జేఎన్‌టీయూ : ఇంజినీరింగ్ యువత సివిల్ సర్వీసెస్‌పై దృష్టి పెట్టాలని సివిల్ సర్వీసెస్ శిక్షకుడు ఆకుల రాఘవేంద్ర అన్నారు. జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని సీఎస్‌ఈ విభాగంలో మంగళవారం ఇంజినీరింగ్ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్యను అభ్యసించిన వారు సివిల్ సర్వీసెస్‌ను ఎలా సాధించాలో వివరించారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ ఆచార్య బి. ప్రహ్లాదరావు, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎంఎల్‌ఎస్ దేవకుమార్, ఉస్మానియా వర్సిటీ సోషియాలజీ విభాగాధిపతి డాక్టర్ గణేష్ పాల్గొన్నారు.