-
నిందితుల అరెస్ట్, రిమాండ్
కొత్తూరు : ఎకరా పొలం కోసం సొంత అన్న, వదిన, ఆమె చెల్లెలు ముగ్గురు కలిసి పథకం ప్రకారం తమ్ముడిని హత్య చేశారు. ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రూరల్ సీఐ మధుసూదన్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.. కొందుర్గు మండలం చిన్నఉమ్మెంత్యాల గ్రామానికి చెందిన ఆనెగళ్ల గండయ్య, భీమయ్య(35) అన్నదమ్ములు. వీరికి గ్రామంలో ఒక ఎకరం పొలం ఉంది. కాగా అన్న గండయ్య జీవనోపాధి కోసం షాద్‌నగర్‌కు భార్య బాలమణితో పాటు వచ్చి కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. భీమయ్యకు మూర్చ వ్యాధి ఉండడంతో పెళ్లి కాకుండా గ్రామంలోనే తల్లి లక్ష్మమ్మతో పాటు ఉంటు ఎకరా పొలాన్ని సాగు చేసుకుంటున్నాడు. తరచుగా పొలం వద్దకు వచ్చే అన్న గండయ్యపై భీమయ్య దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో తనపై దాడి చేస్తున్న తమ్ముడు భీమయ్యను ఎలాగైన హత్య చేసి ఎకరా పొలాన్ని కాజేయాలని గంగయ్య పథకం పన్నాడు. ఇందులో భాగంగా నమ్మకం కల్పించి తనను పనికోసం షాద్‌నగర్‌కే రమ్మని చెప్పి జూన్ 16వ తేదీన తమ్ముడు భీమయ్యకు ఫోన్‌చేసి పిలుపించుకున్నాడు. వస్తువులు తీసుకురావడానికి తెలిసిన వారి ఆటో కొత్తూరు మండలం తిమ్మాపూర్‌లో ఉందని చెప్పి తన భార్య బాలమణితో కలిసి ముగ్గురు తిమ్మాపూర్‌కు వచ్చి అక్కడ మధ్యం దుకాణంలో మద్యం సేవించారు. మ్మరిగూడలోని ఓ రియల్ వెంచర్‌లోకి తీసుకెళ్లారు. మళ్లీ అక్కడ మద్యం సేవించగా మత్తులో ఉన్న భీమయ్యను ముగ్గురు కలిసి గొంతుకు కేబుల్ వైరు బిగించి హత్య చేశారు. ఇందులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు మతుడి తల్లి లక్ష్మమ్మను స్టేషన్‌కు పిలిపించి అతను ధరించిన వస్తువులను చూపించడంతో అవి తన కుమారుడివేనని గుర్తు పట్టింది. దీంతో అనుమానంతో పోలీసులు మతుడి అన్న గండయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా తాను తన భార్య బాలమణి, ఆమె చెల్లెలు సువర్ణ కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కేసును చేదించిన పోలీసులను సీఐ అభినందించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ శ్రీశైలం తదితరులు ఉన్నారు.