నేటి నుంచి భవానీ దీక్షల స్వీకరణ | Bhavani deekshalu statrts today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి భవానీ దీక్షల స్వీకరణ

Published Wed, Nov 9 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

నేటి నుంచి భవానీ దీక్షల స్వీకరణ

నేటి నుంచి భవానీ దీక్షల స్వీకరణ

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కానుంది. భక్తులు మండల దీక్షను వేకువజామున అమ్మవారి సన్నిధిలో స్వీకరిస్తారు. మండల దీక్షల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 14వ తేదీ కార్తీక పౌర్ణమి వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది భవానీ దీక్షలను పురష్కరించుకుని మహామండపం, అమ్మవారి పాత మెట్లమార్గంలోని యాగశాలలో శ్రీ భవానీ యాగం నిర్వహించనున్నారు. అమ్మవారి ఉత్సవమూర్తిని మహామండపం ఆరో అంతస్తులోని అర్జీత సేవల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వేదికపై అలంకరిస్తారు. అమ్మవారి ఉత్సవ మూర్తితోపాటు అంతరాలయంలో మూలవిరాట్‌ పగడాలమాల ధరించి భక్తులకు దర్శనమిస్తారు. గురువారం ఉదయం 6.30 గంటలకు ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అఖండ జ్యోతి ప్రజ్వలనతో దీక్షలు ప్రారంభవుతాయి. డిసెంబర్‌ 4 నుంచి 6వ తేదీ వరకు అర్ధ మండల దీక్షలు ప్రారంభమవుతాయి. డిసెంబర్‌ 13వ తేదీన కలశజ్యోతి మహోత్సవం సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement