భద్రాచలంపై ప్రభుత్వ వివక్ష | Bhadrachalam government discrimination | Sakshi
Sakshi News home page

భద్రాచలంపై ప్రభుత్వ వివక్ష

Published Tue, Sep 20 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

మాట్లాడుతున్న పోతినేని సుదర్శన్‌

మాట్లాడుతున్న పోతినేని సుదర్శన్‌

  • భద్రాచలంను జిల్లాగా ప్రకటించాలి
  • సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని

  • భద్రాచలం : భద్రాచలం నియోజకవర్గం ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షత ప్రదర్శిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి సుదర్శన్‌రావు, ఎమ్మెల్యే సున్నం రాజయ్యలు విమర్శించారు. మంగళవారం జరిగిన సీపీఎం డివిజన్‌ కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజనతో భద్రాచలం తీవ్రంగా నష్టపోయిందని, భద్రాచలం జిల్లా చేయడం ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. భద్రాచలం డివిజన్‌లో పుష్కలమైన సాగునీటి వనరులు ఉన్నాయని వాటిని వినియోగంలోకి తేవటంలో గత పాలకులు అనుసరించిన విధంగానే ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి ఊదరగొడుతున్న ప్రభుత్వం భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న ప్రగళ్ల పల్లి, వద్ధిపేట, మొడికుంట, గుండ్లేవాగు, చల్లవాగు, పాలెంవాగు ప్రాజెక్టుల నిర్మాణానికి, తాలిపేరు ప్రాజెక్టు, గుబ్బలమంగి ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు ఎందుకు ఇవ్వటంలేదని ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు అంటూ ఆర్భాటం, ప్రచారం తప్ప రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయని అసమర్ధ ప్రభుత్వమని వివర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం గ్రామ స్థాయిలో ఉద్యమాలను విస్తృత స్థాయిలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో కె. బ్రహ్మాచారి, బండారు రవికుమార్, ఐలయ్య, వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, కనకయ్య, నాయకులు వై. రవికుమార్, స్వామి, నర్సారెడ్డి, పుల్లయ్య, శంకర్‌రావు, లక్ష్మయ్య, చిలకమ్మ, వెంకట్‌రెడ్డి, కోటేశ్వరరావు, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.






     
     

Advertisement
Advertisement