21 వేల మొక్కల పంపిణీ
Published Wed, Jul 20 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
హన్మకొండ అర్బన్ : మెప్పా ఆధ్వర్యంలో సుబేదారిలో జరుగుతున్న మొక్కల పంపిణీ కేంద్రంలో అధికారులు నిబంధనలు కాస్త సడలించారు.
‘అన్నా ప్లీజ్.. ఒక్క మొక్క’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై నగర పాలకసంస్థ అధికారులు స్పందిం చారు. మేయర్ ఆదేశాల ప్రకారం బుధవారం వాటర్ ట్యాంక్ సమీపంలోని సర్కిల్ కార్యాలయంలో అడిగిన వారికి మొక్కలు అందజేశారు. బుధవారం సాయంత్రం వరకు సుమారు 2,500 మొక్కలు పంపిణీ చేశారు అదేవిధంగా ఈ కేంద్రం నుంచి 2వేల మహిళా సంఘాలకు 23 వేల వరకు మొక్కలు పంపిణీ చేయాల్సి ఉండ గా, ఇప్పటివరకు సుమారు 27వేల వరకు మొక్కలు వచ్చాయి. వాటిలో సుమారు 21వేల వరకు మొక్కలు మహిళా సంఘాల ప్రతినిధులకు పంపిణీ చేశారు. మరో 4వేల మొక్కలు అందుబాటులో ఉన్నాయి.
హైబ్రిడ్ రకాలు కావడంతో...
ప్రస్తుతం మెప్మా సిబ్బంది పంపిణీ చేస్తున్నవి మొక్కలు హైబ్రిడ్ రకాలు కావడంతో వాటిని ఇళ్లకు తీసుక పోయేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పంపిణీ మొదటి రోజు కేవలం ఎస్‌హెచ్‌జీల వారికి మాత్రమే డివిజన్‌ల వారిగా పంపిస్తామని, బయటవారికి ఒక్క మొక్క కూడా ఇచ్చేది లేదని సిబ్బంది చెప్పడంతో ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అధికారులు పంపిణీ విషయంలో నిబంధనలు కాస్త సడలించడంతో బుధవారం సమీప కాలనీల వారు మొక్కలు తీసుకవెళ్లారు.
16 రకాల మొక్కలు
ఇంటి ఆవరణలో నాటుకునేందుకు అనుకూలంగా ఉండే జామ, గన్నేరు, సపోటా, నిమ్మ, సువర్ఘ గన్నేరు, నంది వర్ధనం, గులాబీ, బతాయి. మల్లె, దానిమ్మ, పారిజాత, సపోటా, జమ్మి, పనస, టేకు, సంపంగి, సన్నజాజి, గరుడ వర్ధనం జాతుల మొక్కలు పంపిణీ చేస్తున్నారు. బుధవారం జరిగిన పంపిణీ కార్యక్రమంలో ఏఈ శ్రీకాంత్, సీఓలు సఫియా, రమ, నాగరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement