అనంతపురం అగ్రికల్చర్ : రైతు ఉత్పత్తిదారుల కంపెనీ(ఎఫ్‌పీవో)లకు, అందులో సభ్యులుగా ఉన్న రైతులకు కొన్ని రకాల పథకాలకు 75 శాతం రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఉద్యానశాఖ కమిషనర్ కె.చిరంజీవ్‌చౌదరి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 16న స్థానిక ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌లో ఎఫ్‌పీవో అంశంపై నాలుగు జిల్లాల అధికారులు, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాయితీలు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎఫ్‌పీవోల బలోపేతం చేయడంతోపాటు పండ్లతోటల ఉత్పత్తి, ఉత్పాదకశక్తి పెంచడానికి వీలుగా రాయితీని పెంచినట్లు పేర్కొన్నారు.
వివిధ రకాల పథకాలు, మౌలిక వసతుల కల్పనకు గరిష్టంగా రూ.కోటి వరకు రుణసదుపాయం అందజేస్తామన్నారు. 75 శాతం వర్తించే వాటిలో ప్యాక్‌హౌస్, ఇంటిగ్రేటెడ్ ప్యాక్‌హౌస్, కలెక‌్షన్ సెంటర్, కోల్డ్ స్టోరేజీలు, ప్రైమరీ, మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్లు, రైపనింగ్ ఛాంబర్లు, ఎవాపరేట్ లోకాస్ట్ కూల్ ఛాంబర్లు, లోకాస్ట్ ఆనియన్, కోకోనట్ స్టోరేజీ స్ట్రక్చర్స్, రిఫ్రిజిరేటెడ్ ట్రాన్స్‌ఫోర్టు వెహికల్స్, యాంత్రీకరణ పనిముట్లు, రిటైల్ మార్కెటింగ్ అవుట్‌లెట్లు తదితరాలు ఉన్నాయి.
ఎఫ్‌పీవోలకు 75 శాతం రాయితీ
Published Thu, Mar 9 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM
Advertisement