chiranjeev chowdary
-
కమిషనర్ దృష్టికి పండ్లతోటల కష్టాలు
అనంతపురం అగ్రికల్చర్ : ఎండుతున్న పండ్లతోటల సమస్య ఉద్యానశాఖ కమిషనర్ కె.చిరంజీవ్ చౌదరి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ బీఎస్ సుబ్బరాయుడు ‘సాక్షి’కి తెలిపారు. ‘ప్రమాదంలో ఉద్యానం’ శీర్షికతో శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించి పరిస్థితి తీవ్రతను కమిషనర్‌కు తెలియజేశామన్నారు. సాధ్యమైనంత తొందరగా రక్షకతడులు (లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్) ఇవ్వడానికి అనుమతులు ఇవ్వాలని కోరామన్నారు. ఎండుతున్న పండ్లతోటలకు సంబంధించి స్పష్టమైన వివరాలు సంబంధిత హెచ్‌వోలు, ఏడీలకు ఇవ్వాలని రైతులకు సూచించారు. కమిషనరేట్ నుంచి అనుమతులు రాగానే రక్షకతడులు ఇవ్వడానికి వీలుగా కార్యాచరణ ప్రణాళిక తయారీలో ఉన్నామని తెలిపారు. -
ఎఫ్‌పీవోలకు 75 శాతం రాయితీ
అనంతపురం అగ్రికల్చర్ : రైతు ఉత్పత్తిదారుల కంపెనీ(ఎఫ్‌పీవో)లకు, అందులో సభ్యులుగా ఉన్న రైతులకు కొన్ని రకాల పథకాలకు 75 శాతం రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఉద్యానశాఖ కమిషనర్ కె.చిరంజీవ్‌చౌదరి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 16న స్థానిక ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఎఫ్‌పీవో అంశంపై నాలుగు జిల్లాల అధికారులు, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాయితీలు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎఫ్‌పీవోల బలోపేతం చేయడంతోపాటు పండ్లతోటల ఉత్పత్తి, ఉత్పాదకశక్తి పెంచడానికి వీలుగా రాయితీని పెంచినట్లు పేర్కొన్నారు. వివిధ రకాల పథకాలు, మౌలిక వసతుల కల్పనకు గరిష్టంగా రూ.కోటి వరకు రుణసదుపాయం అందజేస్తామన్నారు. 75 శాతం వర్తించే వాటిలో ప్యాక్‌హౌస్, ఇంటిగ్రేటెడ్ ప్యాక్‌హౌస్, కలెక్షన్ సెంటర్, కోల్డ్ స్టోరేజీలు, ప్రైమరీ, మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్లు, రైపనింగ్ ఛాంబర్లు, ఎవాపరేట్ లోకాస్ట్ కూల్ ఛాంబర్లు, లోకాస్ట్ ఆనియన్, కోకోనట్ స్టోరేజీ స్ట్రక్చర్స్, రిఫ్రిజిరేటెడ్ ట్రాన్స్‌ఫోర్టు వెహికల్స్, యాంత్రీకరణ పనిముట్లు, రిటైల్ మార్కెటింగ్ అవుట్లెట్లు తదితరాలు ఉన్నాయి. -
పట్టు పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి
– ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవ్ చౌదరి హిందూపురం రూరల్ : పట్టు పరిశ్రమలోని అన్ని విభాగాల్లో పురోభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవ్ చౌదరి పేర్కొన్నారు. పట్టణంలోని పట్టుగూళ్ల మార్కెట్ సమావేశం హాలులో శుక్రవారం రైతులు, చర్కా రీలర్లు, ట్విస్టర్లతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు, రీలర్లు, ట్విస్టర్లు పాల్గొని పట్టుపరిశ్రమ శాఖ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా గోరంట్ల మండలం నార్శింపల్లికి చెందిన రైతు శివారెడ్డి మాట్లాడుతూ పట్టుపురుగుల పెంపకం షెడ్డుకు రూ.80 వేల బదులు రూ.3 లక్షలు సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రీలర్ల అసోషియేషన్ అధ్యక్షుడు రియాజ్ మాట్లాడుతూ చర్కా రీలర్లకు ఇస్తున్న ఇన్సెంటివ్‌లను రూ.35 నుంచి రూ.100కు పెంచాలని కోరారు. కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా కిలో సీబీ పట్టుగూళకు రూ.30 ఇన్సెంటివ్ అందించాలన్నారు. నగదు రహిత లావాదేవీల నుంచి రీలర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. కమిషనర్ స్పందించి ఇన్‌కంట్యాక్స్ అధికారులతో సమావేశం నిర్వహించాలని జేడీ అరుణకుమారికి ఆదేశించారు. ఆరు జిల్లాల అధికారులతో సమీక్ష పట్టు పరిశ్రమశాఖకు చెందిన నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల అధికారులతో చిరంజీవ్ చౌదరి కిరికెర పట్టుపరిశోధన కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. పట్టు సాగు, వసతులు, నిర్దేశించిన లక్ష్యాలను జిల్లాల వారీగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలోకి అధికారులు వెళ్లి పట్టు పురుగుల పెంపకంపై రైతులకు శిక్షణ అందించాలన్నారు. అధిక దిగుబడులు సాధించిన రైతుల వివరాలను సేకరించి వారి అవలంభిస్తున్న పద్ధతులను ఇతర రైతులకు తెలపాలని సూచించారు. కార్యక్రమంలో చిత్తూరు జేడీ సుమన, అనంతపురం జేడీ అరుణకుమారి, డీడీ సదాశివరెడ్డి, కర్నూలు డీడీ సత్యరాజ్, కిరికెర పట్టుపరిశోధన కేంద్ర డైరెక్టర్ డాక్టర్ రాజు, ఆరు జిల్లాల ఏడీలు, పట్టుపరి««శ్రమ అధికారులు పాల్గొన్నారు. -
ఆత్మ డీపీడీగా ఎన్వీ రమణ
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ (డీపీడీ)గా వెయిటింగ్ జాబితాలో ఉన్న ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్వీ రమణను నియమిస్తూ ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవ్‌చౌదరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ డీపీడీగా ఉన్న మైఖేల్రాజీవ్ను చిత్తూరు జిల్లా ఉద్యానశాఖ డీడీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.