కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఇబ్రహీం కుమారుడు మాలిక్(24) మృతిచెందాడు.
కొత్తూరు (మహబూబ్‌నగర్ జిల్లా) : కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఇబ్రహీం కుమారుడు మాలిక్(24) మృతిచెందాడు. బైక్‌పై హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వెళ్తుండగా మార్గమధ్యంలో తిమ్మాపూర్ వద్ద అదుపు తప్పి కిందపడ్డాడు.
తీవ్రగాయాలపాలైన మాలిక్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలొదిలాడు. మృతుడు గతంలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం కుమారుడు. పార్టీలో ఇమడలేక ఇబ్రహీం టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు మారాడు.