ఆదోనిలో మరో సైబర్ నేరం
Published Mon, Jan 23 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM
- బ్యాంకు ఖాతా నుంచి రూ.33,990 మాయం
- లబోదిబోమంటున్న బాధితుడు
ఆదోని: ఆన్‌లైన్ లావాదేవీలు నిరుపేదల కష్టార్జితానికి ఎసరు పెడుతున్నాయి. నెల తిరిగే లోగా పట్టణానికి చెందిన ఇద్దరు ఆన్‌లైన్ లావా దేవీల అక్రమాల బాధితులుగా మారారు. ఈ నెల 13న పట్టణానికి చెందిన జయమ్మ రూ.48వేలు మోసపోగా తాజాగా సోమవారం లక్ష్మన్న అనే వ్యక్తి ఖాతా నుంచి రూ. 33,990 మాయమైంది. బాధితుడి వివరాల మేరకు.. మండలం పరిధిలోని బైచిగేరి గ్రామానికి చెందిన ఎం లక్ష్మన్న పట్టణంలోని సాయి నర్శింగ్ హోం ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఆదోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖలో ఉన్న తన సేవింగ్స్ ఖాతాలో డబ్బును పొదుపు చేసుకుంటున్నాడు. తల్లి, దండ్రులు కష్టపడి పండించిన పంట అమ్మగా వచ్చిన డబ్బును కూడా అదే ఖాతాలో జమ చేశాడు.
గత నెల 5న బ్యాంకుకు వెళ్లి రూ.4వేలు డ్రా చేశాడు. అయితే అంతకు ముందు రోజు డిసెంబరు 4న తన ఖాతా నుంచి రూ.33,990 ఫ్లిప్‌కార్ట్ ఖాతాకు జమ అయినట్లు తెలసుకుని గొల్లుమన్నాడు. గుర్తు తెలియని వ్యక్తి లక్ష్మన్న ఏటీఎం పిన్ నంబరు తెలుసుకుని ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. లక్ష్మన్న ఫ్లిప్‌కార్ట్ సంస్థకు ఫోన్ చేయగా పోలీసుల ద్వారా వస్తే వివరాలు అందిస్తామని సమాధానం వచ్చింది. బ్యాంకు అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారని లక్ష్మన్న ‘సాక్షి’కి తెలిపాడు.
Advertisement
Advertisement