పెంటపాడు(పశ్చిమగోదావరి): దొంగతనం చేశాడనే అనుమానంతో ఒక వ్యక్తిని తీవ్రంగా కొట్టటంతో ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమగోదావరి జిల్లాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం పట్టణానికి చెందిన దిరిశాల వెంకటరమణ(45) పెంటపాడులోని ఓ ఆయిల్ మిల్లులో పనిచేస్తున్నాడు.
ఇటీవల మిల్లులో సామగ్రి మాయమవుతుండటంతో వెంకటరమణనే దొంగిలించాడని అనుమానించారు. దీంతో తోటి కార్మికులు కొందరు అతనిని తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా అస్వస్థతకు గురైన అతడిని ఏలూరులోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా బుధవారం సాయంత్రం చనిపోయాడు. కాగా, అతనికి మతిస్థిమితంగా లేదని స్థానికులు చెబుతున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
దొంగతనం నేరం మోపి కొట్టి చంపారు..
Published Wed, Sep 16 2015 4:14 PM | Last Updated on Thu, Oct 4 2018 8:38 PM
Advertisement
Advertisement