గోదాంలోని టన్నులకొద్దీ మందుగుండు సామగ్రి
కాశీబుగ్గ: అధికారుల కళ్లు గప్పి అక్రమంగా బాణసంచా అమ్ముతున్న వ్యాపారిని పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టుచేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రమాదకర స్థలంలో వీటి విక్రయం చేపట్టిన పలాసకు చెందిన వ్యాపారి తంగుడు కృష్ణారావును కాశీబుగ్గ ఎం.వి.ఎస్.కె. ప్రసాద్‌రావు అదుపులోకి తీసుకున్నారు. పలాసలో ఉన్న గోడౌన్‌లను పరిశీలించారు. ఇందులో సుమారు 25 టన్నులకుపైగా మందుగుండు సామగ్రిని నిల్వచేశారని గుర్తించారు. వీటికి అనుమతులు కూడా ఇంకా లేకపోవడంతో సామగ్రిని సీజ్ చేసి తాళాలు వేశారు. పూర్తిస్థాయి అనుమతులు లేకుండా అమ్మడం నేరమని కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఈ వివరాలు వెల్లడించారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు సర్వేచేసి ప్రమాదం లేదని గుర్తించిన వెంటనే అనుమతులు ఇస్తామని వివరించారు.
ప్రమాదకర పరిస్థితి..
ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాలలో సుమారు రెండు వేలమంది చదువుతున్నారు. క్రీడామైదానాన్ని ఆనుకుని ఉన్న గోదాంలో టన్నుల కొద్దీ మందుగుండు సామగ్రిని నిల్వ చేస్తున్నారు. అటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కళ్లు కప్పి జీఎస్టీ నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఇటు రెవెన్యూ అధికారులు, అటు అగ్నిమాపకశాఖ అధికారులు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment