అనంతపురం రూరల్: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న కలెక్టరేట్ ఎదుట 24గంటల ధర్నా నిర్వహిస్తున్నట్లు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న తెలిపారు. శుక్రవారం నగరంలోని సంఘం కార్యాలయంలో వీఆర్‌ఏలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వీఆర్‌ఏలను నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాకు పెద్ద ఎత్తున వీఆర్‌ఏలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.