kothur
-
CREDAI: అందుబాటు గృహాలకు స్థలాలు కేటాయించండి!
సాక్షి, హైదరాబాద్: సామాన్య, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేయాలంటే అందుబాటు గృహాలను నిర్మించాలి. చందన్వెల్లి, కొత్తూరు వంటి పలు ప్రాంతాలలో తయారీ రంగం అభివృద్ధి చెందింది. ఆయా ప్రాంతాలలో రూ.50 లక్షల లోపు ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్‌కు డిమాండ్ ఉంది. కానీ, స్థలాలు అందుబాటులో లేవు. ప్రభుత్వం చొరవ తీసుకొని రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కలి్పంచడంతో పాటు స్థలాలను అందించాలని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐటీ, ఫార్మా రంగాలతో అభివృద్ధి పశి్చమ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఆయా ప్రాంతాలలో లగ్జరీ ప్రా జెక్ట్లు ఎక్కువగా వస్తున్నాయి. ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యుని సొంతింటి కల మరింత భారంగా మా రిందని, దీనికి పరిష్కారం అందుబాటు గృహాల నిర్మాణమేనని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వీ రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ చుట్టూ స్థలాలను గుర్తించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఆయా గృహాలను విక్రయిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలి మహిళా గృహ కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతానికి తగ్గించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఈ పథకం అమలు చేశారని గుర్తు చేశారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డుల మధ్య రేడియల్ రోడ్లు, లింక్ రోడ్లను నిర్మించాలని కోరారు. ప్రస్తుతం నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు మాత్రమే చేస్తున్నామని, అనుమతులు మాత్రం భౌతికంగానే జారీ అవుతున్నాయని తెలిపారు. అనుమతులను కూడా ఆన్లైన్లో జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
టై అండ్ డైలో ఇది ‘ఆంధ్రా పోచంపల్లి’
‘పోచంపల్లి’ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే... టై అండ్ డై శారీస్, డ్రెస్ మెటీరియల్ అమ్మకానికి సంబంధించి ముప్పై లక్షలకు పైగా రిజల్ట్స్ వస్తాయి! తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలో అయిదు వేలలోపు జనాభా గల పోచంపల్లి నేడు టై అండ్ డై (ఇక్కత్) చేనేత, పట్టు వస్త్రాలకు ప్రపంచ రాజధాని. పోచంపల్లి టై అండ్ డైకి దాదాపు నూరేళ్ళ చరిత్ర ఉన్నప్పటికీ, 2005 నుంచి ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఇందుకు ముఖ్య కారణం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో పోచంపల్లికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) లభించడం. ఈ గుర్తింపు ద్వారా ఈ వస్త్రాల తయారీ ప్రత్యేకతలకు మేధాపర మైన – చట్టబద్ధమైన హక్కులు లభించాయి. ఈ క్రమంలో పోచంపల్లిని యునైటెడ్ నేషన్స్ సంస్థ యూఎన్‌డబ్ల్యూటీఓ ‘పర్యాటకులు దర్శించదగిన గ్రామం’గా గుర్తించింది. కానీ ‘కొత్తూరు’ అని సెర్చ్ చేస్తే దాదాపు రిజల్ట్స్ నిల్! నిజానికి పోచంపల్లి వృక్షమైతే, కొత్తూరు అదే వృక్షపు బీజం! పల్నాడు జిల్లా, మాచర్ల రూరల్ మండలం, కొత్తూరు గ్రామం కేంద్రంగా టై అండ్ డై శారీస్, డ్రెస్ మెటీరియల్ వస్త్రాలను నేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో టై అండ్ డై వస్త్రాలు రూపొందుతున్నది కొత్తూరులోనే!! సాధారణ చేనేత వస్త్రాలు, మిల్లు వస్త్రాలు తయారైన తదుపరి... వస్త్రాలపై రంగులు అద్దుతారు. అవి పై పై రంగులు. టై అండ్ డై విధానంలో వస్త్రం తయారీ పూర్వదశలోనే నూలు దారాలు వర్ణమయమవుతాయి. ముందుగా రూపొందించిన డిజైన్లకు అనుగుణంగా రంగులు అవసరం లేని చోట్ల రబ్బరుతో కట్టి(టై), అవసరమైన చోట్ల రంగులో ముంచుతారు (డై). రంగులలో రసాయనాల శాతం తక్కువ. నూలు దారాల దశలోనే ఈ వస్త్రానికి సహజత్వం, మృదుత్వం, మన్నిక చేకూరుతాయి. మిల్లు యంత్రాలు టై అండ్ డైతో పోటీ పడలేవు. డిజైన్లను వినియోగదారుల అభిరుచిని బట్టి రూపొందిస్తారు. కనీస ధర పదివేల రూపాయలు. లక్ష రూపాయలు పలికే హుందాగా ఉండే టై అండ్ డై చీరలు ధరించడం వీఐపీలకు ఒక స్టేటస్ సింబల్. మైక్రోసాఫ్ట్, ఎయిర్ ఇండియా తదితర సంస్థలు తమ ఉద్యోగులకు ఈ వస్త్రాలను అధికారికంగా వాడుతూ ప్రోత్సహిస్తున్నాయి. జపాన్, యూఏఈ తదితర దేశాలు డ్రెస్ మెటీరియల్, కర్టెన్లు, బెడ్షీట్లు దిగుమతి చేసుకుంటున్నాయి. నూటికి నూరు శాతం డిమాండ్ ఉన్న పోచంపల్లి టై అండ్ డై విదేశీ మారక ద్రవ్యం, జీఎస్టీ సమకూర్చడంలో అగ్రగామిగా ఉంది. పోచంపల్లి వాస్తవానికి ఒక బ్రాండ్ ఇమేజ్. పోచంపల్లి బ్రాండ్ పేరుతో ఏటా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్న టై అండ్ డై వస్త్రాలలో... పోచంపల్లి గ్రామంలో తయారయ్యే వస్త్రాలు అయిదు శాతం మాత్రమే! పుట్టపాక, గట్టుప్పల్, చండూరు, సిరిపురం, వెల్లంకి, కొయ్యలగూడెం తదితర పాత నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన గ్రామాలలో 75 శాతం తయారవుతాయి. మిగిలిన ఇరవై శాతం ‘ది నాగార్జున వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ కొత్తూరు’ ఆధ్వర్యంలో తయారవుతాయి. సాధారణ చేనేత వస్త్రకారుని నెలసరి రమారమి ఆదాయం అయిదు వేల రూపాయల కంటే తక్కువ. తెలంగాణలో పోచంపల్లి బ్రాండ్ వస్త్రకారుల ఆదాయం నెలకు రూ. 30 వేలు. అదే వస్త్రాన్ని కొత్తూరు కేంద్రంగా నేస్తున్న వస్త్రకారునికి నెలకు వచ్చే ఆదాయం పదివేల రూపాయలు మాత్రమే! దీనికి కారణం కొత్తూరు వస్త్రాలకు బ్రాండ్ ఇమేజ్ లేకపోవడమే! కొత్తూరు సొసైటీ పరిధిలోని గ్రామాల టై అండ్ డై నేతకారులు పోచంపల్లి, పుట్టపాక తదితర గ్రామాలకు వెళ్లి ముడి నూలును, సిల్క్‌ను కొనాలి. లేదా అక్కడ నుంచి ముడి నూలు తెచ్చిన వారి కోసం ఇక్కడ టై అండ్ డై చేసి, నేసి, అక్కడికి వెళ్లి ఇవ్వాలి. హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న పోచంపల్లి సహకార సంస్థల వారు, విడిగా వ్యాపార సంస్థలకు చెందిన వారు బెంగళూరు నుంచి డైరెక్టుగా సిల్క్ ముడి సరుకు తెప్పించుకుంటారు. పరిసర గ్రామాలకు నూలు ఇచ్చి తయారైన వస్త్రాన్ని వారే తీసుకెళ్లి దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేసుకుంటారు. పోచంపల్లి వ్యవస్థీకృతం అయింది. ఇటీవలి కాలంలో కొత్తూరు చేనేత వస్త్రకారులతో రెంటచింతల, దాచేపల్లి, మాచవరం తదితర గ్రామాల చేనేత వస్త్రకారులకు రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ విభాగం అధికారులు టై అండ్ డై శిక్షణ కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు. కానీ వసతుల లేమి వల్ల ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వలేకపోతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని ఇక్కడి నేతకార్మికులు కోరుకుంటున్నారు. కొత్తూరు శ్రీ నాగార్జున చేనేత సహకార సంఘం కాలనీకి విశాలమైన స్థలం ఉంది. ఇక్కడ అన్ని వాతావరణాలను తట్టుకునే రీతిలో, శాశ్వత భవనం ఏర్పాటు చేయాలి. ఏడాది పొడవునా, పగలూ రాత్రీ టై అండ్ డై నేర్పే రీతిలో కనీసం 20 మగ్గాలతో ట్రైనింగ్ హాల్ నిర్మించాలి. తదనుగుణంగా నివాస వసతులు, రంగులు వేసుకునే గదులు నిర్మించాలి. నూలును బెంగళూరు నుంచి ఖరీదు చేసి నిల్వ ఉంచాలి. ముడిపదార్థాలు తెచ్చేందుకు, సమీప గ్రామాల్లో వస్త్రకారులకు అందజేసేందుకు, తయారైన వస్త్రాలను గుంటూరు – విజయవాడ, గన్నవరం విమానాశ్రయం, తదితర మార్కెటింగ్‌కు అనువైన ప్రాంతాలకు సరఫరా చేసేందుకు తగిన వాహన సౌకర్యం కల్పించాలి. ముఖ్యంగా సృజనాత్మకత కలిగిన ఆకట్టుకునే డిజైన్లు రూపొందించే చేనేత సామాజిక వర్గానికి చెందిన టై అండ్ డై గురించి అవగాహన కలిగిన ఆధునిక యువతకు అవకాశాలు కల్పించాలి. హ్యాండ్లూమ్ వీవర్స్ కోసం ముద్ర లోన్స్‌ను, ఆన్లైన్ పోర్టల్ ద్వారా సబ్సిడీతో ఇప్పించేందుకు అధికా రులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోచంపల్లి జీఐ సాధించింది. ప్రస్తుతం వారి తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ‘నేనున్నాను’ అనే వారి మాట కోసం కొత్తూరు ఎదురు చూస్తోంది! (క్లిక్: గట్లు తెగకపోవడానికి ఆయనే కారణం) - పున్నా కృష్ణమూర్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ -
వందల్లో వచ్చే బిల్లులు ఒక్కసారిగా వేలల్లోకి!
సాక్షి, రంగారెడ్డి: ప్రతి నెల వందల రూపాయల్లో వచ్చే విద్యుత్ బిల్లులు ఒక్కసారిగా వేల రూపాయలు రావడంతో కొత్తూరు మండలంలోని ఇన్ముల్ నర్వ గ్రామస్తులు కంగుతిన్నారు. కరెంట్ బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన సిబ్బందిని శుక్రవారం అడ్డుకున్నారు. వందల్లో వచ్చే కరెంట్ బిల్లులు వేలల్లో రావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో ఇంటికి 11వేల రూపాయల నుంచి 20వేల రూపాయల వరకు బిల్లులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ ఇళ్లకు సుమారు రూ.200 వందల నుంచి 400 వరకు బిల్లులు వచ్చేవని ఈ నెల మాత్రం 11 వేల రూపాయల నుంచి 15 వేల బిల్లులు వచ్చాయని తెలిపారు. కాయ కష్టం చేసుకొని బతికే తాము ఇన్ని బిల్లులు ఎలా కట్టాలని సిబ్బందిని నిలదీశారు. అసలే కరోనా లాక్‌డౌన్‌తో బతుకులు దుర్భరంగా మారాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్న చందంగా చేస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. (చదవండి: కేటీఆర్‌కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు) -
ఠాణా ఎదుట ఆత్మహత్యాయత్నం
సాక్షి, కొత్తూరు: భూమి విషయంలో పోలీసులు తమను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ తండాకు చెందిన పలువురు రైతులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ధర్నా చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఓ గిరిజన యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎస్ఐ కృష్ణతో పాటు షాద్‌నగర్‌కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి భూమికి సంబంధించిన గొడవలో జోక్యం చేసుకుంటూ తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని, వ్యాపారులతో కుమ్మక్కై తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. ఈ క్రమంలో తండాకు చెందిన యువకుడు రాజేందర్ స్టేషన్ ఆవరణలో సీఐ, ఎస్ఐ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. వెంటనే తండావాసులు అప్రమత్తమై అతడి నుంచి డబ్బాను లాక్కొని నీళ్లు చల్లారు. అనంతరం మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. సివిల్ విషయంతో పోలీసులు తలదూర్చమని హమీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని భీష్మించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఇముల్‌నర్వ గ్రామ శివారులో సర్వే నంబర్ 293, 295, 296, 307, 309, 325లోని సుమారు 64 ఎకరాల భూమిని కొన్నేళ్లుగా తాము కాస్తులో ఉండి సాగు చేసుకుంటున్నామని, అయితే ఇటీవల తమ తండావాసులు కొందరు భూమిని విక్రయించారని తెలిపారు. ఆ భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు మధ్యలో ఉన్న పొలాలకు దారి ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. మాజీ సర్పంచ్ అరెస్టుతో.. ఇన్ముల్‌నర్వ తండాకు చెందిన మాజీ సర్పంచ్ మిట్టునాయక్ గురువారం ఉదయం జేపీ దర్గా ఆవరణలో ఉండగా కొత్తూరు ఎస్ఐ కృష్ణ, సీఐ చంద్రబాబు అతడిని తమ కారులో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు, తండావాసులు దాదాపు 100 మంది ఠాణాకు చేరుకున్నారు. పోలీసులు వ్యాపారులతో కుమ్మక్కై తమపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. వివాదం ఉన్న పొలానికి మిట్టునాయక్‌కు సంబంధం లేకున్నా అకారణంగా ఆయనను ఎందుకు ఠాణాకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఎస్ఐ కృష్ణ మాట్లాడుతూ.. తాము వ్యాపారులతో కుమ్మక్కు కాలేదని స్పష్టం చేశారు. వ్యాపారులు కట్టిన గోడను తండావాసులు కూలగొట్టడంతో వ్యాపారుల ఫిర్యాదు మేరకు తండావాసులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చట్ట ప్రకారమే తాము వ్యవహరించామన్నారు. -
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
నందిగామ(కొత్తూరు): మొక్కల సంరక్షించి అందరూ తమ బాధ్యతగా తీసుకోవాలని మండల పరిధిలోని నందిగామ సర్పంచ్ కొమ్ముకష్ణ కోరారు. గురువారం పంచాయతీ పరిధిలోని పెద్దగుట్టతాండ, బండకుంటతాండలో మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం తాండలో పలుచోట్ల మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించినప్పుడే ఫలితం ఉంటుందన్నారు. కార్యక్రమంలో తాండవాసులు, మహిళసంఘం సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. -
చైన్‌స్నాచర్స్ అరెస్ట్ ..రిమాండ్‌కు తరలింపు
కొత్తూరు: చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. షాద్‌నగర్ రూరల్ సీఐ మ«ధుసూధన్, ఎస్ఐ శ్రీశైలం తెలిపిన వివరాలు.. ఈ నెల 17న∙తిమ్మాపూర్ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఓ ద్విచక్ర వాహనంపై అనుమానప్పదంగా ఉన్న హైదరాబాద్ పట్టణానికి చెందిన సురాజ్, సుమన్‌లను తనిఖీ చేయగా వారి వద్ద మూడు తులాల బంగారు పుస్తెలతాడు లభ్య మైంది. దీంతో వారిని స్టేషన్‌కు తరలించి విచారించగా ఓ కేసులో భాగంగా షాద్‌నగర్ కోర్టుకు బైకుపై వెళ్తుండగా నందిగామ గ్రామ శివారులో కాలినడకన వస్తున్న గ్రామానికి చెందిన కిష్టమ్మ(60) మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు అపహరించుకుని కోర్టుకు హాజరైయ్యారు. వీరిని తిరుగు ప్రయాణంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఇప్పటికే వీరిపై హైదరాబాద్, షాద్‌నగర్‌తో పాటు పలు పోలీస్స్టేషన్ల పరిధిలో 9 చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. -
ఎకరా పొలం కోసం తమ్ముడి హత్య
కేసును ఛేదించిన పోలీసులు నిందితుల అరెస్ట్, రిమాండ్ కొత్తూరు : ఎకరా పొలం కోసం సొంత అన్న, వదిన, ఆమె చెల్లెలు ముగ్గురు కలిసి పథకం ప్రకారం తమ్ముడిని హత్య చేశారు. ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రూరల్ సీఐ మధుసూదన్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.. కొందుర్గు మండలం చిన్నఉమ్మెంత్యాల గ్రామానికి చెందిన ఆనెగళ్ల గండయ్య, భీమయ్య(35) అన్నదమ్ములు. వీరికి గ్రామంలో ఒక ఎకరం పొలం ఉంది. కాగా అన్న గండయ్య జీవనోపాధి కోసం షాద్‌నగర్‌కు భార్య బాలమణితో పాటు వచ్చి కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. భీమయ్యకు మూర్చ వ్యాధి ఉండడంతో పెళ్లి కాకుండా గ్రామంలోనే తల్లి లక్ష్మమ్మతో పాటు ఉంటు ఎకరా పొలాన్ని సాగు చేసుకుంటున్నాడు. తరచుగా పొలం వద్దకు వచ్చే అన్న గండయ్యపై భీమయ్య దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో తనపై దాడి చేస్తున్న తమ్ముడు భీమయ్యను ఎలాగైన హత్య చేసి ఎకరా పొలాన్ని కాజేయాలని గంగయ్య పథకం పన్నాడు. ఇందులో భాగంగా నమ్మకం కల్పించి తనను పనికోసం షాద్‌నగర్‌కే రమ్మని చెప్పి జూన్ 16వ తేదీన తమ్ముడు భీమయ్యకు ఫోన్‌చేసి పిలుపించుకున్నాడు. వస్తువులు తీసుకురావడానికి తెలిసిన వారి ఆటో కొత్తూరు మండలం తిమ్మాపూర్‌లో ఉందని చెప్పి తన భార్య బాలమణితో కలిసి ముగ్గురు తిమ్మాపూర్‌కు వచ్చి అక్కడ మధ్యం దుకాణంలో మద్యం సేవించారు. మ్మరిగూడలోని ఓ రియల్ వెంచర్లోకి తీసుకెళ్లారు. మళ్లీ అక్కడ మద్యం సేవించగా మత్తులో ఉన్న భీమయ్యను ముగ్గురు కలిసి గొంతుకు కేబుల్ వైరు బిగించి హత్య చేశారు. ఇందులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు మతుడి తల్లి లక్ష్మమ్మను స్టేషన్‌కు పిలిపించి అతను ధరించిన వస్తువులను చూపించడంతో అవి తన కుమారుడివేనని గుర్తు పట్టింది. దీంతో అనుమానంతో పోలీసులు మతుడి అన్న గండయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా తాను తన భార్య బాలమణి, ఆమె చెల్లెలు సువర్ణ కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కేసును చేదించిన పోలీసులను సీఐ అభినందించారు. ఈ సమావేశంలో ఎస్ఐ శ్రీశైలం తదితరులు ఉన్నారు. -
యంగ్ ఇండియా
కొత్తూరు: యువత సరికొత్త ఆలోచనలతో అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ముందుకుసాగాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆకాంక్షించారు. ప్రస్తుతం దేశంలో 52శాతం యువత ఉందని, వారు అన్ని రంగాల్లో రాణిస్తే దేశం యంగ్ ఇండియాగా అవతరిస్తుందని అభివర్ణించారు. మండలంలోని మామిడిపల్లి పంచాయతీ మొదళ్లగూడ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన సింబాయాసిస్ అంతర్జాతీయ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలతోపాటు పలు ప్రముఖ వ్యాపారాల్లో 30ఏళ్లలోపు వారే రాణిస్తున్నారని, వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో హైదారాబాద్ ఎడ్యుకేషనల్ హబ్‌గా మారనుందని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విద్యావ్యవస్థ అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదారాబాద్‌లో ఏర్పాటుచేసిన సింబయాసిస్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో హైదారాబాద్ ఎడ్యుకేషనల్ హబ్‌గా మారనుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి బహుళజాతి పరిశ్రమలు రాష్ట్రానికి త్వరలో మరిన్ని బహుళజాతి పరిశ్రమలు రానున్నాయని మంత్రి కే. తారకరామారావు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు రాజకీయ పార్టీలు, నాయకులు తెలంగాణ ఏర్పాౖటెతే మున్ముందు అన్ని ఇబ్బందులే ఉంటాయని ఎద్దేవాచేశారని గుర్తుచేశారు. వారు చేసిన విమర్శలు అన్ని తప్పు అనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా కూడా అమలు కాని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నామని వివరించారు. ఇప్పటికే హైదారాబాద్ మహానగరం శివారు ప్రాంతాల్లో ప్రపంచంలోనే పేరొందిన నాలుగు బహుళజాతి పరిశ్రమలు ఏర్పాౖటెనట్లు వివరించారు. హైదారాబాద్ సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యూనివర్సిటీలు ఏర్పాటు కావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. అనంతరం సింబాయాసిస్ యూనివర్సిటీ ప్రాంగణంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, జెడ్పీవైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ శివశంకర్‌గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వీర్లపల్లి శంకర్, రాంబాల్‌నాయక్, సర్పంచ్ శోభారెడ్డి, ఎంపీడీఓ జ్యోతి, తహసీల్దార్ నాగయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కేంద్రమంత్రికి ఏఎన్ఎంల వినతి 2వ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్రఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రం అందించినట్లు సీఐటీయూ నాయకులు సాయిబాబా తెలిపారు. కొంతకాలంగా సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను అవమానించారని.. సింబాయాసిస్ అంతర్జాతీయ యూనివర్సిటీ హైదారాబాద్ క్యాంపస్‌ను ప్రారంభించిన సందర్భంగా యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన వేదికపైకి ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను ఆహ్వానించలేదని ఆరోపిస్తూ పలువురు టీఆర్ఎస్ నాయకులు సభలో కేంద్రమంత్రి ముందే గందరగోళం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యేను అవమానించడం తగదంటూ నినాదాలు చేశారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు సమావేశం మధ్యలో నుంచి అలిగి వెళ్లిపోయారు. ఇంతలో వేదికపై ఉన్న మంత్రి కేటీఆర్ కిందకు దిగి ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలకు నచ్చజెప్పారు. అయినప్పటికీ కొందరు కార్యకర్తలు ససేమిరా అనడంతో మంత్రి కేటీఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్యే వేదికపై కూర్చున్నారు. ‘వలసలు నియంత్రించాలి’ కొత్తూరు : జిల్లా నుంచి ప్రతి సంవత్సరం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలసలను నియంత్రించాలని కోరుతూ కేంద్ర అర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకు వినతిపత్రం అందించినట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవర్ధన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మీదుగా వందల కిలోమీటర్ల మేర నదులు ప్రవహిస్తున్నప్పటికీ ఇక్కడ తాగునీటి, సాగునీటి కోసం ప్రజలు,రైతులు తీవ్రఇబ్బందులుపడాల్సి వస్తుం దన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో ప నులు లేక సుమారు 15 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వ లసలు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే స్పందించి జిల్లాలో ప్రజలకు పనులు కల్పించి వలసలను నియంత్రించే విధం గా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. -
రోడ్డుప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడి కుమారుడు మృతి
కొత్తూరు (మహబూబ్‌నగర్ జిల్లా) : కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఇబ్రహీం కుమారుడు మాలిక్(24) మృతిచెందాడు. బైక్‌పై హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వెళ్తుండగా మార్గమధ్యంలో తిమ్మాపూర్ వద్ద అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలపాలైన మాలిక్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలొదిలాడు. మృతుడు గతంలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం కుమారుడు. పార్టీలో ఇమడలేక ఇబ్రహీం టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు మారాడు. -
నలుగురు చైన్‌స్నాచర్లు అరెస్ట్
కొత్తూరు (మహబూబ్‌నగర్) : ఒంటరి మహిళలను అనుసరిస్తూ.. వాళ్లు ఆదమరిచి ఉన్న సమయంలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 16 తులాల బంగారు ఆభరణాలతో పాటు స్నాచింగ్‌కు ఉపయోగించిన 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. షాద్‌నగర్, వనపర్తి, కొత్తకోట పోలీస్స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ ముఠా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి
కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మండలంలోని కురుపాం గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామనికి చెందిన ఎం. శంకరరావు(19) ఇసుక ట్రాక్టర్లో వస్తుండగా జారి పడటంతో అదే ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. ఎస్ఐ ఉదయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.