రవాణా కమిషనర్ను బదిలీ చేయాలి | AP NGO Leader ashok babu meeting with chandrababu | Sakshi
Sakshi News home page

రవాణా కమిషనర్ను బదిలీ చేయాలి

Published Thu, Nov 12 2015 1:39 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

AP NGO Leader ashok babu meeting with chandrababu

విజయవాడ : రవాణా శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యంను వెంటనే బదిలీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు వెల్లడించారు. గురువారం విజయవాడలో చంద్రబాబును అశోక్బాబుతో పాటు రవాణ సంస్థకు చెందిన ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ సుబ్రహ్మణ్యం.. ఉద్యోగ సంఘ నేతలను వేధింపులకు గురి చేస్తున్న తీరును చంద్రబాబుకు అశోక్ బాబు వివరించారు.

అనంతరం అశోక్బాబు విలేకర్లతో మాట్లాడుతూ... 56 సర్వీసులు ప్రైవేటీకరించేందుకు కమిషనర్ యత్నిస్తున్నారని విమర్శించారు. సుబ్రహ్మణ్యం వేధింపులపై రవాణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలవ వలసి వచ్చిందన్నారు. సుబ్రహ్మణ్యంపై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement