హత్య కేసులో నిందితులు అరెస్ట్‌ | accuses arrest of murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితులు అరెస్ట్‌

Published Fri, Aug 4 2017 9:40 PM | Last Updated on Thu, Oct 4 2018 8:38 PM

హత్య కేసులో నిందితులు అరెస్ట్‌ - Sakshi

హత్య కేసులో నిందితులు అరెస్ట్‌

గుంతకల్లు రూరల్‌: వజ్రకరూరు మండలం ఎన్‌ఎన్‌పీ తండాకు చెందిన రమావత్‌ అంజలీబాయి (19) హత్య కేసులో నిందితులైన భర్త హరినాయక్‌తో పాటు గణేష్‌ నాయక్, అనిల్‌నాయక్‌లను అరెస్ట్‌ చేసినట్లు గుంతకల్లు రూరల్‌ సీఐ గురునాథ్‌బాబు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను వజ్రకరూరు ఎస్‌ఐ జనార్ధన్‌నాయుడుతో కలిసి శుక్రవారం కసాపురం పోలీస్‌స్టేషన్‌లో ఆయన వెల్లడించారు. గతంలో హెర్నియా ఆపరేషన్‌ చేయించుకున్న హరినాయక్‌ భార్యకు సంసార సుఖాన్ని అందించలేకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయన్నారు.

విసిగిపోయిన అంజలీబాయి తనకు విడాకులు ఇవ్వాలంటూ భర్తపై ఒత్తిడి పెంచిందన్నారు. ఈ విషయం బయటకు తెలిస్తే తన పరువుపోతుందని భావించి జూలై 11న ఆమెను పథకం భర్తే హత్య చేశాడన్నారు. ఇందుకు తన మేనల్లుడు గణేష్‌నాయక్‌, స్నేహితుడు అనిల్‌నాయక్‌ సహకారం తీసుకున్నాడన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement