తిరుమల వేంకటేశ్వర స్వామి వారు
సాక్షి,తిరుమల: తిరుమలలో లక్కీడిప్ కింద కేటాయించే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా శనివారం టీటీడీ ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవలకు ముందురోజు సాయంత్రం 5 గంటల్లోగా కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్‌వో)లోని విజయాబ్యాంక్ కౌంటర్‌లో లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు భక్తులు తమ వ్యక్తిగత వివరాలు, వేలిముద్రలు, సెల్ నెంబర్ కంప్యూటర్‌లో నమోదు చేసుకుని టోకెన్ పొందాలి. నమోదు చేసుకున్న వారిలో కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఆర్జిత సేవాటికెట్లు కేటాయిస్తారు. తర్వాత ఎంపికైన భక్తుల సెల్ నెంబరుకు ఎస్‌ఎంఎస్ రూపంలో సమాచారం అందజేస్తారు. రాత్రి 8 గంటల్లోపు భక్తులు ఆ టికెట్టు కొనుగోలు చేయాలి. శుక్రవారం నిర్వహించే పురాభిషేకం, మేల్‌చాట్ వస్త్రం టికెట్లను రెండో విడత లక్కీడిప్‌లో కేటాయిస్తారు. వీటిని రాత్రి 10 గంటల్లోపు భక్తులు పొందవచ్చు. సామాన్య భక్తులు కూడా లక్కీడిప్ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అరుదైన ఆర్జిత సేవల్లో పాల్గొని స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించుకుని ఆనంద పరవశులవుతున్నారు.
ఆగస్టు లక్కీడిప్ కోటా వివరాలు
తోమాల అర్చన వస్త్రం పూరాభిషేకం
02.08.2016 06 17 – –
03.08.2016 07 15 – –
04.08.2016 07 26 – –
05.08.2016 – – 01 35
09.08.2016 06 12 – –
10.08.2016 05 18 – –
11.08.2016 – 09 – –
12.08.2016 – – 02 –
16.08.2016 పవిత్రోత్సవం సందర్భంగా రద్దు
17.08.2016 – 31 – –
18.08.2016 – – – –
19.08.2016 – – 02 –
23.08.2016 – 06 – –
24.08.2016 – – – –
25.08.2016 – 17 – –
26.08.2016 – – 01 –
30.08.2016 – – – –
31.08.2016 – 45 – –