విలేకరులతో మాట్లాడుతున్న కార్యదర్శి సుప్రభాతరావు
- పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు
మెదక్: దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకే నియోజకవర్గం, 14 మండలాలతో మెదక్ జిల్లాను ఏర్పాటు చేయడం దారుణమని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మిగతా జిల్లాల్లో కొత్త మండలాలు ఏర్పాటు చేయగా, మెదక్ జిల్లాలో ఉన్న మండలాలను తొలగించి కొత్త మండలాలను ఏర్పాటు చేయక పోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.
ప్రజాభిష్టం మేరకే జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తోందన్నారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలను పూర్తిస్థాయిలో కలపాలని ఆయన డిమాండ్‌చేశారు. ప్రస్తుతం హవేళిఘణాపూర్, బూర్గుపల్లి, మాసాయిపేట, నార్సింగిలను మండలాలను చేయాలని డిమాండ్ ఉన్నందున వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలన్నారు.