15న కందుకూరికి కిన్నెర సాహితీపురస్కారం | 15na kandukuriki kinnera award | Sakshi
Sakshi News home page

15న కందుకూరికి కిన్నెర సాహితీపురస్కారం

Published Wed, Jun 14 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

15na kandukuriki kinnera award

రాజమహేంద్రవరం కల్చరల్‌:
కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామానికి చెందిన విశ్రాంత సంస్కృతాంధ్ర ఉపన్యాసకుడు కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ కిన్నెర సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. కిన్నెర ఆర్ట్‌ థియేటర్, ద్వానా సాహితీ కుటీరం సంయుక్త ఆధ్వర్యంలో కందుకూరి ఈ పురస్కారాన్ని ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లో అందుకోనున్నారు. అష్ట దిగ్గజాలలో ఒక్కరైన అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయ కావ్యానికి కందుకూరి రచించిన వ్యాఖ్యాన గ్రంథానికి ఈ పురస్కారం లభిస్తుంది. నగరానికి చెందిన ప్రజ్ఞారాజహంస చింతలపాటి శర్మ, ప్రాచార్య శలాక రఘునాథ శర్మ, భాగవతవిరించి డాక్టర్‌ టివి.నారాయణరావులు కందుకూరికి తమ అభినందనలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement