చిప్పగిరి : కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం రామదుర్గం సమీపంలో కాలువ దాటుతూ వంద గొర్రెలు శనివారం రాత్రి 8 గంటలకు మృత్యువాతపడ్డాయి. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తల్లిమడుగుల గ్రామానికి చెందిన కాపరులు అణిగిరి నారాయణప్ప, ఆదెప్ప, నరసింహప్ప, ప్రభాకర్, బండి నారాయణప్ప తదితరులు 3 వేల గొర్రెలను మేత కోసం వలస వెళ్లారు. చిప్పగిరి మండలం రామదుర్గం ఆలూరు బ్రాంచ్ కెనాల్(ఏబీసీ) అడ్డు రాగా దాన్ని దాటే ప్రయత్నంలో గొర్రెలు ఒకదానికొకటి పడి కాలువలో మృతి చెందాయి. ఘటనతో రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.