ప్రారంభమై పన్నెండేళ్లు
రెండో దశ ‘చౌట్‌పల్లి’ పనులకు లభించని మోక్షం
అధికారుల నిర్లక్ష్యంతో {rయల్న్ర్ దశలోనే.. రూ.కోట్ల నిధులు వృథా!
మోర్తాడ్ : కమ్మర్‌పల్లి, మోర్తాడ్ మండలాల్లోని రైతాంగానికి సాగునీటినందించేందుకు నిర్మించిన చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమై పన్నెండేళ్లవుతున్నా సాగునీరు సక్రమంగా అందడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నారుు. రెండు మండలాల్లోని 20 గ్రామాల పరిధిలో 11వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2004 నవంబర్ 10న ఎత్తిపోతల పథకం పనులకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి మోర్తాడ్‌లో శంకుస్థాపన చేసి రూ.58కోట్లు మంజూరు చేశారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన గోదావరి బేసిన్ పథకం కింద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అరుుతే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎత్తిపోతల పనులు సక్రమంగా కొనసాగకపోవడంతో రైతాంగం ఆశించిన ఫలితాలు రావడం లేదు.
ఇప్పటికీ ట్రయల్న్ర్ దశలోనే ఉండిపోరుుంది. పైప్‌లైన్ పనులు నాసిరకంగా సాగడంతో తరచు లీకేజీలు ఏర్పడుతున్నారుు. చౌట్‌పల్లి, కోనసముందర్, అమీర్‌నగర్, బషీరాబాద్, సుంకెట్, రామన్నపేట్ గ్రామాలకు సాగు నీరందించేందుకు చేపట్టిన రెండో దశ పనులు ముందుకు సాగడం లేదు. నాలుగు రూట్లలోని నాలుగు పైప్‌లైన్‌లకు నీటిని విడుదల చేసిన ప్రతిసారి ఎక్కడో ఓ చోట లీకేజీలు ఏర్పడుతుండడంతో నీరు వృథాగా పోతోంది. దీంతో నీటి విడుదలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ప్రతి బడ్జెట్‌లో ఎత్తిపోతల పథకం నిర్వహణకు రూ.కోటి నుంచి రెండు కోట్ల నిధులు కేటారుుస్తున్నా తమకు మాత్రం ప్రయోజనం చేకూరడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఎత్తిపోతల పథకం అమలులో చోటు చేసుకున్న లోపాలను సరి చేసి సాగునీరందించాలని రైతులు కోరుతున్నారు.