మహిళా కండక్టర్‌పై దౌర్జన్యం
Published Thu, Nov 17 2016 2:04 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
జంగారెడ్డిగూడెం : మహిళా కండక్టర్‌పై దౌర్జన్యం చేసి కొట్టిన ఓ విద్యార్థిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. ఆర్టీసీ డిపోలో ఎం.వసంతకుమారి కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె బుధవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వెళ్లే బస్సులో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న పితాని ప్రసాద్ అనే విద్యార్థి బస్సు ఎక్కాడు. బయ్యనగూడానికి టికెట్ ఇమ్మని ఆమెను అడిగాడు. అదే సమయంలో బస్సు కదలడం, మలుపు రావడంతో డ్రైవర్‌కు వసంతకుమారి సూచనలిస్తున్నారు. అయితే టికెట్ అడిగిన వెంటనే ఇవ్వలేదని ప్రసాద్ కండక్టర్‌పై దౌర్జన్యం చేయడమే కాకుండా చేయి చేసుకున్నాడు. కండక్టర్ వసంతకుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement