వైవీయూ :
యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు నిర్వహించనున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు చెల్లించాల్సిన ఫీజు గడువును ఈనెల 26వ తేదీ వరకు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య బాయినేని శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు ఉన్న గడువును విద్యార్థుల సౌకర్యార్థం ఎటువంటి అపరాధ రుసుం లేకుండానే ఈనెల 26వ తేదీలోపు చెల్లించవచ్చని తెలిపారు. అదే విధంగా రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు ప్రకటించిన రెండురోజుల్లో ఫీజుకట్టి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.