money loss
-
ఆన్లైన్ షాపింగ్‌లో డబ్బులు పోయాయా? ఇవి పాటిస్తే మేలు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్లో షాపింగ్ చేయడం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆన్లైన్లోని వివిధ ప్లాట్ఫామ్ల్లో ధర బేరీజు వేసి ఎక్కడకొనాలో నిర్ణయం తీసుకుంటున్నారు. కావాల్సిన వస్తువును ఇంటికే తెచ్చి ఇస్తుండడంతో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ సౌకర్యంగా భావిస్తున్నారు. రాయితీలు, ఇతర ప్రయోజనాలు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొత్త యాప్‌లు అందుబాటులోకి రావడం కూడా అందుకు దోహదం చేస్తోంది. అయితే, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది డబ్బులు నష్టపోతుంటారు. మరి వీటిని అరికట్టడానికి కొన్ని సులువైన మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. 1. బయోమెట్రిక్ ఉత్తమం.. పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టం. పైగా వీటిని సులువుగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. దీంతో తరచూ మార్చాలి. దీనికి బదులు బయోమెట్రిక్స్, ఇ-సిగ్నేచర్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటే మేలు. 2. రెండంచెల ధ్రువీకరణ.. ఆన్లైన్లో షాపింగ్‌లో చెల్లింపులు చేసేటప్పుడు బహుళ అంచెల ధ్రువీకరణ విధానాన్ని పాటించాలి. కేవలం ఒక్క పాస్వర్డ్తోనే కాకుండా బయోమెట్రిక్, ఓటీపీ, మెయిల్, ఎస్ఎంఎస్, మొబైల్ వంటి ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా వివరాల్ని రెండోసారి ధ్రువీకరించే పద్ధతిని అనుసరించాలి. 3. రిమోట్ యాక్సెస్‌తో నష్టం.. మన కంప్యూటర్ లేదా ఫోన్‌ను ఒక్కోసారి దూరంగా ఉన్న వ్యక్తికి రిమోట్ యాక్సెస్ ఇస్తుంటాం. కానీ, ఇది అంత శ్రేయస్కరం కాదు. దీనివల్ల మీ ఆన్లైన్ ఖాతాల సమాచారం మొత్తాన్ని ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. మీ పాస్వర్డ్లు, ఇతర వివరాలన్నీ సులువుగా కనుగొంటారు. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. 4. ఓటీపీని అసలు షేర్ చేయొద్దు.. ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమర్ దగ్గర నమ్మకాన్ని సంపాదించడం కూడా అందులో ఓ భాగం. మిమ్మల్ని మాటల్లో పెట్టి కీలక వివరాలన్నీ తెలుసుకుంటారు. అందువల్ల ఫోన్లోగానీ, ఆన్‌లైన్‌లోగానీ ఎవరైనా ఓటీపీ అడిగితే వెంటనే అనుమానించాలి. (లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!) 5. పబ్లిక్ వైఫైతో జాగ్రత్త.. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు వీలైనంత వరకు పబ్లిక్/ ఓపెన్ వైఫైని వాడకపోవడమే మంచిది. పబ్లిక్ వైఫై ద్వారా మీరు చేస్తున్న లావాదేవీలను కొందరు ఇతర మార్గాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీల కోసం సొంత నెట్వర్క్, సొంత డివైజ్‌నే వాడాలి. ఆన్లైన్ షాపింగ్, లావాదేవీలకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవాలి. ఎన్ని రకాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అపరిచిత వ్యక్తులు, సంస్థలతో మీ సమాచారాన్ని పంచుకోవద్దు. -
టెలిగ్రామ్ లింక్ పేరుతో.. సైబర్ మోసం!
రాజన్న: అత్యాశకు పోయి రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లికి చెందిన యువకుడు రూ.7.67లక్షలు పోగొట్టుకున్నాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు. స్తంభంపల్లికి చెందిన అక్కెనపెల్లి హరీశ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ బయోటెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్లైన్లో వచ్చిన మెస్సేజ్‌తో టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేశాడు. మొదట యూట్యూబ్ ద్వారా కొన్ని వీడియోలు పంపితే నెలకు రూ.3వేలు ఇస్తామని చెప్పడంతో అలా చేశాడు. కొద్ది రోజులకు యాప్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతాయని నమ్మబలకడంతో ఈనెల 9, 10, 11 తేదీలలో ఫోన్‌పే, గూగూల్‌పే ద్వారా వారు చెప్పిన నంబర్లకు రూ.7.67లక్షలు పంపించాడు. చివరికి యాప్ ఫేక్ అని తెలుసుకొని 1930 నంబర్‌కు ఫిర్యాదు చేశాడు. ఎస్సై మహేందర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని, అత్యాశకు పోయి ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోవద్దని హెచ్చరించారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగికి కుచ్చుటోపి.. ఏకంగా 46 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
సాక్షి, సంగారెడ్డి: కమీషన్ పేరిట ఆశ చూపి సాఫ్ట్వేర్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. దీంతో భారీ నగదు పోగొట్టుకొన్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అమీపూర్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి జూన్ 28న పార్ట్ టైం జాబ్ అంటూ వచ్చిన వాట్సాప్ మెసేజ్‌కు స్పందించాడు. అందులో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. దీంతో సైట్ నిర్వాహకుడు అతడికి ఒక వాలెట్ ఐడీ ఇచ్చారు. అందులో ఉద్యోగి ముందుగా రూ.2 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్‌లు చేస్తున్నాడు. కాగా తాను పెట్టిన నగదును సైబర్ నేరగాళ్లు తనకిచ్చిన వాలెటఖలె చూపిస్తున్నారు. ఈ క్రమంలో బాధితుడు తన భార్య నగలు అమ్మి, స్నేహితుల వద్ద అప్పు చేసి, జాబ్లోను ద్వారా మొత్తంగా 35 దఫాలుగా రూ.46 లక్షలు చెల్లించాడు. సైబర్ నేరగాళ్లు ఉద్యోగితో నగదు పెట్టిస్తూ తనకు ఇచ్చిన వాలెట్లో నగదుతోపాటు కమీషన్ నగదు చూపించారు. దీంతో ఉద్యోగి చివరిగా తాను పెట్టిన నగదుతోపాటు కమిషన్ ఇవ్వాలని అడగగా స్పందించలేదు. దీంతో బాధితుడు తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు శనివారం ఫిర్యాదు అందింది. చదవండి: ఉద్యోగాల పేరుతో మోసం.. దుబాయ్ తీసుకెళ్లి షేక్‌లకు అమ్మేసిన బ్రోకర్ -
ఇన్‌స్టాలో ఐఫోన్ అగ్గువ.. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకున్న నిట్ విద్యార్థిని
సాక్షి, వరంగల్: ఇన్‌స్టాగ్రామ్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ లభిస్తుందని వచ్చిన ఓ ప్రకటన చూసి అత్యాశకు పోయిన ఓ నిట్ విద్యార్థి రూ.42,497 నగదు పోగొట్టుకుంది. విద్యార్థిని తన ఫోన్లో ఇన్‌స్టా యాప్ చూస్తుండగా ఐఫోన్, డెల్ ఐ–5 ల్యాప్‌టాప్ తక్కువ ధరకు ఉందనే ప్రకటన చూసి ఆర్డర్ పెట్టింది. వెంటనే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ల్యాప్‌టాప్ లేదని, వన్ ప్లస్ మొబైల్ ఉందని చెప్పగా.. రూ.42,497 నగదును ఆమె ట్రాన్స్ఫర్ చేసింది. రోజులు గడుస్తున్నా ఫోన్ రాకపోవడంతో ఆ నంబర్‌కు ఫోన్ చేయగా అవతలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని కాజీపేట పోలీసులను ఆశ్రయించింది. ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్‌రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. రూ. 34 వేలు పోగొట్టుకున్న చిరు వ్యాపారి.. హనుమకొండ విజయపాల్ కాలనీకి చెందిన చిరువ్యాపారి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.34 వేలు పోగొట్టుకున్నాడు. నిట్ వరంగల్ కలాం విశ్రాంతి గృహానికి బిస్లరీ వాటర్ బాటిళ్లు పంపించాలని గుర్తు తెలియని వ్యక్తి చిరువ్యాపారికి ఫోన్ చేశాడు. బాటిళ్లను ఎన్ఐటీకి తీసుకెళ్లగా ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి అక్కడ లేడు. దీంతో వ్యాపారి ఫోన్ చేయగా.. గుర్తు తెలియని వ్యక్తి రూ.20 నగదు మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. రూ.34వేలు పంపిస్తే రూ. 68 వేలు పంపిస్తానని మాయమాటలు చెప్పాడు. చిరువ్యాపారి రూ.34 వేలు పంపించాడు. ఆతర్వాత అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో తాను మోసపోయినట్లుగా గుర్తించిన బాధితుడు కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. చదవండి: లైట్ తీస్కోవద్దు.. నాకేమవుతుందనుకుంటే ప్రమాదమే, తస్మాత్ జాగ్రత్త! -
బోనీ కపూర్ నుంచి లక్షల్లో చోరీ.. పోయినట్టు కూడా తెలియదు
Boney Kapoor Credit Card Misused And Lost Lakhs Of Money: ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ నుంచి డబ్బు దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. బోనీ కపూర్ క్రెడిట్ కార్డు ద్వారా లక్షలు కొట్టేశారు. ఈ విషయంపై బోనీ కపూర్ బుధవారం (మే 25) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అంబోలీ పీఎస్ పోలీసులు పేర్కొన్నారు. బోనీ కపూర్ క్రెడిట్ కార్డు వివరాలు, పాస్వర్డ్ తదితర డేటాను నిందితులు చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ డేటా సహాయంతో ఫిబ్రవరి 9న ఐదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిపారు. ఈ ఐదు ట్రాన్సాక్షన్స్‌లతో మొత్తం రూ. 3.82 లక్షలను నిందితులు దోచుకున్నారు. అయితే ఈ లావాదేవీలు జరిపినప్పుడు బోనీ కపూర్‌కు తెలియదని.. తర్వాత అకౌంట్స్ చెక్ చేసినప్పుడు తాను డబ్బు పోగోట్టుకున్నట్లు గ్రహించారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి గురైన డబ్బు గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ అకౌంట్లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు అంబోలీ పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి పేర్కొన్నారు. చదవండి:👇 త్వరలో పెళ్లి !.. అంతలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు వచ్చే 3 నెలల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే.. -
రూ.14.23 కోట్లు వృథా
సాక్షి, సింగరాయకొండ: నిధులు మంజూరయ్యాయి.. ఇక తమ కష్టాలు తీరతాయి.. పుష్కలంగా పంటలు పండుతాయనుకున్న రైతన్న ఆశలు నెరవేరలేదు. అధికారులు, కాంట్రాక్టర్ల అవినీతి అన్నదాతలకు నిరాశే మిగిల్చింది. సింగరాయకొండ ప్రాంత రైతాంగానికి ప్రధాన నీటి వనరు అయిన పీబీ (పాలేరు–బిట్రగుంట) సప్లయ్ చానల్‌కు కాంగ్రెస్ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14.23 కోట్ల రూపాయల జపాన్ నిధులు మంజూరయ్యాయి. కానీ,ఆ ప్రభుత్వ హయాంలో 50 శాతం కూడా పని జరగలేదని, తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఒక్క శాతం కూడా పని చేయలేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగం పనులు కూడా జరగ లేదని రైతులంటుండగా ఇరిగేషన్‌శాఖ అధికారులు మాత్రం 10 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు చెబుతుండటం విశేషం. పీబీ సప్లయ్ చానల్ ఆయకట్టు.. ఈ చానల్ పరిధిలో సింగరాయకొండ, జరుగుమల్లి మండలాలలోని తొమ్మిది మీడియం ఇరిగేషన్ చెరువులకు పాలేరు పై జిల్లెళ్లమూడి వద్ద నిర్మించిన రిజర్వాయర్ ద్వారా సాగు నీరు సరఫరా అవుతుంది. రిజర్వాయర్ నుంచి సుమారు 30 కిలోమీటర్లు ఉన్న ఈ చానల్ ద్వారా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట చెరువుకు, సింగరాయకొండ మండల పరిధిలోని కలికవాయ పంచాయితీలో చవిటిచెరువు, మూలగుంటపాడు పంచాయతీలో జువ్వలగుంట చెరువు, పాకల పంచాయతీ పరిధిలోని కొత్తచెరువు, పాంచ్ చెరువు, సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని రాజు చెరువు, మర్రిచెరువు, కొండ్రాజుగుంట చెరువు, బింగినపల్లి పంచాయతీలోని బింగినపల్లి చెరువుకు నీరు సరఫరా అవుతుంది. ఈ చెరువుల పరిధిలో సుమారు 7 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా సుమారు 10 వేల ఎకరాలలో అనధికారికంగా సాగవుతోంది. ఈ చానల్ పరిధిలోని చెరువుల కింద ప్రధానంగా రబీలో వరి సాగు చేస్తారు. చెరువులు ఏటా రెండు సార్లు నిండితేనే ఆయకట్టులో పంట పూర్తిగా పండుతుంది. పూడికతో ఉన్న చానల్,రిజర్వాయర్.. రిజర్వాయర్ వద్ద ఇసుక మేట కారణంగా వర్షపునీటిని రిజర్వాయర్‌లో నిల్వ చేసే పరిస్థితి లేదు. రిజర్వాయర్‌లో పూడిక తీయాలని ఆయకట్టు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. రిజర్వాయర్ కందుకూరు నియోజకవర్గ పరిధిలో ఉండటంతో పాటు రిజర్వాయర్ చుట్లూ చుట్టు పక్కల గ్రామాల రక్షిత మంచినీటి పధకం బోర్లు ఉండటంతో తమ మంచినీటి స్కీములు దెబ్బతినే అవకాశం ఉందని ఆ ప్రాంత ప్రజలు అడ్డుపడటంతో రాజకీయ ప్రాబల్యం కారణంగా పూడికతీయక పోవటంతో చానల్ సక్రమంగా పారక ఆయకట్టు సక్రమంగా పండటం లేదని రైతులు వాపోతున్నారు. నాడు రెండు పంటలు.. పీబీ చానల్లో పూడిక పేరుకు పోయి ఉండటంతో సుమారు పాతికేళ్ల క్రితం ప్రభుత్వం పై ఆధారపడకుండా ఆయకట్టు రైతులు నడుంబిగించి సొంతంగా చానల్లో పూడిక తొలగించుకుని రెండు పంటలు పండించారు. తరువాత చానల్లో పూడికపేరుకు పోవడం, వర్షాభావ పరిస్థితులు తోడవటంతో ఒక్క పంటే పండిస్తున్నారు. జపాన్ నిధులు మాయం.. చానల్ అభివృద్ధికి 14.23 కోట్ల రూపాయల జపాన్ నిధులు మంజూరయ్యాయి. అయితే కాంట్రాక్టర్ పనులు నాసిరకంగా చేయడంతో పాటు 50 శాతం పనులు కూడా చేయలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. చివరికి నిధుల వినియోగానికి కాలపరిమితి ముగిసే లోపు 90 శాతం పనులు చేసినట్లు అధికా>రులు ప్రకటించడంతో రైతాంగం విస్తుపోయింది. ప్రశ్నార్థకంగా వరిసాగు.. పీబీ చానల్ పరిధిలోని ఆయకట్టు రైతాంగం గత మూడేళ్లగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడంతో ఆయకట్టు రైతులు వరిసాగు కన్నా జామాయిల్ సాగుపై ఆశక్తి చూపుతున్నారు. వర్షాభావ పరిస్థితులు కారణంగా నిరుడు కేవలం 600 ఎకరాలలో వరిసాగు చేయగా, ఈ సంవత్సరం కేవలం 100 ఎకరాలలో వరి కాకుండా వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఏటా చానల్లో సుమారు 10 నుంచి 15 రోజుల పాటు పారగా నిరుడు 5 రోజులు మాత్రమే నీరు పారింది. ఈ సంవత్సరం ఒక్కరోజు కూడా పారలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ ఏఈ విజయలక్ష్మి మాట్లాడుతూ రిజర్వాయర్ వద్ద ఆనకట్ట అభివృద్ధికి 20 లక్షల రూపాయలు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఇతర పనులకు ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదని చెప్పారు. -
రూ. కోటి ‘చెత్త’పాలు
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చెత్త సేకరణకు ఒక్కో పంచాయతీకి రెండు రిక్షాలను అందజేసింది. ఇవి కొన్ని పంచాయతీల్లో మినహాయిస్తే జిల్లాలోని దాదాపు 70శాతం గ్రామాల్లో మూలకు చేరాయి. ఈనేపథ్యంలో రిక్షాల కొనుగోలు కోసం కేటాయించిన రూ. కోట్ల నిధులు ‘చెత్త’ పాలయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్ పథకం లక్ష్యం మరింత దూరమవుతోంది. రిక్షాల నిర్వహణ భారం కావడంతోనే అవి నిరుపయోగంగా మారాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాక్షి, వికారాబాద్: జిల్లా పరిధిలో మొత్తం 367 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో స్వచ్ఛభారత్ మిషన్ కింద చెత్త రిక్షాలను నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుల్లో వేయాలని సూచించింది. అయితే, రిక్షాల నిర్వహణ భారం కావడంతో వీటిని దాదాపు 30 శాతం గ్రామపంచాయతీలు మాత్రమే వినియోగిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికగా పంచాయతీకి రెండు చొప్పున కేంద్ర ప్రభుత్వం మొత్తం 734 చెత్త రిక్షాలను నాలుగేళ్ల క్రితం పంపిణీ చేసింది. ప్రస్తుతం చాలా పంచాయతీల్లో ఇవి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. పంచాయతీలు రిక్షాల నిర్వహణకు ఒకో కార్మికుడికి నెలకు రూ. 2 వేలకు తక్కువ కాకుండా వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూ చించింది. అయితే, పంచాయతీల్లో నిధు ల లేమితో రిక్షాల నిర్వహణ భారంగా మారింది. దీంతో వాటిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పంచాయతీల్లో నిధుల కొరత కనిపిస్తున్నది. అభివృద్ధి పనుల కోసం 14వ ఆర్థిక సం ఘం నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. 2017 జూలై నెలలో రూ.14కోట్ల 50 లక్షలను ప్రభు త్వం పంచాయతీలకు విడుదల చేసింది. గ్రామాల్లో మురుగుకాలువలు, మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు, అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించారు. ఈనేపథ్యంలో డబ్బు ల కొరత ఏర్పడింది. చెత్త తరలించే రిక్షాలను నడిపే కూలీలకు జీతాలివ్వడం, రిక్షాలు మరమ్మతులు తదితరాలు పంచాయతీలు భారంగా పరిణమిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు ప్రత్యేకంగా కొన్ని నెలలుగా నిధులు అందకపోవడం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు కేంద్ర సర్కార్ పంపిణీ చేసిన చెత్త రిక్షాలను వినియోగించడం లేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఒక్కో రిక్షాకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు వెచ్చించింది. ఈలెక్కన రూ. కోటి నిధు లు ‘చెత్త’పాలయ్యాయనే విమర్శలు వినపడుతున్నాయి. కేంద్ర సర్కార్ ఉద్దే శం బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండడంతో ఇబ్బందులు తలె త్తుతున్నాయని చెప్పవచ్చు. పంచా యతీ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. నైపుణ్యమున్న కార్మికులు ఏరీ..? స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమం కింద పంపిణీ చేసిన రిక్షాలను నడపాలంటే నైపుణ్యమున్న (స్కిల్డ్) కార్మికులు అవసరం. వీరు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులకు తరలించాలి. డంపింగ్‌యార్డులు లేనిచోట గ్రామానికి దూరంగా వ్యర్థాలను పారబోయాల్సి ఉంటుంది. దీంతో పాటు రోడ్లను శుభ్రంచేయాలి. గ్రామంలోని వీధుల్లోని చెత్తను సైతం సేకరించాలి. ప్రస్తుతం పంచాయతీల్లో ఉన్న కార్మికులు రిక్షాలను నడపడం లేదు. కొత్తవారిని పెట్టుకుంటే వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామ పంచాయతీలు 14వ ఆర్థికసంఘం నిధులపై ఆధారపడ్డాయి. పంచాయతీలలో నిధుల లేమికి తోడు తక్కువ వేతనానికి చెత్త రిక్షాలను తోలడానికి కార్మికులు ముందుకు రాకపోవడం కూడా రిక్షాల నిరుపయోగానికి కారణంగా చెప్పుకోవచ్చు. రిక్షాలను వినియోగంలోకి తెస్తాం.. స్వచ్ఛభారత్ మిషన్ కింద చెత్త తరలించేందుకు కేంద్ర సర్కార్ రిక్షాలను అందజేసింది. చాలావరకు రిక్షాలను వినియోగిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. ఎక్కడైనా వీటిని ఉపయోగించకుంటే చర్యలు తీసుకుంటాం. చెత్త తరలించే రిక్షాలను వినియోగంలోకి తీసుకొస్తాం. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతాం. –మాజిద్, జిల్లా పంచాయతీ అధికారి -
బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 50వేలు మాయం
చాంద్రాయణగుట్ట: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అకౌంట్ నుంచి ఓ వినియోగదారుడికి చెందిన రూ. 50 వేలను గుర్తు తెలియని వ్యక్తులు డ్రా చేసిన ఘటన శాలిబండ ఠాణా పరిధిలో జరిగింది. బాధితుడి వివరాల ప్రకారం... జంగమ్మెట్ బస్తీకి చెందిన కె.గండిస్వామికి శంషీర్‌గంజ్ ఎస్బీఐలో (30036635471) అకౌంట్ ఉంది. ఈ ఖాతాలో రూ. 52 వేలు ఉన్నాయి. గురువారం ఉదయం బ్యాంక్ బ్యాలెన్స్ పరిశీలించగా కేవలం రూ. 2 వేలే ఉన్నాయి. కంగుతిన్న గండిస్వామి వెంటనే బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించగా... గత నెల 24న ముంబై, ఢిల్లీ నగరాలలోని ఏటీఎంల నుంచి రూ. 5 వేల చొప్పున 10 పర్యాయాలు డ్రా చేసినట్లు స్పష్టమైంది. దీంతో బాధితుడు గురువారం సాయంత్రం శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేశారు. ఈ కేసును సీసీఎస్‌కు కేసు బదిలీ చేస్తామన్నారు