సందడిగా బీరప్ప జాతర
కురుబల ఆరాధ్యదైవమైన బీరప్పస్వామి జాతర మంగళవారం అనంతపురంలోని పాతూరు బీరప్ప స్వామి ఆలయం వద్ద సందడిగా సాగింది. సోమవారం అర్ధరాత్రి నుంచే బీరప్ప ఉత్సవ మూర్తులను భారీ ఎత్తున ఊరేగించారు. వేల సంఖ్యలో పాల్గొన్న భక్తాదుల నడుమ పాతూరు వీధుల్లో ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. పెద్ద ఎత్తున అన్నదానం జరిగింది.
- అనంతపురం కల్చరల్