కమిషనర్‌ దృష్టికి పండ్లతోటల కష్టాలు | horticulture problems to commissioner | Sakshi
Sakshi News home page

కమిషనర్‌ దృష్టికి పండ్లతోటల కష్టాలు

Published Fri, Apr 7 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

horticulture problems to commissioner

అనంతపురం అగ్రికల్చర్‌ : ఎండుతున్న పండ్లతోటల సమస్య ఉద్యానశాఖ కమిషనర్‌ కె.చిరంజీవ్‌ చౌదరి దృష్టికి తీసుకెళ్లినట్లు ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బీఎస్‌ సుబ్బరాయుడు ‘సాక్షి’కి తెలిపారు. ‘ప్రమాదంలో ఉద్యానం’ శీర్షికతో శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించి పరిస్థితి తీవ్రతను కమిషనర్‌కు తెలియజేశామన్నారు.

సాధ్యమైనంత తొందరగా రక్షకతడులు (లైఫ్‌ సేవింగ్‌ ఇరిగేషన్స్‌) ఇవ్వడానికి అనుమతులు ఇవ్వాలని కోరామన్నారు. ఎండుతున్న పండ్లతోటలకు సంబంధించి స్పష్టమైన వివరాలు సంబంధిత హెచ్‌వోలు, ఏడీలకు ఇవ్వాలని రైతులకు సూచించారు. కమిషనరేట్‌ నుంచి అనుమతులు రాగానే రక్షకతడులు ఇవ్వడానికి వీలుగా కార్యాచరణ ప్రణాళిక తయారీలో ఉన్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement