
జిల్లా రవాణాశాఖ అధికారిగా శ్యాంనాయక్
ఆసిఫాబాద్: కుమ్రం భీమ్ జిల్లా రవాణా శాఖాధికారిగా అజ్మెర శ్యాంనాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ ఎంవీఐగా పని చేస్తున్న శ్యాంనాయక్ కొత్త జిల్లా ఏర్పాటుతో జిల్లా అధికారిగా పూర్తి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులకు మెరుగైన సేవలందిస్తామన్నారు. త్వరలో జిల్లా కేంద్రంలో కొత్త కార్యాలయ భవన నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.