నా పెళ్లి ఆపించండి: పోలీసులకు విజ్ఞప్తి | 16-year-old kurnool girl protests against forcible marriage, approaches police | Sakshi
Sakshi News home page

నా పెళ్లి ఆపించండి: పోలీసులకు విజ్ఞప్తి

Published Tue, Jun 13 2017 1:51 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

నా పెళ్లి ఆపించండి: పోలీసులకు విజ్ఞప్తి

నా పెళ్లి ఆపించండి: పోలీసులకు విజ్ఞప్తి

కర్నూలు: కర్నూలులో బాలిక కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. నారాయణ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న బాలిక(16) ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించకుండాపోయింది. ఆమెను మరో యువకుడు కిడ్నాప్‌ చేశాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది.

తల్లితండ్రులు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారని, అందుకే కాలేజీ నుంచి పారిపోయినట్లు ఎస్పీకి రాసిన వినతి పత్రంలో తెలిపింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వివరించింది. పెళ్లి చేయకుండా తల్లిదండ్రులను ఒప్పించాలని కోరింది. తనకు భవిష్యత్తులో పెద్ద చదువులు చదువుకోవాలని ఉందని తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలిక విజ్ఞప్తి మేరకు తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement