ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు
విశాఖపట్నం , రావికమతం(చోడవరం): జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనచోదకుల నుంచి నగదు, దాడులుజరిపి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. రావికమతంస్థానిక పెంట్రోల్ బంకు వద్ద ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.1,50,000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు రావికమతం ఎస్‌ఐ రామకృష్ణ శుక్రవారం తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్‌పై వడ్డాది నుంచి రావికమతం వస్తున్న పత్తి వెంకటరావు అనే వ్యక్తి వద్ద నగదు లభించిందని చెప్పారు. ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
మద్యం, సారా స్వాధీనం
టి.అర్జాపురం గ్రామంలో పోలీసులు దాడులు జరిపి రాజాన బోలినాయుడు, వి.నాగార్జున అనే వ్యక్తుల వద్ద నుంచి 48 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దొండపూడి గ్రామంలో నూకాలు అనే వ్యక్తి వద్ద 15 నుంచి లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్టు కొత్తకోట ఎస్‌ఐ శేఖరం తెలిపారు.
312 బాటిళ్లు పట్టివేత
యలమంచిలిరూరల్: యలమంచిలి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో దాడులు చేసి, మద్యం స్వాధీనం చేసుకున్నట్టు యలమంచిలి ఆ శాఖ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి తెలిపారు. యలమంచిలి,రాంబిల్లి, అచ్యుతాపురం, ఎస్.రాయవరం మండలాల్లోని వివిధ గ్రామాలలో నిర్వహించిన దాడుల్లో 312 మద్యం సీసాలు, 12 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోవడంతో పాటు 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్టు తెలిపారు. 21మందిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.
అడ్డురోడ్డు చెక్ పోస్టు వద్ద ...
ఎస్.రాయవరం(పాయకరావుపేట): అడ్డురోడ్డు జంక్షన్‌లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ ధనుంజయ తెలిపారు.పెదగుమ్ములూరు నుంచి అడ్డురోడ్డు వైపు ఆ వ్యక్తి వెళుతుండగా తనిఖీల్లో పట్టుబడినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి, నగదును పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో ఏఎస్‌ఐ రాములమ్మ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment