- కలెక్టర్ వాకాటి కరుణ
1.71 కోట్ల మొక్కలు నాటాం
Published Wed, Jul 27 2016 12:26 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
హన్మకొండ అర్బన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 1.71 కోట్ల మొక్కలు నాటినట్లు కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కరుణ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు నాటిన బ్లాక్ ప్లాంటేషన్ మొక్కలకు కంచె ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వర్షాలు బాగా కురుస్తున్నం దున నాటిన మొక్కలకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. జిల్లాలో గ్రీన్ ఫండ్ బడ్జెట్‌ను అత్యవసరాల కోసం వినియోగిస్తున్నామన్నారు. వర్షాభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇ¯Œæస్టిట్యూషన్ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వరం గల్ సీపీ సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, హరితహారం జిల్లా ప్రత్యేక అధికారి పృథ్వీరాజ్, కమిషనర్ సర్ఫరాజ్‌అహ్మద్, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement