బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ. 50వేలు మాయం | Bank from now. 50 thousand missing | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ. 50వేలు మాయం

Published Thu, Sep 1 2016 11:31 PM | Last Updated on Tue, Aug 28 2018 8:11 PM

Bank from now. 50 thousand missing

చాంద్రాయణగుట్ట: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అకౌంట్‌ నుంచి ఓ వినియోగదారుడికి చెందిన రూ. 50 వేలను గుర్తు తెలియని వ్యక్తులు డ్రా చేసిన ఘటన శాలిబండ ఠాణా పరిధిలో జరిగింది. బాధితుడి వివరాల ప్రకారం... జంగమ్మెట్‌ బస్తీకి చెందిన కె.గండిస్వామికి శంషీర్‌గంజ్‌ ఎస్‌బీఐలో (30036635471) అకౌంట్‌ ఉంది. ఈ ఖాతాలో రూ. 52 వేలు ఉన్నాయి. గురువారం ఉదయం బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పరిశీలించగా కేవలం రూ. 2 వేలే ఉన్నాయి. 

కంగుతిన్న గండిస్వామి వెంటనే బ్యాంక్‌ మేనేజర్‌ను సంప్రదించగా... గత నెల 24న ముంబై, ఢిల్లీ నగరాలలోని ఏటీఎంల నుంచి రూ. 5 వేల చొప్పున 10 పర్యాయాలు డ్రా చేసినట్లు స్పష్టమైంది. దీంతో బాధితుడు గురువారం సాయంత్రం శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేయగా...  కేసు నమోదు చేశారు. ఈ కేసును  సీసీఎస్‌కు కేసు బదిలీ చేస్తామన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement