పావగడ : సరదాగా చేపలు పట్టడానికి వెళ్లిన విద్యార్థి నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకెళితే.. పావగడలోని రెయిన్‌గేజ్ వీధికి చెందిన ఉపాధ్యాయుడు అసదుల్లా కుమారుడు యాసిర్ ఖాన్(15) పదో తరగతి చదువుతున్నాడు. ఇతడు బుధవారం తన బంధువుల పిల్లలతో కలిసి చేపలు పట్టడానికి సమీపంలోని నల్లతీగలబండ గ్రామ రోడ్డు పక్కన ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లారు. ఈత సరిగారాని యాసిర్‌ఖాన్ నీటమునిగి బురదలో చిక్కుకుపోయాడు.
మిగతా పిల్లలు దిక్కుతోచక ఇంటికి వచ్చి పెద్దలకు విషయం తెలిపారు. వెంటనే వారు కుంటవద్దకు వెళ్లి యాసిర్‌ఖాన్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
ప్రాణం తీసిన చేపల సరదా
Published Wed, Jan 4 2017 10:43 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM
Advertisement
Advertisement