చైన్‌స్నాచర్స్ అరెస్ట్ ..రిమాండ్‌కు తరలింపు
Published Fri, Aug 19 2016 1:09 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
కొత్తూరు: చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. షాద్‌నగర్ రూరల్ సీఐ మ«ధుసూధన్, ఎస్‌ఐ శ్రీశైలం తెలిపిన వివరాలు.. ఈ నెల 17న∙తిమ్మాపూర్ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఓ ద్విచక్ర వాహనంపై అనుమానప్పదంగా ఉన్న హైదరాబాద్ పట్టణానికి చెందిన సురాజ్, సుమన్‌లను తనిఖీ చేయగా వారి వద్ద మూడు తులాల బంగారు పుస్తెలతాడు లభ్య మైంది. దీంతో వారిని స్టేషన్‌కు తరలించి విచారించగా ఓ కేసులో భాగంగా షాద్‌నగర్ కోర్టుకు బైకుపై వెళ్తుండగా నందిగామ గ్రామ శివారులో కాలినడకన వస్తున్న గ్రామానికి చెందిన కిష్టమ్మ(60) మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు అపహరించుకుని కోర్టుకు హాజరైయ్యారు. వీరిని తిరుగు ప్రయాణంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఇప్పటికే వీరిపై హైదరాబాద్, షాద్‌నగర్‌తో పాటు పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 9 చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు.
Advertisement