ముగిసిన బన్ని ఉత్సవాలు | Bunny festival over | Sakshi
Sakshi News home page

ముగిసిన బన్ని ఉత్సవాలు

Published Sun, Oct 16 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

ముగిసిన బన్ని ఉత్సవాలు

ముగిసిన బన్ని ఉత్సవాలు

–నెరణికికి చేరిన మాళమల్లేశ్వరస్వామి విగ్రహాలు

హొళగుంద: శ్రీమాళమల్లేశ్వరస్వామి విగ్రహాలు శనివారం నెరణికి గ్రామానికి చేరడంతో దేవరగట్టు  బన్ని మహోత్సవాలు  ముగిశాయి.   అంతకు ముందు దేవరగట్టు  కొండపై ఉన్న ఆలయంలో ఉత్సవమూర్తులకు పూజారి గిరిస్వామి మహామంగళహారతి, అభిషేకలు నిర్వహించారు.  విగ్రహాలు గ్రామంలోకి  వస్తున్న విషయాన్ని తెలుసుకున్న నెరణికి గ్రామస్తులు స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గ్రామంలో ఊరేగింపు నిర్వహించి  విగ్రహాలను ఆలయంలోపలికి తీసుకెళ్లారు. దీంతో గ్రామంలో పండగ వాతవరణం నెలకొంది. బన్ని ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా సహకరించిన గ్రామస్తులకు ఆదోని డీఎస్పీ కొల్లిశ్రీనివాసులు, ఆలూరు సీఐ శంకరయ్య, ఎస్‌ఐ మారుతి అభినందించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement