
ఆవరణం..శ్వేతవర్ణం
అటు తెల్లని మబ్బులు.. ఇటు తెల్లని నూగు మాదిరి పూలు.. ఆకాశానికి ఆ మేఘాలు అందాన్ని తెస్తే.. ఈ గడ్డిపూలు నేలకు సరికొత్త సొబగులద్దాయి.
అటు తెల్లని మబ్బులు.. ఇటు తెల్లని నూగు మాదిరి పూలు.. ఆకాశానికి ఆ మేఘాలు అందాన్ని తెస్తే.. ఈ గడ్డిపూలు నేలకు సరికొత్త సొబగులద్దాయి. బూర్గంపాడు మండలం ఉప్పుసాక సమీపంలో కిన్నెరసాని సాగునీటి ఎడుమకాలువ గట్టుకు ఈ శ్వేతవర్ణ పూలు ఎంత సింగారాన్ని తెచ్చాయో చూడండి. కాలువలు తవ్వాక ఐదారేళ్లుగా నిరుపయోగంగా ఉంటున్న ప్రాంతంలో వికసించిన ఈ గడ్డిపూలను చూసిన వారు పులకించి పోతున్నారు. - బూర్గంపాడు