‘భద్రత’కు బ్రేక్ | Break to white rations cards under food sucurity | Sakshi
Sakshi News home page

‘భద్రత’కు బ్రేక్

Published Tue, May 17 2016 9:14 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

Break to white rations cards under food sucurity

 నిలిచిన ఆహార భద్రత కొత్త కార్డులు
 పెండింగ్‌లో 19,776 దరఖాస్తులు
 పట్టించుకోని అధికారులు
 ఇబ్బంది పడుతున్న పేదలు
 
 సాక్షిప్రతినిధి, వరంగల్ : పేదలకు సబ్సిడీతో నిత్యావసర సరుకులు లభించే ఆహార భద్రత(తెల్ల రేషన్) కార్డుల పంపిణీ జిల్లాలో నిలిచిపోయింది. మూడు నెలలుగా కొత్త కార్డులు జారీ చేయడం లేదు. దీనిపై జాయింట్ కలెక్టర్ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. దీంతో క్షేత్రస్థాయి అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్న అర్హులకు సైతం ఆహార భద్రత కార్డులు రాక వారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజా పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
 
 ఆహార భద్రత కార్డులకు ఆధార్‌తో లింక్ చేసి బోగస్ కార్డులను ఏరివేసింది. అనంతరం అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేస్తోంది. ఆహార భద్రత కార్డులతో ఒక్కో వ్యక్తికి నెలకు ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డు కోసం... తెల్ల కాగితంపై వివరాలను రాసి, ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీలతో స్థానిక మీసేవ కేంద్రంలో రూ.35 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 30 రోజుల్లో అధికారులు పరిశీలించి అర్హులా, కాదా అనేది నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అర్హుల వివరాలను సంబంధిత రేషన్ షాపునకు కేటాయిస్తారు.
 
 మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వాటిని మొదట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, తహసీల్దార్/ఏఎస్‌వో పరిశీలించి ధృవీకరించిన తర్వాత పౌరసరఫరాల జిల్లా అధికారి ఆమోదం కోసం పంపిస్తారు. ఇక్కడ తుది నిర్ణయం జరిగిన తర్వాత లబ్ధిదారులుగా నిర్ధారించి రేషన్ సరుకుల కోటా జారీ అవుతుంది. జిల్లాలో 9,72,211 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటిలో అంత్యోదయ కార్డులు 58,484, ఆన్నపూర్ణ కార్డులు 141, సాధారణ ఆహార భద్రత కార్డులు 9,13,586 ఉన్నాయి.
 
 ఇవి కాక 19,776 కుటుంబాల వారి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నారుు. అరుుతే ఈ కార్డులు ఇష్టారాజ్యంగా జారీ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ జిల్లాలోని తహసీల్దార్లను హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హులకు కార్డులు జారీ చేయాల్సిన అధికారులు మొత్తంగా పక్కన పెడుతున్నారు. దీంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు.
 
 ఆహార భద్రత కార్డులకు సంబంధించిన దరఖాస్తులు,
 అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న వివరాలు...
 కార్యాలయం    దరఖాస్తులు     ఆర్‌ఐ    ఎంఆర్‌వో/    డీఎస్‌వో     ఆమోదం    తిరస్కరించినవి
             ఏఎస్‌వో
 ఆత్మకూరు    117    117    0    0    0    0
 బచ్చన్నపేట    234    218    4    11    0    1
 భూపాలపల్లి    721    284    297    135    5    0
 చెన్నారావుపేట    207    190    0    12    5    0
 చేర్యాల    319    236    0    83    0    0
 చిట్యాల    126    105    16    5    0    0
 దేవరుప్పుల    202    127    0    74    1    0
 ధర్మసాగర్    415    410    5    0    0    0
 డోర్నకల్    441    282    0    159    0    0
 దుగ్గొండి    113    87    13    12    1    0
 ఏటూర్‌నాగారం    266    266    0    0    0    0
 గీసుకొండ    207    168    0    36    3    0
 గణపురం    186    115    0    70    1    0
 గణపురం(స్టే)    613    208    9    389    7    0
 గోవిందరావుపేట    95    75    10    10    0    0
 గూడూరు    232    232    0    0    0    0
 హన్మకొండ    3,128    2,549    385    149    45    0
 హసన్‌పర్తి    647    305    0    309    31    2
 జనగామ    322    315    0    7    0    0
 జనగామఅర్బన్    397    391    0    5    1    0
 కేసముద్రం    377    376    1    0    0    0
 ఖానాపురం    146    132    4    10    0    0
 కొడకండ్ల    431    369    6    54    2    0
 కొత్తగూడెం    226    146    26    53    1    0
 కురవి    232    167    11    50    4    0
 కార్యాలయం    దరఖాస్తులు     ఆర్‌ఐ    ఎంఆర్‌వో/    డీఎస్‌వో     ఆమోదం    తిరస్కరించినవి
             ఏఎస్‌వో
 లింగాలఘనపూర్    153    152    1    0    0    0
 మద్దూరు    356    138    10    198    8    2
 మహబూబాబాద్    494    346    147    0    1    0
 మంగపేట    667    609    53    5    0    0
 మరిపెడ    286    167    12    98    5    4
 మొగుళ్లపల్లి    309    304    0    2    3    0
 ములుగు    150    149    1    0    0    0
 నల్లబెల్లి    203    36    5    143    4    15
 నర్మెట్ట    252    189    0    63    0    0
 నర్సంపేట    208    122    3    79    4    0
 నర్సింహులపేట    159    158    1    0    0    0
 నెక్కొండ    247    223    0    21    2    0
 నెల్లికుదురు    360    194    0    166    0    0
 పాలకుర్తి    412    274    13    123    2    0
 పరకాల    299    206    0    90    3    0
 పర్వతగిరి    143    129    2    11    1    0
 రఘునాథపల్లి    377    145    40    192    0    0
 రాయపర్తి    202    157    0    45    0    0
 రేగొండ    175    175    0    0    0    0
 సంగెం    196    135    17    34    10    0
 శాయంపేట    200    149    51    0    0    0
 తాడ్వాయి    61    51    0    9    1    0
 తొర్రూర్    520    510    0    2    0    0
 వెంకటాపూర్    219    153    49    16    1    0
 వరంగల్‌అర్బన్    2194    1830    79    243    41    1
 వర్దన్నపేట    363    228    2    120    11    2
 జఫర్‌గడ్    171    170    0    1    0    0
 మొత్తం    19776    14977    1273    3294    205    27

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement