1.5 లక్షలను తిరిగిచ్చేశాడు. మిగతా మొత్తాన్ని శాలరీ నుంచి ఇచ్చేందుకు అంగీకరించాడని ఏసీపీ అంకిత వివరించారు.

నేను మరాఠిలో మాట్లాడాలా.. ఇంగ్లిష్‌లోనా?: సీజేఐ
ముంబై: మహారాష్ట్రలో మరాఠీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన తరుణంలో ఇప్పుడు ఆ భాష తప్పనిసరిగా మాట్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇదే విషయంపై సీజేఐ బీఆర్ గవాయ్ సరదాగా స్పందించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 6) ముంబైలోని తాను చదువుకున్న చిన్ననాటి స్కూల్‌ను సందర్భించిన గవాయ్.. స్కూల్ పిల్లలతో సరదాగా గడిపారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడే క్రమంలో మరాఠీ భాషలో మాట్లాడాలా? లేక ఇంగ్లిష్‌లో మాట్లాడాలా? అనే సందిగ్ధత ఆయనకు కూడా ఏర్పడింది. ‘ఇప్పుడు నేను మరాఠీలో మాట్లాడాలా?, లేక ఇంగ్లిష్‌లోనా?’ అని అక్కడున్న టీచర్‌ను అడిగారు. మేడమ్ అయితే మరాఠిలో చక్కగా మాట్లాడారు. కానీ తాను మరాఠీలో మాట్లాడితే అంతా అర్థం చేసుకుంటారు కదూ..? అని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారుదీని తరువాత సీజేఐ గవాయ్.. తన ప్రసంగంలోని మిగిలిన భాగాన్ని మరాఠీలో కొనసాగించారు. తాను మాతృభాషలో మాట్లాడటంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు .. ప్రశంసల సైతం అందుకున్నారు. గవాయ్ తన ప్రసంగంలోని మిగిలిన భాగాన్ని మరాఠీలో కొనసాగించారు, తన మాతృభాషలో మాట్లాడటానికి ఎంచుకున్నందుకు అందరి దృష్టిని మరియు ప్రశంసలను పొందారు.మహారాష్ట్రలో మరాఠీ వాడకాన్ని అమలు చేయడం లేదా ప్రోత్సహించడం చుట్టూ రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో, ముఖ్యంగా ప్రముఖులు మరియు రాజకీయ నాయకులతో కూడిన ఇటీవలి వివాదాల తర్వాత ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. తాను చదువుకున్న చికిత్సక్ సముహ్ శిరోద్కర్ పాఠశాలలోని తరగతి గదులను కూడా సందర్శించారు. ఇక్కడ తన పూర్వ విద్యార్థులతో సమావేశమయ్యారు సీజేఐ. ఈ క్రమంలోనే మాతృభాషలో చదువుకోవడం వల్ల విషయం లోతైన అవగాహన ఏర్పడుతుందని, అది జీవితాంతం మనతో పాటే ఉండే అత్యంత అమూల్యమైనదిగా ఆయన అభివర్ణించారు.
ఎన్ఆర్ఐ

‘స్కామర్..’: భారతీయ టెకీపై అమెరికా సీఈవోలు ధ్వజం
అమెరికాకు చెందిన అయిదు కంపెనీల సీఈవోలను మోసం చేశాడంటూ భారత్‌కు చెందిన టెకీపై ఆరోపణలు గుప్పుమన్నాయి.'స్కామర్' అంటూ ఐదుగురు సీఈవోలు భారతీయ టెక్కీపై ఆరోపణలు గుప్పించారు. అతనితో జాగ్రత్త అంటూ బహిరంగంగా స్టార్టప్‌లను హెచ్చరించడం టెక్ సర్కిల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఇంతకీ ఎవరీ టెకీ, అసలు వివాదం ఏమిటిభారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోహమ్ పరేఖ్ బహుళ స్టార్టప్‌లలో ఒకేసారి మూన్లైట్ (ఒకేసారి వివిధ కంపెనీల్లో పనిచేయడం) చేసినట్లు, యజమానులను మోసం చేసి, స్టార్టప్ కంపెనీలకు మోసగించాడు అనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని తొలుత మిక్స్‌ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO సుహైల్ దోషి వెలుగులోకి తెచ్చారు. పరేఖ్ తప్పుడు సాకులతో ఒకేసారి బహుళ స్టార్టప్‌లను మోసం చేస్తున్నాడన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. పరేఖ్ తన కంపెనీ ప్లేగ్రౌండ్ AIలో కొంతకాలం ఉద్యోగంలో ఉన్నాడని, కానీ అతని నిజాయితీ లేని ప్రవర్తన కారణంగా వారంలోనే అతనిని తొలగించామని వెల్లడించారు.Guys we found Soham Parekh! pic.twitter.com/bWnODxbM8l— Satwik Singh (@itsmesatwik_) July 3, 2025 పరేఖ్‌ను బహుళ కంపెనీలలో మూన్‌లైటింగ్ ఆపమని తాను హెచ్చరించానని, కానీ అతని పట్టించుకోలేదు, అబద్ధాలు, మోసాలు ఆపమని చెస్పినా, ఏడాది తర్వాత కూడా అదే కొనసాగించాడు. అందుకే తీసి వేశామన్నారు. ఒకేసారి 3-4 స్టార్టప్‌లలో ఉద్యోగాలు చేశాడని ఆరోపించారు. తన వాదనలకు బలం చేకూర్చేలా పరేఖ్ CVని పోస్ట్ చేశాడు. PSA: there’s a guy named Soham Parekh (in India) who works at 3-4 startups at the same time. He’s been preying on YC companies and more. Beware.I fired this guy in his first week and told him to stop lying / scamming people. He hasn’t stopped a year later. No more excuses.— Suhail (@Suhail) July 2, 2025 ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 1.28 కోట్ల వ్యూస్ వచ్చాయి. అనేకమంది కంపెనీ యజమానులు ఆయనకు మద్దుతుగా నిలిచారు. ముఖ్యంగా ఫ్లీట్ AI సహ వ్యవస్థాపకుడు , CEO నికోలాయ్ ఔపోరోవ్ ఇవే ఆరోపణలు గుప్పించారు. ఇంకా AIVideo సహ వ్యవస్థాపకుడు జస్టిన్ హార్వే, అని మరొక స్టార్టప్, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొజాయిక్ వ్యవస్థాపకుడు ఆదిష్ జైన్ ఇదే ఆరోపణలను ధృవీకరించారు, ఇంటర్వ్యూలలో బాగానే ఉన్నాడు కానీ అతను అబద్ధాలకోరు అని వ్యాఖ్యానించడం గమనార్హం. యాంటిమెటల్ CEO మాథ్యూ పార్క్హర్స్ట్ ఏమంటారంటే.. సోహామ్ 2022లో కంపెనీలో ఇంజనీర్‌గా చేరాడు. తెలివైన వాడే.. కానీ బహుళ కంపెనీలలో పనిచేస్తున్నాడని చాలా తొందరగానే గమనించాం. అందుకే అతణ్ని తొలగించామన్నారు. అంతేకాదు పరేఖ్ ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ జార్జియా టెక్ నుండి మాస్టర్స్ డిగ్రీ బహుశా 90 శాతం నకిలీదేమో అన్ని అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు. నేను ఉద్యోగం లేక బాధపడుతోంటే, సోహమ్ పరేఖ్‌ను 79 సార్లు హైర్ చేసుకున్నారా అంటూ విచారం వ్యక్తం చేశాడో నిరుద్యోగ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే సోహమ్ పరేఖ్ ఈ ఆరోపణలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.అయితే తప్పేంటి?మూన్‌లైటింగ్ తప్పు అని మీరు ఎందుకనుకుంటున్నారు. అతను ఇంటర్వ్యూలలో పాస్ అయ్యాడు. బెస్ట్ అనే కదా మీరు అతణ్ని తీసుకున్నారు. అతను సరైన వైఖరితో సమయానికి అన్ని పనులను పూర్తి చేసినంత కాలంతప్పేంటి అంటూ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మరో టెక్నిపుణురాలు ట్వీట్ చేశారు.

విజయవంతంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ‘సాహిత్యంలో హాస్యం’ కార్యక్రమం
డాలస్, టెక్సస్, అమెరికా: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” ప్రతి నెలా ఆఖరి ఆదివారం (5 సంవత్సరాలకు పైగా) నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన 81వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సాహిత్యంలో హాస్యం-అలనాటి విశిష్ట రచయితల హాస్యరచనా వైభవం” (గురజాడ, భానుమతి, మొక్కపాటి, ముళ్ళపూడి, చిలకమర్తి, భమిడిపాటి, శ్రీరమణ) ఆద్యంతం నవ్వుల జల్లులు కురిపించింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ - మనకున్న తెలుగు సాహితీవేత్తలలో కొంతమంది విశిష్టరచయితలు సృష్టించిన హాస్య సాహిత్యవైభవాన్ని ఈ రోజు ఈ వేదికమీద చర్చించుకోవడం ముదావహం అంటూ శుభాకాంక్షలుతెల్పి, అందరికీ ఆత్మీయఆహ్వానం పలికారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ”హాస్యంకోసం హాస్యరచనలు చేసినవారు కొందరైతే, ఆనాటి వాస్తవ సాంఘిక, సామాజిక సమస్యల ఇతివృత్తంగా కొంతమంది చేసిన రచనలు సహజంగా హాస్యాన్ని సృష్టించాయి. రచనలతో హాస్యం పండించడం, పాఠకుల్ని మెప్పించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అలాంటి దాన్ని అలవోకగా సాధించిన రచయితలలో కొంతమందిని ఎంపికచేసుకుని వారి రచనావైభవాన్ని మననం చేసుకోవడం, వారిని స్మరించుకోవడం చాలా సబబుగా ఉంది అన్నారు.” విశిష్ట అతిథులుగాపాల్గొన్న - ఆచార్య డా. చుండూరి మృణాళిని, ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, వక్త à గురజాడ అప్పారావు (రచయిత, సంఘ సంస్కర్త, హేతువాది, అభ్యుదయ కవి) గురించి; పొత్తూరి విజయలక్ష్మి, ప్రముఖ హాస్యకథా రచయిత్రి, నవలా రచయిత్రి భానుమతీ రామకృష్ణ (రచయిత్రి, నటి, నిర్మాత, దర్శకురాలు, గాయని, సంగీత దర్శకురాలు) గురించి; డా. కొచ్చెర్లకోట జగదీశ్, ప్రముఖ రచయిత à మొక్కపాటి నరసింహశాస్త్రి (ప్రముఖ హాస్యరచయిత) గురించి; యర్రంశెట్టి శాయి, ప్రసిధ్ధ తెలుగు కథా, నవలా రచయిత à ముళ్ళపూడి వెంకటరమణ (ప్రముఖ సినీ కథా రచయిత, హాస్య కథా, నవలా రచయిత) గురించి; కూచి, ప్రముఖ చిత్రకారుడు, హాస్య రచయిత à చిలకమర్తి లక్ష్మీనరసింహం (సుప్రసిద్ధ కవి, రచయిత, నాటకకర్త, సంఘసంస్కర్త) గురించి; డా. చిట్టెన్ రాజు వంగూరి, ప్రముఖ నాటకకర్త, రచయిత, నటుడు à భమిడిపాటి కామేశ్వరరావు (హాస్యబ్రహ్మ, ప్రముఖ రచయిత, నటుడు, నాటకకర్త) గురించి; ఫణి డొక్కా, ప్రముఖ రచయిత, దర్శకుడు శ్రీ రమణ (ప్రముఖ వ్యంగ్య వ్యాస, కథా, నవలారచయిత)లు సృష్టించిన అసంఖ్యాక రచనలోని విశేషాలను, పాత్రల స్వభావాన్ని అద్భుతంగా ఆవిష్కరించి ఆద్యంతం నవ్వులు పూయించారు.హాస్యప్రధానంగా సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్టఅతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలియజేశారు తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్.ఈ పూర్తి కార్యక్రమాన్ని క్రింది లంకెలో వీక్షించవచ్చును.https://youtube.com/live/x9kzttV6B_w

చిన్న జీయర్ స్వామి తొలిసారి స్కాట్లాండ్ సందర్శన
బోనెస్: భువన విజయం సంస్థ, జెట్ యుకే నిర్వహించిన కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు. ఆయనకు బోనెస్లో ఘన స్వాగతం లభించింది. జూన్ 29న బోనెస్లో జరిగిన ఉపన్యాస కార్యక్రమానికి దాదాపు 500 మంది భక్తజనం హాజరయ్యారు. స్వాగత ఊరేగింపు కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు పర్రి స్వామీజీకి పూలమాలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన తనయుడు అద్వితీయ్ అర్జున్ రాజు పర్రి స్కాటిష్ కళైన బ్యాగ్పైప్ను స్థానిక కళాకారులతో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రసాద్ మంగళంపల్లి, ముఖ్య అతిథి డా. శ్రీహరి వల్లభజౌస్యుల సంయుక్తంగా పూర్ణకుంభ స్వాగతం నిర్వహించారు. సాయి దొడ్డ వారి సమూహం సాంప్రదాయ బద్దంగా కోలాటం ప్రదర్శించారు. పిల్లలు సంయుక్త నృత్యం పుష్పమాల సమర్పణ. శైలజ గంటి, హిమబిందు జయంతి, మమత వుసికల నిర్వహించిన మంగళ ఆరతి వరకు అన్ని క్షణాలు ఉత్సాహభరితంగా సాగాయి. రంజిత్ నాగుబండి సమన్వయం చేయగా, మిథిలేష్ వద్దిపర్తి కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి రాజశేఖర్ జాల జెట్ యూకేతో సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వేదికపై ప్రదర్శింపబడిన కుచిపూడి నృత్యం, ఆరాధనామయ రామ సంకీర్తనం, వీణా వాయిద్య ప్రదర్శన, శ్రీ విష్ణు సహస్రనామ పఠనం, ప్రజ్ఞ పిల్లల శ్లోక పఠన కార్యక్రమాలు ఆహూతులను అలరిస్తూ సాగాయి.ఆ పిదప స్వామీజీ “Ego, Equality & Eternity — A Journey from Self to Supreme” అనే ఉపన్యాసంలో నిత్యవేదాంతసారాన్ని ఆధునిక జ్ఞానంతో మేళవిస్తూ, “అహంకారాన్ని అధిగమించిన ప్రతి హృదయంలో సమానత్వాన్ని, ప్రతి శ్వాసలో శాశ్వతత్వాన్ని కనుగొంటాం” అని ఉత్సాహపూరితంగా పేర్కొన్నారు. ఆయన "భువన విజయం" అనే పేరు వింటే రోమాలు నిక్కబొడుస్తున్నట్లు అనిపిస్తోందన్నారు, ఐదున్నర శతాబ్దాల తరువాత భువన విజయం సభ ప్రాభవాన్ని పునరుజ్జీవింపజేసినందుకు సంస్థను అద్భుతంగా భావించారు.కోర్ బృందం పర్యవేక్షణలో, 30 మంది వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేశారు. ఈ కార్యక్రమం విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. "పుష్ప స్వాగతం నుండి ప్రసాదం చివరి పంపిణీ వరకు, ఈ కార్యక్రమం స్కాటిష్-తెలుగు సంప్రదాయాలను భక్తి, ఐక్యతతో మిళితం చేసింది" అని వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు ప్యారీ అభిప్రాయపడ్డారు. జీయర్ స్వామి మీద కోదండరావు అయ్యగారి వ్రాసిన పద్యాలను ప్రశంస పత్ర రూపంలో భువన విజయం సభ్యులు స్వామి వారికి బహూకరించారు.
NASA astronaut Anil Menon to embark on historic first Space Mission aboard Soyuz MS-29
భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి అనిల్ మీనన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి తొలి మిషన్‌ను ప్రారంభించబోతున్నారు. ఫ్లైట్ ఇంజనీర్‌గా , ఎక్స్‌పెడిషన్ 75 సభ్యుడిగా రోస్కోస్మోస్ సోయుజ్ MS-29 అంతరిక్ష నౌకలో ప్రయాణిస్తారు. అనిల్‌తోపాటు రోస్కోస్మోస్ వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్ ,అన్నా కికినా కూడా పాలు పంచుకుంటారు.2026న జూన్‌లో ఎనిమిది నెలల పాటు ఈ చారిత్మాత్మక యాత్ర సాగనుంది.
క్రైమ్

వివాహేతర సంబంధం.. జంట ఆత్మహత్య
కొమరోలు/ప్యాపిలి: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె గ్రామ సమీప రేగలగడ్డ చెరువు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన కట్టెల భారతికి(20)మూడేళ్ల క్రితం అలేబాదు గ్రామానికి చెందిన శివప్రసాద్‌తో వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి ఏడాదిగా భారతి స్వగ్రామంలో ఉంటోంది.ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కంబగిరి రాముడు(26)తో భారతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం పెద్దలకు తెలియడంతో వారు హెచ్చరించారు. దీంతో ఇరువురూ ఈ నెల 4న ఇంటి నుంచి పారిపోయారు. ఇరువురి కుటుంబ సభ్యులు గ్రామ చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో శనివారం సాయంత్రం రాముడు తన తండ్రి పాపయ్యకు వాట్సాప్ ద్వారా లొకేషన్ పంపించి ఫోన్ స్విచాఫ్ చేశాడు. స్థానిక ఎస్సై నాగరాజు ఆదివారం తెల్లవారుజామున సిబ్బందితో కలిసి లొకేషన్ ఆధారంగా అక్కపల్లె గ్రామానికి చేరుకున్నారు. చుట్టుపక్కల గాలించగా భారతి, రాముడు చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవులుగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

రూ.16 లక్షలు కొట్టేసిన టీడీపీ నేత
పెదకూరపాడు: ఎన్ఆర్ఐ మహిళను మోసం చేసి ఓ టీడీపీ నేత రూ.16 లక్షలు కొట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూరప్‌లో ఉండే షేక్ హసీనా అమరావతిలో భూమి కొనుగోలు చేయాలని మధ్యవర్తి గోపిని సంప్రదించింది. దీంతో హసీనా సోదరి జాన్‌బీకి అమరావతి మండలం నెమలికల్లులోని కుప్పా మల్లేశ్వరయ్యకి చెందిన భూమిని గోపి చూపెట్టాడు. ఆ భూమి వివరాలను ఆమె హసీనాకు వాట్సప్‌లో షేర్ చేసింది. భూమి నచ్చడంతో గోపికి రూ.లక్ష బయానా చెల్లించి భూమికి సంబంధించిన డాక్యుమెంట్ జిరాక్స్‌లను తీసుకుంది. భూమి రికార్డులన్నీ బాగానే ఉండటంతో 95 సెంట్ల పొలాన్ని రూ.75.52 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.హసీనా..తన సోదరి జాన్‌బీని పంపి రూ.16 లక్షలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చిన జాన్‌బీకి అమరావతికి చెందిన టీడీపీ నేత జానీసైదా తాను మల్లేశ్వరయ్య నుంచి భూమి కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నానని నకిలీ పత్రాలు చూపించి నమ్మించాడు. అదే రూ.75.52 లక్షలకే తాను ఆ భూమిని అమ్ముతానని చెప్పాడు. దీంతో మే 15న రూ.16 లక్షలు జానీ సైదాకు చెల్లించి నెలరోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా జాన్‌బీ పేరు మీద అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో జూన్ 20న భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి యూరప్ నుంచి గుంటూరుకు షేక్ హసీనా వచ్చింది. భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటానని జానీసైదాను కోరినా అతడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు.దీంతో హసీనాకు అనుమానం వచ్చి భూ యజయాని మల్లేశ్వరయ్యను సంప్రదించింది. అతడు జానీసైదా ఎవరో తనకు తెలియదని, తాను అగ్రిమెంట్ చేయలేదని చెప్పడంతో హసీనా తాను మోసపోయానని గ్రహించి గుంటూరు పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. హసీనా మాట్లాడుతూ తాను కూడా టీడీపీ తరఫున 3 సార్లు పోలింగ్ ఏజెంట్‌గా పనిచేశానని, తనకు జరిగిన మోసాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళతానని తెలిపింది. కాగా, ఇసుక ఆక్రమాలకు సంబంధించి జానీ సైదాపై పలు ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో టీడీపీలో ముఖ్యనేత కావడంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు.

మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
రహమత్‌నగర్(హైదరాబాద్): మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే దారుణంగా హింసించి కడతేర్చాడో కిరాతకుడు. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలాజీనగర్‌కు చెందిన నర్సింహ కూలి పనిచేస్తుంటాడు. మొదటి భార్య వదిలి వేయడంతో ఫతేనగర్‌కు చెందిన సోని(26)ని ఏడేళ్లక్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరు రెండు నెలల క్రితం బోరబండ డివిజన్ సాయాబాబానగర్కు వచ్చి అద్దెకు ఉంటున్నారు. సోని హౌస్ కీపింగ్ పని చేస్తుండగా..కుమారుడిని గురుకుల పాఠశాలలో చేరి్పంచారు. మద్యానికి బానిసైన నర్సింహ దొంగతనాలు చేశాడు. ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లలో 16 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సోనీ ఇటీవల నర్సింహకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లి వచ్చింది. దీంతో కోపం పెంచుకున్న నర్సింహ శుక్రవారం రాత్రి మద్యం తాగి వచ్చి సోనిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరింది. అరుపులు, కేకలు విన్న పొరుగింటి వారు 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వగా..బోరబండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకని సోనిని పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. నర్సింహను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

కోరుట్ల చిన్నారి కేసులో బిగ్ ట్విస్ట్... సొంత పిన్నే..!
సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణం ఆదర్శనగర్ చిన్నారి హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. పాప సొంత పిన్నే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న(శనివారం) సాయంత్రం సమయంలో హితీక్ష అనే ఐదేళ్ల పాప అదృశ్యమవగా.. పాప తల్లీ నవీన పోలీస్ ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటిపక్కనే బాత్రూమ్లో విగతజీవిగా పాప మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు.పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు.. పలువురిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లిన పాప తండ్రి రాములు.. హుటాహుటీన అక్కడా నుంచి బయలుదేరారు. పాప సొంత పిన్ని మమతనే హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. హితీక్ష కుటుంబసభ్యుల్లో కొందరిని ప్రశ్నించిన పోలీసులు.. కుటుంబ కలహాలే హత్యకు దారితీసినట్లుగా అనుమానిస్తున్నారు. సిసీ టీవీ, సెల్‌ఫోన్ లోకేషన్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 40 మందిని పోలీసులు విచారించారు.శనివారం సాయంత్రం 5 గంటలకు హర్షిత స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సమీపంలో పెద్దపులుల ఆటలు సాగుతుండటంతో వాటిని చూసేందుకు చుట్టుపక్కల పిల్లలతో కలిసి వెళ్లింది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తరువాత సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది.సుమారు గంటన్నర పాటు వెతికిన తల్లిదండ్రులు రాము–నవీనలు తమ కూతురు కనిపించడం లేదని 8.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఇండ్లలో బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లోని బాత్రూంలో బాలిక మెడకోసి చంపినట్లుగా గుర్తించారు. బాత్రూం మొత్తం బాలిక రక్తంతో నిండిఉండగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.బాలిక మృతదేహం దొరికిన ఇంటికి చెందిన వ్యక్తిని కొడిపెల్లి విజయ్‌గా పోలీసులు గుర్తించారు. విజయ్ భార్య దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఆ ఇంట్లో విజయ్‌తో పాటు అతని అన్నదమ్ముల కుమారులు ఉన్నట్లుగా సమాచారం. అయితే విజయ్ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్‌ఫోన్ ద్వారా అతనితో మాట్లాడితే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెపుతున్నట్లుగా సమాచారం.విజయ్ నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలిక పెద్దపులులకు భయపడి సమీపంలోని ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లగా అక్కడ కాలు జారి నల్లాపై పడితే మెడకు గుచ్చి వదిలించుకునే ప్రయత్నంలో బాలిక మెడ కోసినట్లుగా మారిందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
వీడియోలు


సింగపూర్ లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ 76వ జయంతి వేడుకలు


విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి నేతలకు లింకులు


బాబు సర్కార్ కు వ్యతిరేకంగా భారీ నిరసన


నిండుకుండలా శ్రీశైలం డ్యామ్


విశాఖ డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్


తెలంగాణ మొత్తం హరితవనం కావాలి: సీఎం రేవంత్


రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై బాలుడు.. సజ్జనార్ వార్నింగ్


నాలో ఏదైనా లోపం ఉందా..? మిత్రా శర్మ ఎమోషనల్


లోకేష్ రెడ్ బుక్ పతనం స్టార్ట్


మస్క్ కొత్త పార్టీ ప్రకటనలపై విరుచుకుపడ్డ ట్రంప్