అరటికి అదిరే రేటు
టన్ను(అట్‌డిరేట్)రూ.22 వేలు
కరువు రైతుకు అరటి సిరులు కురిíపిస్తోంది. టన్ను రూ.22 వేలు ధర పలుకుతుండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శింగనమల నియోజకవర్గంలో సుమారు 7 వేల ఎకరాల్లో అరటి తోటలు సాగుచేయగా ఆదివారం నార్పల మండలంలోని కర్ణపొడికి, వెంకటాంపల్లి, గడ్డంనాగేపల్లి, పుట్లూరు మండలం మడుగుపల్లి, జంగమరెడ్డిపేట గ్రామాల్లో టన్ను రూ.20 వేలతో కోతలు చేశారు. సోమవారం కోతకు టన్ను రూ.22 వేలు చెల్లించడానికి దళారులు అరటి రైతులకు అడ్వాన్స్‌లు చెల్లించారు. మార్చి నెలాఖరు వరకు ధర స్థిరంగా ఉంటుందని వ్యాపారులు భరోసా ఇస్తున్నారు. కాగా గత ఏడాది ఈనెలలో అరటి టన్ను రూ.6 వేలు మాత్రమే ధర పలికింది.
- నార్పల