షైన్‌ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం | Short Circuit Happened In Hyderabad Shine Hospital | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లోని షైన్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

Published Mon, Oct 21 2019 7:41 AM | Last Updated on Mon, Oct 21 2019 8:35 AM

Short Circuit Happened In Hyderabad Shine Hospital - Sakshi

హైదరాబాద్‌: నగరంలోని ఎల్‌బీ నగర్‌ షైన్‌ ఆసుపత్రిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐసీయులో షాట్‌ సర్క్యూట్‌తో  మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన ఐదు నెలల చిన్నారి మరణించిగా, ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.  ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత‍్తం 42మంది చిన్నారులు ఉన్నారు. కాగా, మెరుగైన చికిత్స కోసం వీరిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అనంతరం మంటలను అగ్నిమాపక సిబ్బంది  అదుపులోకి తెచ్చారు. ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల తల్లిదండ్రుల నిరసన తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement