Published
Fri, Sep 30 2016 10:52 PM
| Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
190 చక్రాల ట్రాలీ
జీలుగుమిల్లి : రహదారిపై 190 చక్రాల భారీ వాహనం(ట్రాలీ) నెమ్మదిగా కదులుతూ చూపరులను ఆకర్షించింది. ఇటువంటివి రెండు వాహనాలు ముంబాయి నుంచి జంగారెడ్డిగూడెంలో గల 132 కేవీ సబ్‌స్టేషన్‌కు రెండు(పీటీఆర్) పవర్ ట్రాన్స్ ఫారమ్‌లను తీసుకుని బయలుదేరాయి. శుక్రవారం ఇవి జంగారెడ్డిగూడెంకు 14 కిలోమీటర్ల దూరంలోని జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురానికి చేరుకున్నాయి.